అన్వేషించండి

Virat Kohli: వీడియో కాబట్టి సరిపోయింది - రేపు ఇంకేదైనా జరిగితే - బాధ్యత ఎవరిది?

విరాట్ కోహ్లీ రూం మాత్రమే వీడియో తీశారు కాబట్టి సరిపోయింది. ఒకవేళ జరగరానిది ఏమైనా జరిగుంటే?

ప్రపంచవ్యాప్తంగా భారతీయ క్రికెటర్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అనడటంతో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత భారత క్రికెటర్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్.  కానీ కొన్నిసార్లు అభిమానులు వారి అత్యుత్సాహంలో కొన్ని లిమిట్స్ దాటుతూ ఉంటారు. టీ20 ప్రపంచ కప్ కోసం సన్నాహక దశలో భారత జట్టు బస చేసిన పెర్త్‌లోని హోటల్‌లో సరిగ్గా అదే జరిగింది.

విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వీడియో క్లిప్ ద్వారా తన ప్రైవసీకి భంగం కలిగించినట్లు వెల్లడించాడు. ఈ వీడియో వాస్తవానికి టిక్‌టాక్‌లో గుర్తుతెలియని వినియోగదారుడు అప్‌లోడ్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. 'కింగ్ కోహ్లీ హోటల్ గది. వీడియోలో విరాట్ హోటల్ గది లోపలి భాగం, అతని వ్యక్తిగత వస్తువులు అన్నీ ఉన్నాయి. ఈ ఉల్లంఘన ఎప్పుడు జరిగిందో విరాట్ ఖచ్చితంగా వెల్లడించనప్పటికీ, భారత జట్టు ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాతనే ఇది జరిగిందని తెలుస్తున్నాయి. వీడియో చిత్రీకరిస్తున్న వ్యక్తి విరాట్ గది గుండా వెళుతున్నట్లు చూడవచ్చు. అతను తలుపులు, అల్మారాలు తెరిచాడు. ఇది అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఇందులో కేవలం హోటల్ సిబ్బంది మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా?
ఇక్కడ అనేక ప్రశ్నలు తలెత్తుతాయి - 1. హోటల్ సిబ్బంది మాత్రమే ఇందులో పాల్గొన్నారా? 2. హోటళ్లు తమ సిబ్బంది అటువంటి కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండేలా సాధారణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? 3. దీని గురించి తెలుసుకున్న టీమ్ ఇండియా సెక్యూరిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? 4. అలాంటివి జరగకుండా చూసుకోవడానికి ఏమి చేయాలి?

ఇక్కడ ఎవరూ మర్చిపోకూడని విషయం ఏమిటంటే ఇది గోప్యతకు భంగం కలిగించడమే కాదు, తీవ్రమైన భద్రతా ప్రమాదం కూడా. ఇప్పుడు వచ్చినవాళ్లు కేవలం వీడియో తీసుకుని వెళ్లారు సరిపోయింది. అదే ఎవరైనా దుండగులు టీమిండియా ఆటగాళ్లపై దాడి చేయాలన్న దురుద్దేశంతో వస్తే పరిస్థితి ఏంటి? ఈ సంఘటనపై విరాట్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

అంతర్జాతీయ క్రికెటర్లందరి కంటే భారత క్రికెటర్లకు అత్యంత భారీ భద్రత ఉంటుంది. భారత క్రికెటర్లు బస చేసే జట్టు హోటళ్లలోని ఫ్లోర్స్‌కు సాధారణ ప్రజలకు పరిమితులుగా ఉండవు. వేరే దేశాల్లో జట్టు పర్యటనలో ఉన్నప్పుడు విషయాలు భిన్నంగా ఉండవచ్చు. దీనిపై ఇంకా పూర్తి స్పష్టత లేనప్పటికీ హోటల్ సిబ్బంది తమ యాక్సెస్ కార్డ్‌లను ఉపయోగించి విరాట్ గదిలోకి ప్రవేశించి ఈ వీడియోలు తీశారని అనుకోవచ్చు.

ఈ సంఘటనను వెల్లడిస్తూ విరాట్ ఇలా అన్నాడు. "అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉంటారు. దాన్ని నేను అర్థం చేసుకుంటాను. కానీ ఈ వీడియో భయంకరంగా ఉంది. ఇది నా ప్రైవసీ గురించి భయపడేలా చేసింది. నా స్వంత హోటల్ గదిలో ప్రైవసీ లేకపోతే, అసలు పర్సనల్ స్పేస్ ఎక్కడ ఉంటుంది? ఈ రకమైన ఫ్యానిజాన్ని నేను అంగీకరించలేను. ఇది నా ప్రైవసీపై జరిగిన దాడిలాగానే భావిస్తాను. దయచేసి వ్యక్తుల గోప్యతను గౌరవించండి. వారిని వినోదం కోసం ఒక వస్తువుగా పరిగణించవద్దు." అని తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పేర్కొన్నాడు. విరాట్ సోదరుడు వికాస్ కోహ్లీ వాటిని ట్యాగ్ చేయడం ద్వారా విరాట్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు సమాధానం ఇస్తూ హోటల్ పేరును వెల్లడించాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Virat Kohli (@virat.kohli)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Nizamabad Crime News:నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
నిజామాబాద్‌లో మిస్టరీ డెత్‌; గుండెపోటుతో భర్త చనిపోయినట్టు భార్య డ్రామా! ఒక్క ఫోన్ కాల్‌తో ఆటకట్టు!
Gold Jewellery Insurance: బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తే ఉచిత బీమా లభిస్తుంది.. ఏ సందర్భాల్లో కవర్ అవుతుంది
Embed widget