ICC Men's Player of Month: ఆడిన ఇన్నింగ్స్ నాలుగే - కానీ అత్యుత్తమ అవార్డు పొందిన విరాట్!
అక్టోబర్ నెలకు గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు.
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో భారత బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పాకిస్థాన్‌పై 82 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో సహా మూడు అర్ధ సెంచరీలను నమోదు చేయడంతో అక్టోబర్ నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపికయ్యాడు. కోహ్లితో పాటు జింబాబ్వేకు చెందిన సికందర్ రజా, దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. అయితే భారత బ్యాటర్ వారిని ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
మహిళల ఆసియా కప్‌లో సంచలన ఫాం కారణంగా పాకిస్థాన్ వెటరన్ ఆల్ రౌండర్ నిదా దార్ ఐసీసీ మహిళా ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా ఎంపికైంది. 34 సంవత్సరాల విరాట్ కోహ్లి అక్టోబర్‌లో కేవలం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో మాత్రమే బ్యాటింగ్ చేశాడు. అయితే అతను టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతోపాటు నెదర్లాండ్స్, బంగ్లాదేశ్‌లపై కూడా హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో 160 పరుగులను ఛేదించే క్రమంలో పాకిస్తాన్ 31 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టి భారతదేశాన్ని కష్టాల్లో పడేసింది. అయితే కోహ్లి కేవలం 53 బంతుల్లోనే 82 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత జట్టును గెలిపించాడు.
"అక్టోబరు నెలలో ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం నాకు గొప్ప గౌరవం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులతో పాటు ప్యానెల్ కూడా నన్ను అత్యుత్తమ ఆటగాడిగా ఎంపిక చేయడం నాకు మరింత ప్రత్యేకం." అని కోహ్లీ అన్నాడు. "ఈ నెలలో చాలా బాగా ఆడినఇతర నామినీలకు, నా సామర్థ్యం మేరకు అత్యుత్తమ ప్రదర్శన చేయడానికి నాకు మద్దతునిచ్చే నా సహచరులకు కూడా నేను ధన్యవాదాలు చెబుతున్నాను" అని విరాట్ చెప్పాడు.
View this post on Instagram
View this post on Instagram