అన్వేషించండి

Under 19 world cup: యువ భారత్‌ ఓటమికి కారణాలివే?

U19 World Cup 2024 Final: భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు.

U19 World Cup 2024 Final: అండర్‌ 19 ప్రపంచకప్‌(U19 World Cup 2024)ను ఆరోసారి ఒడిసిపట్టాలన్న యువ భారత్‌ ఆటగాళ్ల కల చెదిరింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా....  అండర్‌ 19 ప్రపంచకప్‌లోనూ భారత్‌కు ఓడించి కప్పును ఒడిసిపట్టింది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌ చేరిన టీమిండియా... కంగారుల సమష్టి ప్రదర్శన ముందు తలవంచింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. భారత్‌.. 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌటైంది. ఈ ఓటమికి అనేక కారణాలున్నాయని మాజీలు విశ్లేషిస్తున్నారు.
 
కారణాలివే..!
ఈ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న యువ భారత్‌ కెప్టెన్‌ ఉదయ్ సహారన్ అండర్ -19 ప్రపంచకప్ ఫైనల్లో కేవలం ఎనిమిది పరుగులకే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న ముషీర్ ఖాన్ రెండుసార్లు ఔట్ నుంచి తప్పించుకున్నా ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రెండు సార్లు అవకాశం వచ్చినా ఆశించిన స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయాడు. కేవలం 22 పరుగులు మాత్రమే చేసి బౌల్డ్ అయ్యాడు. 
 
భారత్ బౌలర్ల ప్రదర్శన ఫైనల్ మ్యాచ్ తరహాలో లేదు. అయితే, 16పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్ దక్కినా.. ఆ తరువాత ఆస్ట్రేలియా బ్యాటర్స్ దూకుడును ఆశించిన స్థాయిలో భారత్ బౌలర్లు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా పూర్తి ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 253 పరుగులు చేసింది. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ 77 బంతుల్లో 47 పరుగులు చేశాడు. అయితే, ఆరంభంలో చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం జట్టుపై ప్రభావం చూపింది. భారత్ జట్టు మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పేలవంగా ఉంది. మిడిలార్డర్‌ బ్యాటర్లు ఎవరు కూడా కనీసం 10 పరుగుల మార్కును చేరుకోలేకపోయారు. 
 
తప్పని నిరాశ
ద‌క్షిణాఫ్రికా వేదిక‌గా జ‌రిగిన అండ‌ర్‌-19 ప్రపంచ‌ క‌ప్( U19 World Cup Final 2024)లోనూ కుర్రాళ్లకు నిరాశే ఎదురైంది. నవంబర్‌ 19, 2023న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది. ఆదివారం ఫైనల్లో కుర్రాళ్లు ప్రతీకారం తీర్చుకుంటారని అంతా భావించారు.. కానీ ఆసీస్ విజయం సాధించి మరో ట్రోఫీని ముద్దాడింది. 254 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 43.5 ఓవర్లలో 174 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆస్ట్రేలియా కుర్రాళ్లు నాలుగోసారి అండర్ 19 వరల్డ్ కప్ కైవసం చేసుకున్నారు. సీనియర్లు ఎలాగైతే తుది మెట్టుపై కంగారు పడ్డారో, సరిగ్గా అదే తీరుగా భారత కుర్రాళ్లను ఆస్ట్రేలియా ఆటగాళ్లు కంగారు పెట్టారు. ఆసీస్ బౌలర్లలో బార్డ్‌మాన్, మెక్ మిలన్ చెరో 3 వికెట్లు పడగొట్టగా, విడ్లర్ 2 వికెట్లు తీశాడు.ఓవరాల్‌గా ఇప్పటివరకూ భారత్‌ 9సార్లు అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్స్ ఆడగా.. 2000, 2008, 2012, 2018, 2022లో మొత్తం 5 సార్లు ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకు ముందు 2006, 2016, 2020లలో ఫైనల్లో ఓటమిపాలైంది. తాజాగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ యువ భారత్ తుది మెట్టుపై బోల్తాపడింది. అండర్ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా, భారత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడగా.. చెరో రెండు ఫైనల్స్ నెగ్గి మెగా ట్రోఫీని అందుకున్నాయి.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana MLA Disqualification News: ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
ఎమ్మెల్యేల అనర్హత కేసులో కీలక మలుపు- బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ ఇచ్చిన హైకోర్టు 
Pawan Kalyan Latest News : షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
షష్ఠి పూర్తి అయ్యాక సీఎం అవుతారా పవన్? చర్చకు దారి తీసిన లేటెస్ట్ కామెంట్స్
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Embed widget