అన్వేషించండి

T20 cricket world cup : టి20 క్రికెట్ వరల్డ్ కప్‌లో పాల్గొంటున్న 20 జట్లు.. ఆ వివరాలు ఇవే

T20 Cricket World Cup:క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ 24 గంటల్లో ప్రారంభం కానుంది. తొలిసారి 20 జట్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నాయి. వెస్టిండీస్, అమెరికా నిర్వహిస్తున్నాయి.

ICC T20 Cricket World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు మరో మెగా టోర్నీ ప్రారంభం కాబోతోంది. జూన్ రెండో తేదీ నుంచి 29 వరకు టి20 వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీని వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మెగా టోర్నీలో తొలిసారిగా 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు ఎనిమిది టి20 ప్రపంచ కప్పులు నిర్వహించగా, తాజాగా నిర్వహిస్తున్నది తొమ్మిదో వరల్డ్ కప్. మొత్తంగా 20 జట్లు రెండు దేశాల్లోని తొమ్మిది నగరాల్లో 55 మ్యాచ్ లు ఆడనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఈ టోర్నీలో జూన్ 9వ తేదీన న్యూయార్క్ లోని నాసావు కౌంటి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.

నాలుగు గ్రూపులుగా విభజించి పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, అమెరికా జట్లు ఉన్నాయి.

గ్రూప్ బిలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ జట్లు ఉన్నాయి.

గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా ఆడుతున్నాయి.

గ్రూప్-డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.

ప్రతి గ్రూపు నుంచి మొదటి రెండు జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. ఇందులో 8 జట్లు నాలుగు గ్రూపులుగా విభజించబడి సెమీఫైనల్ స్థానాల కోసం పోటీ పడనున్నాయి. 

జట్లు అర్హత సాధించాయి ఇలా 

టి20 వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు ఆయా జట్లు విభిన్న పద్ధతుల్లో అర్హతను సాధించాయి. టి20 ప్రపంచ కప్ 2022 నుండి మెరుగైన స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, దక్షిణాప్రికా, శ్రీలంక, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించగా, టి20 టీమ్ ర్యాంకింగ్స్ ఆధారంగా బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు అర్హత పొందాయి. ఐర్లాండ్, స్కాట్లాండ్ యూరోపియన్ క్వాలిఫైయర్ మ్యాచ్ ల్లో విజయం సాధించడం ద్వారా అర్హత సాధించాయి. కెనడా, అమెరికా జట్లు క్వాలిఫైయర్లో విజయం సాధించడం ద్వారా బెర్తును దక్కించుకున్నాయి. తూర్పు ఆసియా - పసిఫిక్ క్వాలిఫైయర్ లో పపువ న్యూ గినియా విజయం సాధించి అర్హత సాధించింది. నేపాల్, ఒమన్ ఆసియా క్వాలిఫైయర్ నుంచి అర్హత సాధించగా, నమీబియా, ఉగాండా ఆప్రికా నుంచి అర్హత పొందాయి. ఈ వరల్డ్ కప్ కోసం తుది జట్టును న్యూజిలాండ్ ఏప్రిల్ 29న ప్రకటించి వరల్డ్ కప్ జట్టును ముందుగా ప్రకటించిన జట్టుగా నిలిచింది. పాకిస్తాన్ ఈనెల 24న తుది జట్టును ప్రకటించి చిట్ట చివరి జట్టుగా నిలిచింది. 

ఇవి జట్లు 

ఆఫ్ఘనిస్తాన్ జట్టు : రషీద్ ఖాన్ (కెప్టెన్), రహ్మనుల్లా గర్భాజ్, ఇబ్రహీం జార్డాన్, అజ్మతుల్లా ఒమర్ జాయ్, నిజబుల్లా జర్డాన్, మహమ్మద్ ఇషాక్, మహమ్మద్ నబీ, గుల్ బదిన్ నైబ్, కరీం జనాత్, నంగ్యాల్ కరోతి, ముజుబీర్ రహమాన్, నూర్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, ఫజల్క్ ఫారోకి, ఫరీద్ అహ్మద్ మాలిక్, రిజర్వు బెంచ్ : షదిక్ అటల్, హజ్రతుల్లా జజాయ్, సలీం షఫీ

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ఆస్టన్ అగర్, పాత్ కమిన్స్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, కెమెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా
ప్రజల బెంచ్ ఆటగాళ్లు : జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, మాత్ షార్ట్ 

బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ శాంటో (కెప్టెన్), తస్కిన్ అహ్మద్, లిట్టన్ దాస్, సౌమ్య సర్కార్, తాంజిద్ హసన్ తమీమ్, షకీబ్ అల్ హసన్, తౌహిద్ హృదయ్, మహమూద్ ఉల్లా రియాద్, జాకర్ అలీ అనిక్, తన్వీర్ ఇస్లాం, షాక్ మహిదీ హసన్, రిషాద్ హోస్సేన్ రెహమాన్, షోరిఫుల్ ఇస్లాం, తంజిమ్ హసన్ సాకిబ్
రిజర్వ్‌ బెంచ్: అఫీఫ్ హుస్సేన్, హసన్ మహమూద్

కెనడా క్రికెట్ జట్టు : సాద్ బిన్ జాఫర్ (కెప్టెన్), ఆరోన్ జాన్సన్, రవీందర్‌ పాల్ సింగ్, నవనీత్ ధలివాల్, కలీమ్ సనా, డిల్లాన్ హేలిగర్, జెరెమీ గోర్డాన్, నిఖిల్ దత్తా, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, రయ్యాంఖాన్ పఠాన్, జునైద్ సిద్ధిఖీ, దిల్‌ప్రీత్ బజ్వా, శ్రేయాస్ మొవ్వ, రిషివ్ జోషి

ఇంగ్లండ్ క్రికెట్ జట్టు : జోస్ బట్లర్ (కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌ స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ 

భారత క్రికెట్ జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

రిజర్వ్‌ బెంచ్ ఆటగాళ్లు : శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్

ఐర్లాండ్ క్రికెట్ జట్టు : పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), మార్క్ అడైర్, రాస్ అడైర్, ఆండ్రూ బల్బిర్నీ, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, జోష్ లిటిల్, బారీ మెక్‌కార్తీ, నీల్ రాక్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్

నమీబియా క్రికెట్ జట్టు : గెర్హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, మైఖేల్ వాన్ లింగెన్, డైలాన్ లీచెర్, రూబెన్ ట్రంపెల్‌మన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, తంగేని లుంగమేని, నికో డేవిన్, జెజె స్మిత్, జాన్ ఫ్రై లింక్, జెపి కోట్జే, డేవిడ్ వైస్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, మలన్ క్రుగర్, పిడి బ్లిగ్నాట్

నేపాల్ క్రికెట్ జట్టు : రోహిత్ పౌడెల్ (కెప్టెన్), ఆసిఫ్ షేక్, అనిల్ కుమార్ సా, కుశాల్ భుర్టెల్, కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, లలిత్ రాజ్‌ బన్షి, కరణ్ కెసి, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, ప్రతిస్ జిసి, సందీప్ జోరా, అబినాష్ బోహారా, సాగర్ ధాకల్ , కమల్ సింగ్ ఐరీ

నెదర్లాండ్స్ క్రికెట్ జట్టు : స్కాట్ ఎడ్వర్డ్స్ (కెప్టెన్), ఆర్యన్ దత్, బాస్ డి లీడ్, కైల్ క్లైన్, లోగాన్ వాన్ బీక్, మాక్స్ ఓ'డౌడ్, మైకేల్ లెవిట్, పాల్ వాన్ మీకెరెన్, ర్యాన్ క్లైన్, సాకిబ్ జుల్ఫికర్, సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్, తేజ నిడమనూరు, టిమ్ ప్రింగిల్, విక్రమ్ సింగ్, వివ్ కింగ్మా, వెస్లీ బరేసి

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు : కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ఫిన్ అలెన్, ట్రెంట్ బౌల్ట్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, ల్యూక్ ఫెర్గూసన్, మాత్ హెన్రీ, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, టిమ్ సౌతీ రిజర్వ్ బెంచ్ ఆటగాళ్లు: బెన్ సియర్స్

ఒమన్ క్రికెట్ జట్టు : అకిబ్ ఇలియాస్ (కెప్టెన్), జీషన్ మక్సూద్, కశ్యప్ ప్రజాపతి, ప్రతీక్ అథవాలే, అయాన్ ఖాన్, షోయబ్ ఖాన్, మహ్మద్ నదీమ్, నసీమ్ ఖుషీ, మెహ్రాన్ ఖాన్, బిలాల్ ఖాన్, రఫీవుల్లా, కలీముల్లా, ఫయాజ్ బట్, షకీల్ అహ్మద్
రిజర్వ్‌ బెంచ్ ఆటగాళ్లు : జతీందర్ సింగ్, సమయ్ శ్రీవాస్తవ, సుఫ్యాన్ మెహమూద్, జే ఒడెద్రా

పాపువా న్యూ గినియా క్రికెట్ జట్టు : అసడోల్లా వాలా (కెప్టెన్), అలీయి నావో, చాద్ సోపర్, సిజె అమిని, హిలా వరే, హిరి హిరి, జాక్ గార్డనర్, జాన్ కరికో, కబువా వాగి మోరియా, కిప్లింగ్ డోరిగా, లెగా సియాకా, నార్మన్ వనువా, సెమా కమియా, సెసే బావు, టోనీ ఉరా

పాకిస్థాన్ క్రికెట్ జట్టు : బాబర్ అజామ్ (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అజామ్ ఖాన్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, ఇఫ్తికార్ అహ్మద్, ఇమాద్ వసీమ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సయీమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, షాహీన్ షా అఫ్రీది , ఉస్మాన్ ఖాన్

స్కాట్లాండ్ క్రికెట్ జట్టు : రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), మాథ్యూ క్రాస్, బ్రాడ్ క్యూరీ, క్రిస్ గ్రీవ్స్, ఓలి హెయిర్స్, జాక్ జార్విస్, మైఖేల్ జోన్స్, మైఖేల్ లీస్క్, బ్రాండన్ మెక్‌ముల్లెన్, జార్జ్ మున్సీ, సఫ్యాన్ షరీఫ్, క్రిస్ సోలే, చార్లీ టీర్,  మార్క్ వాట్, బ్రాడ్ వీల్

దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు : ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, జోర్న్ ఫోర్టుయిన్, రీజా హెండ్రిక్స్, మార్కో జాన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, అన్రిచ్ నార్జే, కగిసో రబడా, తబ్రాజ్ శంసి, ట్రిస్టన్ స్టబ్స్

శ్రీలంక క్రికెట్ జట్టు: వనిందు హసరంగా (కెప్టెన్), చరిత్ అసలంక, కుసల్ మెండిస్, పాతుమ్ నిస్సంక, కమిందు మెండిస్, సదీర సమరవిక్రమ, ఏంజెలో మాథ్యూస్, దసున్ షనక, ధనంజయ డి సిల్వ, మహేశ్ తీక్షణ, దునిత్ వెల్లలాగే, దుష్మంత చమీర, నువాన్ తుషార, మతీష పతిరణ, దిల్షాన్ మధుశంక
రిజర్వ్‌ బెంచ్ : అసిత ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, భానుకా రాజపక్సే, జనిత్ లియానాగే

ఉగాండా క్రికెట్ జట్టు : బ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ స్సేసాజి, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేష్ రంజాని, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ సెనియోండో, బిలాల్ హస్సన్, రాబిన్సన్ ఒబుయా, రియాజాత్ అలీ షా, జుమా మియాజి, రోనక్ పటేల్
రిజర్వ్‌ ఆటగాళ్లు : ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా

యునైటెడ్ స్టేట్స్ క్రికెట్ జట్టు : మోనాంక్ పటేల్ (కెప్టెన్), ఆరోన్ జోన్స్, ఆండ్రీస్ గౌస్, కోరీ అండర్సన్, అలీ ఖాన్, హర్మీత్ సింగ్, జెస్సీ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీష్ కుమార్, నోష్తుష్ కెంజిగే, సౌరభ్ నేత్రల్వాకర్, షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్ రిజర్వ్‌ బెంచ్ : గజానంద్ సింగ్, జువానోయ్ డ్రైస్‌డేల్, యాసిర్ మొహమ్మద్

వెస్టిండీస్ క్రికెట్ జట్టు : రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జారీ జోసెఫ్, జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, జాసన్ హోల్డర్, షాయ్ హోప్, అకేల్ హోసేన్, షామర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, గుడాకేష్ మోటీ, నికోలస్ పూరన్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫర్డ్, రొమారియో షెపర్డ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jasprit Bumrah Player of the Tournament award | T20 World Cup 2024 లో బుమ్రానే మన బౌలింగ్ బలం | ABPVirat Kohli and Rohit Sharma Announces Retirement From T20I | వరల్డ్ కప్ గెలిచి రిటైరైన దిగ్గజాలుVirat Kohli 76 Runs in T20 World Cup Final | సిరీస్ అంతా ఫెయిలైనా ఫైనల్ లో విరాట్ విశ్వరూపం | ABPRohit Sharma Kisses Hardik Pandya | T20 World Cup 2024 విజయం తర్వాత రోహిత్, పాండ్యా వీడియో వైరల్|ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR on Jobs: తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
తెలంగాణ యువతకు ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ ఏమైంది? రాహుల్ గాంధీకి కేటీఆర్ సూటి ప్రశ్న
AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
Social Look: రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
రేజినా హాట్‌ లుక్‌, వర్షబొల్లమ్మ క్యూట్‌ స్మైల్‌, సిమ్రాన్‌ చౌదరి డ్యాన్స్‌
Virat Rohit: టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
టీం ఇండియాను విశ్వ విజేతగా నిలిపిన ఇద్దరు మిత్రులు
Actress Vedhika: పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
పింక్‌ శారీలో నటి వేదిక గ్లామర్‌ మెరుపులు - నడుము చూపిస్తూ అందాల రచ్చ
Chittoor News: చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
చిత్తూరులో రూ.3.60 కోట్ల విలువైన సెల్ ఫోన్లు రికవరీ, ఓనర్లకు అందజేసిన పోలీసులు
Upendra Dwivedi: ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
ఇండియన్ ఆర్మీ కొత్త బాస్‌గా జనరల్ ఉపేంద్ర ద్వివేది, పాక్‌ చైనా ఆటలు కట్టించడంలో ఎక్స్‌పర్ట్
Kalki 2898 AD 3 Day Collection: బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
బాక్సాఫీసు వద్ద 'కల్కి' కలెక్షన్ల సునామీ - మూడు రోజుల్లో ఎంత వసూళ్లు చేసిందంటే..!
Embed widget