India Team For South Africa T20 series: దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు ఆడే ఇండియా జట్టు ఇదే! తిరిగి టీంలోకి వచ్చిన శుభ్‌మన్ గిల్
India Team For South Africa T20 series: దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు టీం ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. గాయపడిన శుభ్‌మాన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు.

India Team For South Africa T20 series: దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. మెడ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు దూరమైన వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. సూర్యకుమార్ యాదవ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.
దక్షిణాఫ్రికా ప్రస్తుతం టీమిండియా వన్డేలు ఆడుతోంది. రెండో వన్డే రాయ్‌పూర్‌లో జరుగుతోంది. మూడో వన్డే ఆరో తేదీ విశాఖలో జరగనుంది. ఈ సిరీస్‌కు రాహుల్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 19 వరకు జరుగుతుంది.
డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించింది. 2025 ఆసియా కప్‌లో ఆడిన జట్టునే సెలక్టర్లు ఎంపిక చేశారు. వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ నలుగురు స్పిన్నర్లు. అదనంగా, 15 మంది సభ్యుల జట్టులో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు: జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ, సంజూ శాంసన్ ఉన్నారు. జితేష్, శాంసన్ ఇద్దరు వికెట్ కీపర్లు.
దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టు - సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, సంజు శామ్సన్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్
🚨 NEWS 🚨#TeamIndia's squad for the 5⃣-match T20I series against South Africa announced.
— BCCI (@BCCI) December 3, 2025
Details ▶️ https://t.co/3Bscuq6Gri #INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/0bHLCcbwTD
భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ షెడ్యూల్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్ డిసెంబర్ 9న కటక్‌లో జరుగుతుంది. రెండో టీ20 మ్యాచ్ డిసెంబర్ 11న న్యూ చండీగఢ్‌లో, మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 14న ధర్మశాలలో జరుగుతుంది. నాలుగో టీ20 మ్యాచ్ డిసెంబర్ 17న లక్నోలో, చివరి, ఐదవ టీ20 మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో జరుగుతుంది.



















