Ravichandran Ashwin: అశ్విన్‌కు దిమాగ్ మీద దిమాగ్ ఉంది - ఇస్మార్ట్ శంకర్ ఎలివేషన్లు ఇచ్చిన కోహ్లీ!
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ చివరి ఓవర్లో తెలివిగా వ్యవహరించినందుకు అశ్విన్‌ను కోహ్లీ ఆకాశానికి ఎత్తేశాడు.
ఆదివారం మెల్‌బోర్న్‌లో పాకిస్థాన్‌తో జరిగిన 2022 ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భారత్ విజయం సాధించింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత అజేయమైన 83 పరుగుల ఇన్నింగ్స్‌తో ఇది సాధ్యమైంది. కోహ్లి హార్దిక్ పాండ్యాతో కలిసి సెంచరీ భాగస్వామ్యాన్ని అందించాడు. ఈ పార్ట్‌నర్‌షిప్ భారత్‌ను అనిశ్చిత పరిస్థితి నుంచి బయటపడేసింది.
ఇక గేమ్‌లో చివరి ఓవర్ చాలా నాటకీయంగా సాగింది. హార్దిక్, దినేష్ కార్తీక్‌ల వికెట్లను మహ్మద్ నవాజ్ తీసుకున్నాడు. కానీ అతను కోహ్లీకి నోబాల్‌ను కూడా వేశాడు. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉండగా రవిచంద్రన్ అశ్విన్ బ్యాటింగ్‌కు వచ్చాడు.
అతను ప్రశాంతంగా నవాజ్ వేసిన డెలివరీని లెగ్ సైడ్ వైపు వదిలేశాడు. అది వైడ్ బాల్ అయింది. దీంతో స్కోర్లు సమం అయ్యాయి. ఆఖరి డెలివరీని మిడ్-ఆఫ్ ఫీల్డర్ తలపై కొట్టి భారత్‌ను గెలిపించాడు. చివర్లో అశ్విన్ పాత్ర, ప్రశాంతత గురించి కోహ్లి మాట్లాడుతూ అతను చాలా కూల్‌గా ఉన్నాడని అన్నాడు.
"మీకు ఓవర్‌కు 15-16 పరుగులు అవసరమైనప్పుడు, ఆపై సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులకు తగ్గినప్పుడు, ప్రజలు ఈ లక్ష్యాన్ని దాదాపుగా సాధించినట్లు రిలాక్స్ అవుతారు లేదా అత్యుత్సాహంతో ఉంటారు. తర్వాత దినేష్ కార్తీక్ అవుట్ అయ్యాడు, నేను అశ్విన్‌ను కవర్స్ మీదుగా కొట్టమని చెప్పాను. ఆ సమయంలో అశ్విన్ తన దిమాగ్ (మెదడు) మీద ఎక్స్‌ట్రా దిమాగ్‌ను ఉపయోగించాడు. అది చాలా ధైర్యమైన పని. " అని విరాట్ కోహ్లీ అన్నాడు.
View this post on Instagram
View this post on Instagram