Sam Curran: ఇంగ్లండ్ తరఫున శామ్ కరన్ కొత్త రికార్డు - ఆదిల్ రషీద్‌ను వెనక్కి నెట్టి మరీ!
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శామ్ కరన్ కొత్త రికార్డును సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శామ్ కరన్ భారీ ఇంగ్లండ్ టీ20 రికార్డ్‌ను నమోదు చేశాడు. శనివారం పెర్త్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో శామ్ కర్రాన్ 3.4 ఓవర్లలో ఐదు వికెట్లు పడగొట్టాడు. కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీనికి ముందు స్పిన్నర్ ఆదిల్ రషీద్ ఈ అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను సాధించాడు. 2021లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆదిల్ రషీద్ 2.2 ఓవర్లలో రెండు పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.
వీరిద్దరి తర్వాతి స్థానాల్లో క్రిస్ జోర్డాన్ (4/6), డేవిడ్ విల్లీ (4/7) ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో శామ్ కరన్‌తో పాటు బెన్ స్టోక్స్ (2/19), మార్క్ వుడ్ (2/23) కూడా చక్కగా బౌలింగ్ చేశారు. క్రిస్ వోక్స్ కూడా ఒక వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ మందకొడిగా ప్రారంభం అయింది. ఇంగ్లండ్ బౌలర్లు మూడో ఓవర్ నుంచే వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఆఫ్ఘన్ బ్యాటర్లను క్రీజులో కుదురుకోనివ్వలేదు. ఇబ్రహీం జద్రాన్ (32: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), ఉస్మాన్ గని (30: 30 బంతుల్లో, మూడు ఫోర్లు) మినహా మరెవ్వరూ కనీసం 15 పరుగులు కూడా చేయలేకపోయారు. ఆఖర్లో శామ్ కరన్ ఐదు వికెట్లు తీసి ఆఫ్ఘన్ టెయిలెండర్ల పని పట్టాడు.
అనంతరం ఇంగ్లండ్ ఇన్నింగ్స్ కూడా మెల్లగానే ప్రారంభం అయింది. టాప్-4 బౌలర్లలో ఒక్కరి స్ట్రైక్ రేట్ కూడా 100 దాటలేదు. డేవిడ్ మలన్ (18: 30 బంతుల్లో) అయితే మరీ నిదానంగా ఆడాడు. ఐదు ఓవర్లు ఆడినా ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయాడు. ఫాంలో ఉన్న జోస్ బట్లర్ (18: 18 బంతుల్లో, మూడు ఫోర్లు), అలెక్స్ హేల్స్ (19: 20 బంతుల్లో, ఒక సిక్సర్), బెన్ స్టోక్స్ (2: 4 బంతుల్లో) కూడా విఫలం కావడంతో ఇంగ్లండ్ కష్టాల్లో పడింది.
కేవలం లియాం లివింగ్‌స్టోన్ (29: 21 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రమే కొంచెం వేగంగా ఆడాడు. కొట్టాల్సిన స్కోరు చాలా తక్కువగా ఉండటం, ఆఫ్ఘన్ బౌలర్లు ఏకంగా 12 వైడ్లు వేయడంతో ఇంగ్లండ్ పని మరింత సులభం అయింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫజల్హక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రహమాన్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్ మాలిక్, మహ్మద్ నబీ తలో వికెట్ తీసుకున్నారు.
View this post on Instagram