News
News
వీడియోలు ఆటలు
X

Cricket World Cup 2023: సౌతాఫ్రికాకు తొలగిన అడ్డంకి - వన్డే వరల్డ్ కప్‌‌‌లో నేరుగా అర్హత

South Africa: ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు షాకులిచ్చే వరుణుడు ఈసారి శుభవార్త అందించాడు.

FOLLOW US: 
Share:

Cricket World Cup 2023:  ఐసీసీ నిర్వహించే టోర్నీలలో  సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు వరుణ దేవుడికి అవినాభావ సంబంధం ఉంటుంది. 1992 వన్డే వరల్డ్ కప్  నుంచి మొన్నటి  2022 టీ20 వరల్డ్  కప్ వరకూ  ఆ జట్టుతో ఆడుకున్నంతగా వర్షం మరే జట్టుతోనూ  ఆడుకోలేదు. కానీ వర్షం వల్ల  సౌతాఫ్రికాకు  షాకులే కాకుండా మంచి కూడా జరిగింది. ఐర్లాండ్ - బంగ్లాదేశ్  మధ్య జరుగుతున్న తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కావడంతో  సౌతాఫ్రికా  ఈ ఏడాది భారత్ లో జరుగబోయే వన్డే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధించింది. 

ఐర్లాండ్‌-బంగ్లా సిరీస్ తో ఏంటి లింకు..? 

వరల్డ్ కప్ సూపర్ లీగ్‌లో భాగంగా  టాప్ -8లో  ఉన్న జట్లు  అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరిగే  వన్డే ప్రపంచకప్ లో  నేరుగా అర్హత సాధిస్తాయి.  ఇటీవలే నెదర్లాండ్స్ తో  రెండు వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా  ఆ మేరకు  8వ స్థానానికి చేరడంతో  పాటు  పాయింట్లను కూడా మెరుగుపర్చుకుంది. అయితే దక్షిణాఫ్రికాతో పాటు ఐర్లాండ్  కూడా డైరెక్ట్ క్వాలిఫై రేసులో ఉంది. కానీ ఐర్లాండ్.. బంగ్లాదేశ్ తో  మూడు వన్డేల సిరీస్‌ను  క్లీన్ స్వీప్ చేస్తేనే  ఆ జట్టుకు  అవకాశం దక్కి దక్షిణాఫ్రికా  క్వాలిఫై రౌండ్ ఆడాల్సి వచ్చేది.  కానీ  వర్షం కారణంగా ఫస్ట్ వన్డే రద్దవడం సఫారీలకు కలిసొచ్చింది.   ఇక ఇప్పుడు ఐర్లాండ్ 2-0 తేడాతో సిరీస్ నెగ్గినా  క్వాలిఫై రౌండ్ ఆడాల్సిందే.  

నేరుగా క్వాలిఫై అయిన  జట్లు : 

న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఇండియా (ఆతిథ్య దేశం), బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆస్ట్రేలియా, అఫ్గానిస్తాన్, సౌతాఫ్రికా 

పది జట్లతో మెగా టోర్నీ.. 

అక్టోబర్ నుంచి జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో పది జట్లు పాల్గొంటాయి.  ఇప్పటికే 8 జట్లు  డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకోగా  మిగిలిన రెండు జట్లు క్వాలిఫై రౌండ్ ద్వారా  కలుస్తాయి.  ఐర్లాండ్, వెస్టిండీస్, శ్రీలంక, జింబాబ్వే,  నెదర్లాండ్స్  మధ్య  జరుగబోయే క్వాలిఫై మ్యాచ్‌లలో టాప్ - 2 గా ఉన్న జట్లు  ప్రపంచకప్ ఆడేందుకు అర్హత సాధిస్తాయి.  ఈ ఏడాది జూన్  18 నుంచి  జులై 9 వరకూ   జింబాబ్వే వేదికగా క్వాలిఫై మ్యాచ్ లు జరుగుతాయి. కాగా బంగ్లాదేశ్ - ఐర్లాండ్ మధ్య మంగళవారం  వర్షం కారణంగా రద్దయిన  ఫస్ట్ వన్డేలో  బంగ్లాదేశ్  ఫస్ట్ బ్యాటింగ్ చేసి  9 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది.  ఐర్లాండ్.. 16.3 ఓవర్లలో  3 వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. 

Published at : 10 May 2023 12:00 PM (IST) Tags: South Africa Cricket World Cup 2023 ICC ODI WC 2023 Bangladesh vs Ireland ICC Mens Cricket World Cup 2023

సంబంధిత కథనాలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

IND vs AUS, WTC Final 2023: 300కు చేరిన ఆసీస్ ఆధిక్యం - డబ్ల్యూటీసీ ఫైనల్‌పై పట్టు బిగించిన కంగారూలు

WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్

WTC Final 2023: నన్ను పెళ్లి చేసుకుంటావా! - గిల్‌కు మ్యాచ్ జరుగుతుండగానే మ్యారేజ్ ప్రపోజల్

Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్

Shardul Thakur Record: లార్డ్ శార్దూల్ అంటార్రా బాబూ - దిగ్గజాలకు సొంతమైన రికార్డును సమం చేసిన ఠాకూర్

IND vs AUS, WTC Final 2023: వార్నర్ ఔట్ - పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే

IND vs AUS, WTC Final 2023: వార్నర్ ఔట్ -  పెరుగుతున్న ఆసీస్ ఆధిక్యం, భారత బౌలర్లు శ్రమించాల్సిందే

WTC Final 2023: ప్చ్‌.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్‌! అజింక్య సెంచరీ మిస్‌ - ఆసీస్‌కు భారీ లీడ్‌!

WTC Final 2023: ప్చ్‌.. టీమ్‌ఇండియా 296 ఆలౌట్‌! అజింక్య సెంచరీ మిస్‌ - ఆసీస్‌కు భారీ లీడ్‌!

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?

Schools Reopen: వేసవి సెలవులు పొడిగింపు ప్రచారం - విద్యాశాఖ ఏం చెప్పిందంటే?