Singer KKs Demise: జీవితం ఎలా ముగుస్తుందో చెప్పలేం - సింగర్ కేకే ఆకస్మిక మరణంపై క్రికెటర్లు ఏమన్నారంటే
Singer KK Dies at 53: కోల్‌కతాలో ప్రదర్శన ఇస్తూ సింగర్ కేకే హఠాత్తుగా కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయారు. అయితే జీవితం ఎలా ముగస్తుందో చెప్పలేమంటూ క్రికెటర్లు సెహ్వాగ్, లక్ష్మణ్, కోహ్లీ స్పందించారు.
Virender Sehwag to Virat Kohli tributes to Singer KK: ఫేమస్ సింగర్ కృష్ణకుమార్ కున్నత్ (Singer KK) కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలో ఒక కాన్సర్ట్‌లో ప్రదర్శన ఇస్తూ సింగర్ కేకే(53) హఠాత్తుగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే కేకే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. సింగర్ కేకే మరణంపై తాజా, మాజీ క్రికెటర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోల్‌కతాలో పర్ఫామ్ చేస్తూ సింగర్ కేకే చనిపోయారని తెలియగానే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ దిగ్భ్రాంతి చెందాడు.
జీవితం అంటే ఎలా ముగుస్తుందో చెప్పలేమన్నాడు సెహ్వాగ్. అందుకు సింగర్ కేకే మరణం మరో ఘటనగా నిలిచిందని, ఆయన ఫ్యామిలీకి ప్రగాడ సానుభూతి తెలిపాడు. ఓం శాంతి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన గాత్రంతో సంగీత ప్రియులను ఉర్రూతలూగించిన సింగర్ కేకే అద్భుతమైన వ్యక్తి అని వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. తన మ్యూజిక్ ద్వారా ఎప్పటికీ జీవించి ఉంటారని, సింగర్ మరణంపై సంతాపం ప్రకటించారు.
యువరాజ్ దిగ్బ్రాంతి..
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, సున్నితంగా ఉంటుంది, అదే జీవితం అని సింగర్ కేకే మరణంపై టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. సింగర్ కేకే మరణం చాలా విషాదకరం. ఆయన కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని యువరాజ్ ఆకాంక్షించాడు.
Also Read: Singer KK: కోటి రూపాయలు ఆఫర్ చేసినా పెళ్లిలో పాడలేదు - అదీ సింగర్ కేకే కమిట్‌మెంట్
అద్భుతమైన గాయకుడు
ఈ రోజుల్లో అద్భుతమైన గాయకుడు కేకే అని, ఆయన మరణం కలచివేసిందన్నాడు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ. సింగర్ కేకే కుటుంబానికి, ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపాడు.
Also Read: హలో డాక్టర్ నుంచి చెలియా చెలియా దాకా - కేకే తెలుగులో పాడిన సూపర్ హిట్స్ ఇవే!