ICC Test Rankings: సిరీస్ లీడింగ్ రన్ స్కోరర్.. అయినా దిగజారిన గిల్ ర్యాంకు.. అందుకు కారణం ఏంటంటే..?
ఇంగ్లాండ్ తో సిరీస్ లో విశేషంగా రాణించిన పలువురు ఆటగాళ్ల ర్యాంకులు మెరుగు పడ్డాయి. అయితే సిరీస్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచిన గిల్ ర్యాంకు మాత్రం.. ఐదో టెస్టు తర్వాత వెనుకంజలో నిలిచింది.

Shubman Gill News: ఇంగ్లాండ్ తో జరిగిన అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భారత టెస్టు కెప్టెన్ శుభమాన్ గిల్ విశేషంగా రాణించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ గడ్డపై రాణించలేడని, అతని అత్యధిక స్కోరు కేవలం 30 మాత్రమే అని ఎద్దేవా చేసిన వారికి, తన బ్యాటింగ్ తో సమాధానమిచ్చాడు. ఈ సిరీస్ లో నాలుగు సెంచరీలతోపాటు 754 పరుగులు సాధించి, సిరీస్ లీడింగ్ రన్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే ఒక టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన టీమిండిాయా కెప్టెన్ గా కూడా గిల్ రికార్డులకెక్కాడు. అయినప్పటికీ, ఇటీవల ప్రకటించిన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో తన ర్యాంకు దిగజారింది. ఏకంగా నాలుగు స్థానాలు కోల్పోయాడు. ఇందుకు గల కారణం.. అతను ఐదో టెస్టులో విఫలం కావడమేనని తెలుస్తోంది. ఈ టెస్టులో కేవలం 32 రన్స్ మాత్రమే చేసిన గిల్ ఏకంగా టాప్-9 నుంచి 13కి పడి పోయాడు. అయినా కూడా ఈ మ్యాచ్ లో ఇండియా ఆరు పరుగులతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి, సిరీస్ ను 2-2తో సమం చేసింది.
Most Runs in an Series by Captain In Tests.
— CRICKET 360° (@gurlabhsingh610) August 7, 2025
810 - Don Bradman (9 Inns, 90.0 Avg)
754 - Shubman Gill (10 Inns, 75.4 Avg)
752 - GA Gooch (6 Inns, 125.33 Avg)
732 - Sunil Gavaskar (9 Inns, 91.50 Avg) pic.twitter.com/1z4dXmHJyc
కెరీర్ ఉత్తమ ర్యాంకుకు సిరాజ్..
ఇక ఈ సిరీస్ లోనే ఐదు టెస్టులు ఆడిన ఏకైక భారత పేసర్ గా నిలిచిన మహ్మద్ సిరాజ్.. లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఆఖరి టెస్టులో ఒక ఫైఫర్ తో సహా తొమ్మిది వికెట్లు తీశాడు. దీంతో తన కెరీర్ బెస్ట్ ర్యాంకుకు చేరుకున్నాడు. తాజాగా ప్రకటించిన ర్యాంకుల్లో 15వ ర్యాంకును దక్కించుకున్నాడు. అదే టెస్టులో విశేషంగా రాణించిన మరో పేసర్ ప్రసిధ్ కృష్ణ కూడా తన కెరీర్ బెస్టు ర్యాంకును దక్కించుకున్నాడు. తను 59వ ర్యాంకును దక్కించుకున్నాడు. ఇక ఈ సిరీస్ లో ఐదో టెస్టులో ఆడిన గస్ అట్కిన్సన్ టాప్ -10 బౌలర్ల జాబితాలో చోటు దక్కించుకోగా, ఇంగ్లీష్ లీడింగ్ వికెట్ టేకర్ జోష్ టంగ్ కూడా కెరీర్ బెస్టు ర్యాంకును దక్కించుకున్నాడు.
సూపర్ జైస్వాల్..
మరోవైపు ఐదో టెస్టులో సెంచరీతో దుమ్ము రేపిన యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కెరీర్ బెస్టు ర్యాంకును దక్కించుకన్నాడు. ఈ సిరీస్ లో తొలి టెస్టులో శతకం బాదిన ఈ యువ ఓపెనర్.. ఆ తర్వాత కీలకమైన ఐదోటెస్టు రెండో ఇన్నింగ్స్ లోనూ సెంచరీని బాదాడు. నిజానికి ఈ టెస్టులో టాప్ స్కోరర్ తనే. ఈక్రమంలో అటు ఆస్ట్రేలియా, ఇటు ఇంగ్లాండ్ లోనూ ఆడిన తొలి టెస్టులోనే సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా గుర్తింపు పొందాడు. ఇప్పుడీ టాప్-5 ర్యాంకుతో తనలో మరింతగా ఆత్మవిశ్వాసం పొందిందనడలో సందేహం లేదు. జో రూట్, హేరీ బ్రూక్ వరుసగా తొలి రెండు స్థానాలలో కొనసాగుతున్నారు.




















