Shreyas Iyer: ఆస్ట్రేలియాతో మ్యాచులు.. టీమిండియాకు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్, ఊహించని ప్రకటన
India a vs australia a | ఆస్ట్రేలియా-ఎ తో ఇండియా-ఎ జట్టు సెప్టెంబర్ మూడో, నాలుగో వారాల్లో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇండియా ఏ జట్టు కెప్టెన్‌గాశ్రేయస్ అయ్యర్ పేరు ప్రకటించింది బీసీసీఐ.

India a Captain Shreyas Iyer | ఆస్ట్రేలియా-Aతో సెప్టెంబర్ 16 నుంచి ఆడనున్న 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇండియా-ఎ జట్టును భారత క్రికెట్ బోర్డు (BCCI) ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్‌ను భారత్ ఏ జట్టుకు కెప్టెన్‌గా నియమించారు. ఇండియా-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య లక్నోలో 2 అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు జరుగుతాయి. సెప్టెంబర్ 16 నుంచి 19 వరకు మొదటి మ్యాచ్, సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు రెండవ మ్యాచ్ జరుగుతుంది.
ఆస్ట్రేలియా-ఎతో 2 టెస్ట్‌ల కోసం ఇండియా-ఎ జట్టు: శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), ఎన్ జగదీశన్ (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, హర్ష్ దూబే, ఆయుష్ బదోని, దేవదత్ పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, తనుష్ కోటియన్, గుర్నూర్ బరాడ్, ఖలీల్ అహ్మద్, ప్రసిద్ధ్ కృష్ణ, మానవ్ సుతార్, యష్ ఠాకూర్
కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్ కూడా ఆస్ట్రేలియా-ఎతో మ్యాచ్ ఆడతారు. ఈ ఇద్దరు భారత స్టార్ క్రికెటర్లు రెండవ టెస్ట్ మ్యాచ్ ఆడతారు. కెఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్‌లను రెండవ అనధికారిక టెస్ట్ మ్యాచ్ కోసం జట్టులో చేరతారు. తొలి అనధికారిక టెస్ట్ మ్యాచులో యువకులకు అవకాశం కల్పిస్తున్నారు.
ఇండియా-ఎ, ఆస్ట్రేలియా-ఎ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
ఇండియా-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య మొదటి అనధికారిక టెస్ట్ మ్యాచ్ లక్నో వేదికగా సెప్టెంబర్ 16న ప్రారంభం కానుంది. రెండవ అనధికారిక టెస్ట్ సెప్టెంబర్ 23 నుంచి లక్నోలోనే జరుగుతుంది. తరువాత, కాన్పూర్‌లో మూడు వన్డే మ్యాచ్‌లు కూడా ఆడతారు. అయితే వన్డే సిరీస్ కోసం బీసీసీఐ ఇంకా భారత జట్టును ప్రకటించలేదు. BCCI ప్రస్తుతం మల్టీ డే మ్యాచ్‌లు అంటే.. అనధికారిక టెస్ట్ మ్యాచ్‌ల కోసం మాత్రమే ఆటగాళ్లను ప్రకటించింది.
రోహిత్ శర్మ ఆస్ట్రేలియా-ఎతో 3 వన్డేలు ఆడతాడా..
మీడియా నివేదికల ప్రకారం టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 5 వరకు ఆస్ట్రేలియా-ఎతో జరిగే అనధికారిక వన్డే సిరీస్‌లో ఆడాలని భావిస్తున్నాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వన్డే కెరీర్ గురించి రోహిత్ ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో రోహిత్ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడానికి, ముఖ్యంగా వన్డే కెప్టెన్సీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేయనున్నాడు. ఆస్ట్రేలియా ఎతో ఆడటానికి సిద్ధమవుతున్న విమర్శకులకు తన ప్రదర్శన ద్వారా సమాధానం చెబుతాడని హిట్ మ్యాన్ అభిమానులు భావిస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ 2027లో జరగనుంది కనుక, సీనియర్లు తప్పుకోవాలని, కొత్త వారికి అవకాశం ఇవ్వాలన్న మాజీల గొంతు పెరుగుతోంది. అదే సమయంలో రోహిత్, కోహ్లీలు ఫిట్‌గా ఉండే మాత్రం వన్డే వరల్డ్ కప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించడం మంచిదని మరికొందరు సూచిస్తున్నారు.





















