రిక్కీ పాంటింగ్
ఆస్ట్రేలియాలో అత్యంత ధనవంతుడైన క్రికెటర్. ఆటతో పాటు కామెంట్రీ, కోచింగ్, తన వ్యాపారమైన పాంటింగ్ వైన్స్ ద్వారా 70 మిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడు.


పాట్ కమ్మిన్స్
ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్, IPLలో పెద్ద ఆటగాడైన పాట్ కమ్మిన్స్ నికర విలువ 50 మిలియన్ డాలర్లు. అతను క్రికెట్ కాంట్రాక్టులు, బ్రాండ్ యాడ్స్, వ్యాపార పెట్టుబడుల ద్వారా బాగానే సంపాదించాడు.


షేన్ వాట్సన్
సుమారు 40 మిలియన్ డాలర్ల నికర విలువ షేన్ వాట్సన్ కలిగి ఉన్నాడు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా కామెంటరీ, కోచింగ్ ద్వారా డబ్బు సంపాదించాడు. బ్రాండ్ డీల్స్ ద్వారా కూడా బాగానే అర్జిస్తున్నాడు.


స్టీవ్ స్మిత్
ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లలో స్టీవ్ స్మిత్ ఒకరు. ఇతని నికర విలువ 30 మిలియన్ డాలర్లు. క్రికెట్, యాడ్స్, కొన్ని పెట్టుబడుల ద్వారా కోట్లు సంపాదించాడు.


డేవిడ్ వార్నర్
ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్, IPL స్టార్ డేవిడ్ వార్నర్ క్రికెట్ కాకుండా పెద్ద బ్రాండ్ల యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తారు. అతని నికర విలువ 25 మిలియన్ డాలర్లు.


గ్లెన్ మాక్స్ వెల్
టీ20 క్రికెట్ సూపర్ స్టార్ గ్లెన్ మాక్స్ వెల్ ఐపీఎల్, ఇతర లీగ్లతో పాటు యాడ్స్ ద్వారా కూడా బాగా సంపాదిస్తారు. అతని మొత్తం ఆదాయం దాదాపు 20 మిలియన్ డాలర్లు.


ఆడమ్ గిల్ క్రిస్ట్
గ్రేట్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆడమ్ గిల్ క్రిస్ట్ రిటైర్మెంట్ తర్వాత కామెంటరీ, కోచింగ్, యాడ్స్ ద్వారా డబ్బు సంపాదిస్తున్నారు. అతని నికర విలువ 18 మిలియన్ డాలర్ల వరకు ఉంది.


మాథ్యూ హెడెన్
స్ట్రాంగ్ బ్యాటింగ్‌కు పేరుగాంచిన మాథ్యూ హెడెన్ ఇప్పుడు కమెంట్రీ, మీడియా ద్వారా బాగా సంపాదిస్తున్నారు. అతని నికర విలువ దాదాపు 15 మిలియన్ డాలర్లుగా ఉంది.


మైఖేల్ క్లార్క్
మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ నికర విలువ 12 మిలియన్ డాలర్లు. అతను క్రికెట్ కెరీర్తో పాటు బిజినెస్, బ్రాండ్ యాడ్స్ ద్వారా కోట్లు సంపాదించాడు.


మార్క్ వా
స్టైలిష్ బ్యాట్స్‌మన్ మార్క్ వా రిటైర్మెంట్ తరువాత కామెంటరీ, యాడ్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. అతని నికర విలువ 10 మిలియన్ డాలర్లు.