Asia Cup 2025 Winner: భారత్ ఆసియా కప్ ఛాంపియన్ కావడానికి 3 కారణాలు! రోహిత్, విరాట్ లేకున్నా మనదే టైటిల్
Team India Asia Cup | ఆసియా కప్ 2025లో డిఫెండింగ్ ఛాంపియన్ మాత్రమే కాదు వరల్డ్ నెంబర్ టీం కూడా. భారత్ తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న UAEతో తలపడనుంది. భారత్ ఆసియా ఛాంపియన్ కావడానికి ఇవి గమనించారా.

Asia Cup 2025 | హైదరాబాద్: ఐసీసీ మేజర్ టోర్నీల్లో ఒకటైన ఆసియా కప్ ఈ సెప్టెంబర్ 9న ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ మధ్య జరుగుతుంది. టీమిండియా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 10న షెడ్యూల్ చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) తమ తొలి మ్యాచ్‌లో పటిష్ట భారత జట్టును ఢీకొట్టనుంది. గ్రూప్ Aలో భారత జట్టుతో పాటు పాకిస్తాన్, ఒమన్, UAE ఉన్నాయి. ఈసారి 8 జట్లు ఉండటంతో ఆసియా కప్ లో మ్యాచ్‌ల సంఖ్య పెరిగింది. అయితే పాక్ నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ భారత్ ఆసియా కప్ 2025 గెలవడం దాదాపు ఖాయమని భావించడానికి 3 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
1. భారత్ ఒక్క టీ20 సిరీస్‌లో కూడా ఓడిపోలేదు
2024 టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడు. గంభీర్ కోచ్‌గా వన్డేలు, టెస్టులు ఎలాగులున్నా టీ20ల్లో మాత్రం టీమిండియా రఫాండించేస్తుంది. ప్రత్యర్థి ఎవరు అని చూడకుండా వరుస విజయాలు అందుకుంది. ఒక యువ టీ20 జట్టును గంభీర్ తయారు చేస్తున్నాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. టీ20 ప్రపంచ కప్ తర్వాత, భారత క్రికెట్ జట్టు వరుసగా 5 టీ20 సిరీస్‌లను సాధించింది. 2024లో జింబాబ్వే పర్యటన నుంచి ఇప్పటివరకు భారత్ కేవలం 3 మ్యాచ్‌లలో మాత్రమే ఓడిపోయింది. ఈ రికార్డులే ఏడాది నుంచి పొట్టి ఫార్మాట్లో భారత్‌కు తిరుగులేదని నిరూపిస్తున్నాయి.
2. ప్రపంచ నంబర్-1 టీం, డిఫెండింగ్ ఛాంపియన్
టీ20 ర్యాంకింగ్‌లో భారత్ ప్రస్తుతం నంబర్-1 స్థానంలో ఉంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మరోవైపు ఆసియా కప్ డిఫెండింగ్ ఛాంపియన్ భారత్. జట్టులో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. టీ20లలో ఆసియా కప్ నంబర్-1 బౌలర్ అతడు. అదే సమయంలో, బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ టీ20 బ్యాటర్య ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా ప్రపంచ నంబర్ వన్ టీ20 ఆల్ రౌండర్. జట్టులో సగానికి పైగా టీ20 స్పెషలిస్టులు, వరల్డ్ లో టాప్ 5 ర్యాంకుల్లో ఉన్న ఆటగాళ్లు ఉంటే భారత్ ఆసియా కప్ గెలిచే అవకాశాలు చాలా ఎక్కువ.
3. ప్రపంచ స్థాయి ప్లేయింగ్ XI
శ్రేయస్ అయ్యర్, యశస్వి జైస్వాల్ వంటి టాప్ ఆటగాళ్లను ఎంపిక చేయకపోయినా ప్రపంచంలోని టాప్ ప్లేయింగ్ 11 భారత్ వద్ద ఉంది. శుభ్‌మన్ గిల్ ఏడాది తరువాత జట్టులోకి వచ్చాడు. గిల్, అభిషేక్ శర్మ రైట్ లెఫ్ట్ కాంబినేషన్ ఓపెనింగ్ చేస్తే, ఆ తర్వాత తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వంటి హిట్టర్స్ ఉన్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ లాంటి ఆల్ రౌండర్లు ఉన్నారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నాడు. అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా వంటి టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. వారితో పాటు స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఈ ఇద్దరూ ఏ క్షణంలోనైనా మ్యాచ్‌ను మలుపు తిప్పగలరు. ఈ ఆటగాళ్లతో బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ తయారు చేయవచ్చు. ఆసియా కప్ లాంటి టోర్నీలో భారత్ ఎప్పటికీ టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగుతుంది.





















