అన్వేషించండి

Pakistan Cricket: పాక్‌ డ్రెస్సింగ్‌ రూంలో బిగ్‌ వార్‌, అంతటికి కారణం బాబరేనా?

Pakistan Cricket: పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఓ తీవ్ర వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓటమితో ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది

Pakistan captain Shan Masood lose his temper: పాకిస్థాన్‌(Pakistan)డ్రెస్సింగ్‌ రూంలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. బాబర్‌ ఆజమ్‌(Babar Azam), కోచ్‌ గిలెస్పీ(Jason Gillespie), కెప్టెన్‌ షాన్ మసూద్‌( Shan Masoo) మధ్య జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగిన ఈ తీవ్ర వాగ్వాదం సంచలనం రేపుతోంది. పాకిస్థాన్‌ డిక్లేర్డ్‌ నిర్ణయం, బంగ్లాదేశ్‌ చేతిలో ఘోర ఓటమి నేపథ్యంలో ఈ వివాదం మరింత ముదిరింది.
పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌ను ముందుగానే డిక్లేర్ చేసినందుకు పాకిస్తాన్ అభిమానులు ఇప్పటికే  బాబర్‌ ఆజమ్‌ ఆట తీరుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఓటమితో ఈ వివాదం చినికిచినికి గాలివానగా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 100 పరుగులకు పైగా ఆధిక్యం సాధించడం... ఆ తర్వాత విజయం కూడా సాధించడంతో పాక్‌ క్రికెట్‌ అభిమానులు సొంత జట్టుపైనే ఆగ్రహంతో ఉన్నారు.

అసలేం జరిగిందంటే...
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న టెస్ట్‌లో మూడో రోజు కోచ్ జాసన్ గిల్లెస్పీతో షాన్‌ మసూద్‌ గొడవకు దిగడంతో డ్రెస్సింగ్ రూమ్ వేడెక్కింది. పాకిస్తాన్ సిరీస్‌కు కొత్త ప్రధాన కోచ్‌గా జాసన్ గిలెస్పీ నియమితుడయ్యాడు. డ్రెస్సింగ్‌ రూంలో గిలెస్పీతో షాన్‌ మసూద్‌ గట్టిగా అరుస్తూ ఏదో చెప్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇది పాకిస్థాన్‌ క్రికెట్‌లో పెను ప్రకంపనలు రేపుతోంది. కెప్టెన్‌ షాన్‌ మసూద్ పాక్‌ జట్టు ప్రదర్శనపై మండిపడడం.. కొత్త ప్రధాన కోచ్‌తో వాదించడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. పాక్ కెప్టెన్ అంతా ఆగ్రహంగా ఉండడానికి స్టార్‌ ప్లేయర్‌ బాబర్‌ ఆజమ్‌తో విభేదాలే కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. పాక్‌ జట్టు ప్రదర్శన పట్ల కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ కోపంతో ఊగిపోతూ గిల్లెస్పీపై ఆ కోపాన్ని చూపించడం సంచలనంగా మారింది. ఆసలు ఈ గొడవకు దారితీసిన ఘటన ఏమిటో స్పష్టంగా తెలియదు  

సోషల్‌ మీడియాలో విమర్శల వర్షంపాకిస్థాన్‌ డ్రెస్సింగ్‌ రూంలో కెప్టెన్ షాన్ మసూద్.. హెడ్‌ కోచ్‌ గిల్లెస్పీ మధ్య జరిగిన వాగ్వాదంతో పాక్‌ అభిమానులు మండిపడుతున్నారు. ఈ డ్రెస్సింగ్‌ రూం గొడవలతోనే పాక్‌ క్రికెట్ ఆటతీరు నానాటికి తీసికట్టుగా మారిపోతుందని మండిపడుతున్నారు. ‘బాబర్ కెప్టెన్సీని వదులుకోలేడు’అంటూ కొందరు పాక్‌ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పాకిస్థాన్ జట్టులో లుకలుకలకు బాబర్‌ ఆజమే కారణమని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. పాకిస్తాన్ ఘోర ప్రదర్శన తర్వాతే గిల్లెస్పీ, షాన్ మసూద్ మధ్య పోరాటం జరిగిందని సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు. బాబర్ అజామ్,  మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ సులువైన క్యాచ్‌లను వదలడంతోనే పాకిస్థాన్‌... బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్‌లో ఓడిపోయిందని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మసూద్ కెప్టెన్సీని బాబర్ దెబ్బతీస్తున్నాడని, కెప్టెన్‌కు కోపం తెప్పించేలా వ్యవహరిస్తున్నాడని అభిమానులు పేర్కొన్నారు.

Also Read: PAK vs BAN: పాక్‌ గడ్డపై బంగ్లా కొత్త చరిత్ర- పాపం పాక్‌ అనేలా, బంగ్లా గెలుపు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ ప్లేస్‌లో పవన్ కల్యాణ్కొడుకుతో గొడవ తరవాత హాస్పిటల్‌లో చేరిన మోహన్ బాబుతమిళనాడులో ఘోర ప్రమాదం, బస్‌ని ఢీకొట్టిన ట్రక్కేజ్రీవాల్ ఇంటి వీడియో షేర్ చేసిన బీజేపీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani: వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
వైఎస్ఆర్‌సీపీలో కలకలం - బియ్యం స్కాంలో పేర్ని నాని సతీమణిపై కేసులు నమోదు !
Mohanbabu: అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
అప్పటి వరకూ పోలీసుల ముందు హాజరు కానక్కర్లేదు - మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో ఊరట
Google Office In Andhra Pradesh: విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
విశాఖలో గూగుల్ ఆఫీస్‌- ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం- కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన చంద్రబాబు
Bima Sakhi: 'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
'బీమా సఖి'గా ఎంపికైతే రూ.2 లక్షల స్టైఫండ్, బోలెడు బెనిఫిట్స్‌ - ఎలా అప్లై చేయాలి?
Manchu Mohan Babu Family Issue : ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
ముఖంపై మైక్ పెడితే క్షణికావేశంలో కొట్టారు- జర్నలిస్టుపై దాడి దురదృష్టకరం: మంచు విష్ణు 
Manchu Mohan Babu Family Issue: మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
మా నాన్న భుజంపై తుపాకీ పెట్టి కాలుస్తున్నారు-సాయంత్రం గుట్టు విప్పుతా: మంచు మనోజ్‌
Home Minister on CIBMS: స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
స‌రిహ‌ద్దులు శ‌తృదుర్బేధ్యం-పాక్‌, బంగ్లా స‌రిహ‌ద్దుల్లో యాంటీ డ్రోన్ యూనిట్స్‌
Pushpa 2: 'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
'పుష్ప 2'పై బాలీవుడ్ దర్శకుడి కాంట్రవర్షియల్ కామెంట్స్... హిట్ మూవీ అంటూనే విమర్శలు
Embed widget