Shahid Afridi: అనుకోకుండా కెప్టెన్ అయ్యాడు, అల్లుడిపై మామ జోకులు
Shahid Afridi: టీ20ల్లో షాహీన్ అఫ్రిది కి కెప్టెన్సీ ఇవ్వడంపై అతడి మామ, మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో సెమీస్ చేరకుండగానే పాకిస్థాన్ వెనుదిరిగింది. అఫ్ఘానిస్థాన్ చేతిలో పరాజయం పాలై నాకౌట్ అవకాశాలను దూరం చేసుకున్న దాయాది దేశం... తర్వాత పుంజుకున్నా ఫలితం లేకుండా పోయింది. తన చివరి లీగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘోర పరాజయంతో పాకిస్థాన్ స్వ దేశానికి పయనమైంది. పాక్ ప్రదర్శనపై మాజీలు, క్రికెట్ అభిమానులు సహా అన్ని వైపుల నుంచి విమర్శల జల్లు కురుస్తోంది. ఈ వరల్డ్‌కప్‌లో అత్యుత్తమమైన పేస్ దళంగా పేరొన్న పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్లు తేలిపోయారు. షహీన్ షా అఫ్రిదీ తప్ప మిగిలిన పేసర్లంతా దారుణంగా విఫలమయ్యారు. వన్డే వరల్డ్‌కప్-2023 ముగిసిన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పలు మార్పులు జరిగాయి. ఐసీసీ టోర్నీలో పేలవ ప్రదర్శన నేపథ్యంలో బాబర్ ఆజం.. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు. టెస్టుల్లో షాన్ మసూద్‌కు టీ20ల్లో షాహీన్ అఫ్రిదికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. అయితే.. టీ20ల్లో షాహీన్ అఫ్రిది కి కెప్టెన్సీ ఇవ్వడంపై అతడి మామ, మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తప్పదారి కెప్టెన్ అయ్యాడు
ఏదో తప్పదారి షాహిన్ ఆఫ్రిది సారథి అయ్యాడని షాహిద్ ఆఫ్రిది వ్యాఖ్యానించాడు. అతడికి బదులు మహ్మద్ రిజ్వాన్‌కు పగ్గాలు అప్పజెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఓ ఆటగాడిగా రిజ్వాన్ అంటే తనకు ఇష్టమని.. ఆట పట్ల అతడికి ఉన్న అంకిత భావం, కఠిన శ్రమనే అతడిని అత్యుత్తమ ఆటగాడిగా చేశాయని అన్నాడు. ఆటగాడిగా రిజ్వాన్‌ను తాను ఆరాధిస్తానని.. కఠిన శ్రమ, ఆట పట్ల నిబద్ధత.. అతడిని అత్యుత్తమ క్రికెటర్‌గా నిలిపాయని కొనియాడాడు. కేవలం ఆట మీద మాత్రమే దృష్టి సారించి ఎక్కడ ఎంత వరకు నైపుణ్యాలను వాడుకోవాలో అతడికి బాగా తెలుసని. తనొక గొప్ప యోధుడని మహ్మద్ రిజ్వాన్‌ను షాహిద్ అఫ్రిదీ పొగడ్తలతో ముంచెత్తాడు.
అందుకనే తాను రిజ్వాన్‌ను టీ20 కెప్టెన్‌గా చూడాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. అయితే.. షాహీన్ పొరబాటున కెప్టెన్ అయ్యాడు అంటూ నవ్వుతూ చెప్పాడు. అఫ్రిది మాట్లాడిన ఈ వీడియో నెటింట్ట వైరల్‌గా మారింది. ఆ సమయంలో హ్యారిస్ రవూఫ్, సర్ఫరాజ్ అహ్మద్‌లతో పాటు అక్కడే ఉన్న షాహిన్ ఆఫ్రిది, మహ్మద్ రిజ్వాన్ నవ్వులు చిందించారు. దీనిపై నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. షాహిద్ ఆఫ్రిదికి షాహిన్ ఆఫ్రిది సొంత అల్లుడే. షాహిద్ కుమార్తె అన్షాను అతడు వివాహమాడాడు.
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచుల్లో ఓడిన పాకిస్తాన్ జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానున్న మూడో టెస్టులో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. ఆసీస్ పర్యటన అనంతరం పాక్.. న్యూజిలాండ్‌కు వెళ్లనుంది. కివీస్‌తో షాహీన్ అఫ్రిది నాయకత్వంలో పాక్ ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడనుంది. జనవరి 14 నుంచి ఈ సిరీస్ ఆరంభం కానుంది.