అన్వేషించండి

Shafali Verma: జట్టులో నుంచి తీసేశారు.. నాన్నకు గుండెపోటు వచ్చింది.. వారం పాటు నరకయాతన అనుభవించా.. భారత మహిళా స్టార్ ఆవేదన

Shafali Verma:ఐదేళ్ల అంతర్జాతీయ కెరీర్లో ఒక్క సెంచీర మాత్రమే షెఫాలీ సాధించింది. అయితే ఇటీవల తరచూ వికెట్ పారేసుకుంటుండటంతో ఆమెను జట్టు నుంచి తప్పించారు. కొత్తగా వచ్చిన ప్రతీకా పాతుకు పోయింది.

Shafali Verma News: భారత మహిళా బ్యాటర్ షెఫాలీ వర్మ కొన్ని ఆసక్తికర సంఘటనలు పంచుకున్నారు. గతేడాది న్యూజిలాండ్ తో సిరీస్ అయిన తర్వాత ఆమెను జట్టు నుంచి తొలగించారు. అయితే అంతకు రెండ్రోజుల ముందే తన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో ఈ విషయం చెప్పలేక పోయినట్లు పేర్కొంది. దాదాపు వారం రోజులపాటు హస్పిటల్లో ఉండి నరక యాతన అనుభవించినట్లు తెలిపింది. ఆ తర్వాత, తండ్రి పరిస్థితి మెరుగయ్యాక ఈ విషయం తెలిపినట్లు వెల్లడించింది. తన తండ్రి కోలుకున్న తర్వాత జాతీయ జట్టులో చోటు సంపాదించడం కోసం ఆయన తనకెంతో హెల్ప్ చేశారని, తన బలాలు బలహీనతలపై నజర్ పెట్టి, ఆటను ఎంతో మెరుగు చేశారని చెప్పుకొచ్చింది. ఇక షెఫాలీ ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ప్రతీకా రావాల్ అదరగొడుతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడిన ప్రతికా.. ఒక సెంచరీ, మూడు ఫిఫ్టీలతో అదరగొట్టింది. ఇటీవల ముగిసిన ఇర్లాండ్ వన్డే సిరీస్ లో భారీ సెంచరీ చేసి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు కొల్లగొట్టింది. 

దేశవాళీల్లో సత్తా చాటుతున్న షెఫాలీ..
జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక తన శక్తి సామర్థ్యాలకు పెంచుకోవడంపై షఫాలీ నజర్ పెట్టింది. ముఖ్యంగా తన తండ్రి తనకెంతో సహకరించాడని పేర్కొంది. చిన్నప్పటి నుంచి తన ఆటను గమనిస్తున్న తండ్రికి అన్ని విషయాలను తెలుసని, కొన్నిసార్లు మన బలాలు మనం మరిచిపోయినా, వాళ్లు గుర్తు పెట్టుకుంటారని వెల్లడించింది. ఆయన శిక్షణలో మరింతగా రాటు దేలినట్లు తెలిపింది. తన జోన్లోలోని బంతులను ఎదుర్కోవడంతోపాటు స్ట్రైక్ రొటేట్ చేయడంపై మరింతగా ఫోకస్ పెట్టినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో తన ఆట మరింతగా మెరుగైనట్లు తెలిపింది. టీమిండియాలో చోటు కోల్పోయాక దేశవాళీల్లో 12 మ్యాచ్ లాడిన షెఫాలీ.. నాలుగు వందలకుపైగా పరుగులు చేసింది. అత్యుత్తమ ఆటతీరు ప్రదర్శిస్తూ, త్వరలోనే జాతీయ జట్టులోకి ఎంపిక కావాలని చూస్తోంది.

దూకుడైన ఆటతీరకు కేరాఫ్ అడ్రస్..
న్యూజిలాండ్ సిరీస్ వరకు ఓపెనర్ గా షెఫాలీ ఆడింది. ఆ సిరీస్ లో వరుసగా 33, 12, 11 పరుగులతో విఫలమైన షెఫాలీని పక్కన పెట్టి, ప్రయోగాత్మకంగా ప్రతీకాను ఆడించారు. అయితే ఈ ప్రయోగం సూపర్ హిట్టయ్యింది. ఐర్లాండ్ తో వన్డే సిరీస్ లో తను అదరగొట్టి, జట్టులో చోటు సుస్థిరం చేసుకుంది. ముఖ్యంగా ఈ సిరీస్ లో మరో ఓపెనర్ స్మృతి మంధానతో కలిసి చక్కని శుభారంభాలను అందించింది. ముఖ్యంగా ఐర్లాండ్ తో చివరి వన్డేలో 233 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ను మంధానతో కలిసి నెలకొల్పింది. ఇక ఇప్పటివరకు ఆరు వన్డేలు ఆడిన ప్రతీకా 444 పరుగులతో సత్తా చాటింది. ఇక స్పిన్నర్ గాను రెండు వికెట్లు తీసింది. ప్రతీకా రాణించడంతో ఇప్పట్లో షెఫాలీకి జట్టులో చోటు దక్కడంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇక 2019లో అరంగేట్రం చేసిన ఫెఫాలీ.. 5 టెస్టులు, 29 వన్డేలు, 85 టీ20లు ఆడింది. అంతర్జాతీయంగా ఒక సెంచరీ, 17 ఫిఫ్టీలు సాధించింది. అయితే గత పది ఇన్నింగ్స్ లలో ఒక ఫిఫ్టీ కూడా సాధించలేక పోయింది. దీంతో టీమ్ మేనేజ్మెంట్ ఆమెపై వేటు వేసింది.  

Also Read: BCCI Ban: 'ఆ రూల్ కఠినంగా అమలు చేయండి' - బీసీసీఐకి దిగ్గజ కామెంటేటర్ సూచన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Kavitha New Party: రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
రాజకీయ శక్తిగా జాగృతి - మావోయిస్టు సానుభూతిపరులు కలసి రావాలని కవిత పిలుపు
Nicolas Maduro Guerra Warning:చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
చరిత్ర చెబుతుంది ద్రోహి ఎవరో? తల్లి మీద ఒట్టు అంటూ ట్రంప్‌కు మదురో కుమారుడు వార్నింగ్
Telugu Woman Murder: అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
అమెరికాలో తెలుగు యువతి దారుణహత్య.. బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్‌లో డెడ్‌బాడీ లభ్యం
Embed widget