Rohit Sharma: సూర్య బ్యాట్ తో రోహిత్ శర్మ- అయినా ఏం లాభం!
Rohit Sharma: భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలయ్యింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉపయోగించిన బ్యాట్ పై చర్చ జరిగింది. ఎందుకంటే....
Rohit Sharma: భారత్- బంగ్లాదేశ్ మధ్య జరిగిన తొలి వన్డేలో భారత్ ఓటమి పాలయ్యింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఉపయోగించిన బ్యాట్ పై చర్చ జరిగింది. ఎందుకంటే....
బంగ్లాతో తొలి వన్డేలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. టాస్ గెలిచిన బంగ్లా భారత్ కు మొదట బ్యాటింగ్ ను అప్పగించింది. ఇన్నింగ్స్ ను ప్రారంభించేందుకు వచ్చిన రోహిత్ బ్యాట్ పై కెమేరాలు ఫోకస్ చేశాయి. ఆ బ్యాట్ కింద్ ఎస్కే యాదవ్ అనే పేరు స్పష్టంగా కనిపించింది. దీన్ని బట్టి రోహిత్ సూర్య బ్యాటును ఉపయోగించాడేమో అనిపిస్తోంది. ఈ మ్యాచులో రోహిత్ 27 పరుగులు చేసి ఔటయ్యాడు.
అయితే హిట్ మ్యాన్ తన బ్యాట్ కాకుండా సూర్య బ్యాట్ ఎందుకు వాడాడో తెలియలేదు. ఒకవేళ అదృష్టం కోసం సూర్య బ్యాట్ ను తీసుకున్నాడేమో అని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. టీ20ల్లో సూర్యకుమార్ భీకరమైన ఫాంలో ఉన్నాడు. ఆ బ్యాట్ తోనే పరుగుల వరద సృష్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే సూర్య బ్యాట్ ను రోహిత్ తీసుకుని ఉంటాడని అభిమానులు అంటున్నారు. అయితే బ్యాట్ మార్చినా రోహిత్ రాత మారలేదు. మరోసారి తక్కువ పరుగులకే భారత కెప్టెన్ వెనుదిరిగాడు.
రోహిత్- సూర్యకుమార్ లో ఐపీఎల్ లో ముంబయికు ఆడుతున్నారు. వీరిద్దరూ ఆ జట్టుకు ఎన్నోసార్లు మంచి భాగస్వామ్యాలను అందించారు. 2021 లో పంజాబ్ కింగ్స్ పై రోహిత్- సూర్య 79 పరుగుల పార్ట్ నర్ షిప్ నమోదు చేశారు.
Trending news: Rohit Sharma seen holding bat signed by Suryakumar Yadav, watch viral video – BlogByRonit https://t.co/PCUeXcLvPj
— BlogByRonit (@BlogByRonit) December 6, 2022
ఐసీసీ మెచ్చిన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ప్రదర్శన- మీరు వీడియో చూశారా!
టీ20 ప్రపంచకప్ 2022... ఈ మెగా టోర్నీలో టీమిండియా కథ సెమీస్ లోనే ముగిసింది. సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ దశల్లోనూ ఇద్దరు, ముగ్గురు రాణించటంతో సెమీస్ వరకు వచ్చిన భారత్... కీలక మ్యాచులో చేతులెత్తేసింది.
అయితే ఈ ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఆసియా కప్ నకు ముందు ఒక నెల విరామం తీసుకుని తిరిగొచ్చిన విరాట్ ఆసియా కప్ లోనూ ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన పొట్టి వరల్డ్ కప్ లో విజృంభించాడు. కప్పు గెలవడంలో టీం విఫలమైనా వ్యక్తిగతంగా కోహ్లీ చాలా మంచి ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు అర్ధశతకాలతో 98.66 స్ట్రైక్ రేట్ తో 296 పరుగులు చేశాడు. అందులో పాకిస్థాన్ పై ఆడిన 82 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఫీల్డింగ్ లోనూ కింగ్ కోహ్లీ అదరగొట్టాడు. 2 అద్భుతమైన క్యాచులతో పాటు కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో ఒక రనౌట్ కూడా చేశాడు.
తాజాగా టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. విరాట్ ఆడిన సూపర్బ్ ఇన్నింగ్స్, పట్టిన క్యాచులు, రనౌట్ చేసిన వీడియోను పంచుకుంది.