అన్వేషించండి
Advertisement
IND vs ENG: రోహిత్‌ను ఊరిస్తున్న అరుదైన రికార్డులు
IND Vs ENG 4th Test: టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్‌కు మరో 22 పరుగులు అవసరం. రాంచీ టెస్టులోనే ఈ మైలురాయిని అతడు చేరుకునే అవకాశం ఉంది.
Rohit Sharma Record ahed In IND Vs ENG 4th Test: భారత్ - ఇంగ్లండ్( IND Vs ENG) మధ్య నాలుగో టెస్టుకు రంగం సిద్ధమైంది. రాంచీ వేదికగా ఇరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. మూడో టెస్టులో 434 పరుగుల భారీ తేడాతో గెలిచి జోరు మీదున్న భారత్ నాలుగో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ దక్కించుకోవాలని పట్టుదలగా ఉంది. ఈ మ్యాచ్‌లో ఎలానైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ఇంగ్లండ్ ఆశిస్తోంది. తొలి టెస్టు పరాభవం తర్వాత గాడిలో పడ్డ భారత్.... తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి జోరు మీదుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. ఈ సిరీస్ గెలిస్తే స్వదేశంలో వరుసగా 17 టెస్టు సిరీస్ విజయాలు భారత్ ఖాతాలో చేరతాయి. అయితే ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ(Rohit Sharma )ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.
ఊరిస్తున్న రికార్డులు
టెస్టుల్లో 4వేల పరుగుల మైలురాయిని చేరుకునేందుకు రోహిత్‌కు మరో 22 పరుగులు అవసరం. రాంచీ టెస్టులోనే ఈ మైలురాయిని అతడు చేరుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో 600 సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచేందుకు రోహిత్ ఏడు సిక్సుల దూరంలో ఉన్నాడు. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో 470 మ్యాచులు ఆడిన రోహిత్ శర్మ 593 సిక్సర్లు బాదాడు. మరో ఏడు సిక్సర్లు బాదితే 600 సిక్సర్లు కొట్టిన మొదటి ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు.
బజ్‌బాల్ వ్యూహం కొనసాగుతుందా..?
మరోవైపు "బజ్‌బాల్" వ్యూహం పనిచేయకపోవడం ఇంగ్లండ్‌ను కలవరపెడుతోంది. తొలి టెస్టు తర్వాత..... ఇంగ్లండ్ అభిమానులు ఆశించిన మేర ఆ జట్టు ఆకట్టుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలిచి సిరీస్‌లో నిలవాలని భావిస్తున్న ఇంగ్లీష్ జట్టు... కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. రెహాన్ అహ్మద్ స్థానంలో షోయబ్ బషీర్‌ను తీసుకుంది. స్పిన్ విభాగంలో టామ్ హర్ట్‌లీతో పాటు , సీనియర్ ఆటగాడు జోరూట్ బౌలింగ్ వేసే అవకాశముంది. బ్యాటింగ్‌లో జాక్ క్రాలీ, బెన్ డకెట్, కెప్టెన్ స్టోక్స్ రాణిస్తున్నప్పటికీ.....జో రూట్, బెయిర్‌స్టో బాగా ఆడాలని ఇంగ్లండ్ భావిస్తోంది. సీమ్ విభాగంలో సీనియర్ ఆటగాడు జేమ్స్ ఆండర్సన్‌తో కలిసి ఓలీ రాబిన్‌సన్ బౌలింగ్ చేయనున్నాడు. ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో భారత్ ముందంజలో ఉంది.
భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్, కెఎస్ భరత్ , దేవదత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.
ఇంగ్లాండ్ ఫైనల్ 11:
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జానీ బెయిర్ స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), టామ్ హార్ట్‌లీ, ఓలీ రాబిన్‌సన్, షోయబ్ బషీర్, జేమ్స్ అండర్సన్
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
విజయవాడ
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion