అన్వేషించండి

Rohit Sharma Record: 37 ఏళ్ల రికార్డును బద్ధలుకొట్టనున్న రోహిత్ శర్మ.. టీమిండియాలో హిట్ మ్యాన్ అరుదైన ఘనత

భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టబోతున్నాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అఫ్ఘానిస్తాన్‌తో మొదటి వన్డేలో రోహిత్ శర్మ చరిత్ర సృష్టించనున్నాడు.
  • భారత తరఫున వన్డే ఆడిన అత్యంత పెద్ద వయస్సు గల ఆటగాడిగా నిలుస్తాడు.
  • మోహిందర్ అమర్‌నాథ్ 37 ఏళ్ల రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టనున్నాడు.
  • కోహ్లీ, పాండ్యా గాయాలతో సిరీస్‌కు దూరమవడం జట్టుకు ఎదురుదెబ్బ.

India vs Afghanistan | ధర్మశాల: భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య జరగనున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. 37 ఏళ్ల నాటి రికార్డును హిట్ మ్యాన్ బద్దలు కొట్టబోతున్నాడు. భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్ శనివారం ధర్మశాల వేదికగా జరగనుంది. టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌ రోహిత్ శర్మ  అడుగు పెట్టగానే 37 ఏళ్ల నాటి రికార్డును బద్దలు కొట్టనున్నాడు. వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఆడిన అత్యంత వృద్ధ (ఎక్కువ వయసు గల) క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. ఇటీవల అతడు ఫిట్‌నెస్ టెస్ట్ పాసయ్యాడు. దాంతో భారత జట్టులో కొనసాగుతున్నాడు. 

రోహిత్ శర్మ ఈ మూడు వన్డేల సిరీస్ కోసం పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు. మరోవైపు భారత జట్టుకు సిరీస్‌కు ముందు బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు అందుబాటులో లేరు. విషయం ఏంటంటే.. విరాట్ కోహ్లీతో పాటు హార్దిక్ పాండ్యా సైతం గాయాలతో బాధపడుతున్నారు. దాంతో వారిద్దరూ ఈ సిరీస్‌కుగానూ భారత జట్టులో భాగం కాలేకపోతున్నారు. ఇంగ్లాండ్ పర్యటన నాటికి వీరిద్దరూ భారత జట్టులోకి పునరాగమనం చేస్తారని భావిస్తున్నారు.

Also Read: Team India Seniors: టీమిండియా డ్రెస్సింగ్‌ రూమ్‌లో ముసలం, హెడ్ కోచ్ గంభీర్‌ను కాదని బీసీసీఐ బాస్‌లతో సీనియర్ల సీక్రెట్ మీటింగ్స్..

రోహిత్ శర్మ పేరిట అత్యధిక వయసు ట్యాగ్
ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచులో బరిలోకి దిగినప్పుడు రోహిత్ శర్మ వయసు 39 ఏళ్ల 44 రోజులు ఉంటుంది. దాంతో భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత ఎక్కువ వయసు గల ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు. 37 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ ఈ రికార్డును బద్దలుకొట్టి తన పేరిట లిఖించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇప్పటికి సరిగ్గా 37 ఏళ్ల కిందట 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఈ రికార్డు ఉండేది. మోహిందర్ అమర్‌నాథ్ భారత్ తరఫున తన చివరి వన్డే మ్యాచ్‌ను 1989లో ఆడగా.. ఆ సమయంలో మోహిందర్ అమర్‌నాథ్ వయసు 39 ఏళ్ల 36 రోజులు ఉంది. 

IND vs AFG వన్డే సిరీస్ జట్టు

భారత్ ఆటగాళ్లు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్, హర్ష్ దూబే.

Read Also: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచ కప్‌లో గోల్స్‌ వేటలో మెస్సీ టాప్-5... రొనాల్డో ర్యాంక్ ఎంత? ఆల్‌టైమ్‌ లెజెండ్స్ రికార్డుల పూర్తి లిస్ట్ ఇదే!

ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, ఇక్రామ్ అలీఖిల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఖైస్ అహ్మద్, బిలాల్ సామీ, సిద్దిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్, నంగ్యాలియా ఖరోటే, అబ్దుల్ మాలిక్, షరాఫుద్దీన్ అష్రఫ్, జియాయుర్ రహ్మాన్ షరీఫీ, మహ్మద్ సలీమ్ సఫీ, రహ్మానుల్లా

Frequently Asked Questions

రోహిత్ శర్మ ఏ రికార్డును బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నాడు?

వన్డే క్రికెట్‌లో భారత్ తరఫున ఆడిన అత్యంత వృద్ధ (ఎక్కువ వయసు గల) క్రికెటర్‌గా రోహిత్ శర్మ నిలవనున్నాడు. అతను ఈ రికార్డును 37 ఏళ్ల తర్వాత బద్దలు కొట్టబోతున్నాడు.

భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన అత్యంత ఎక్కువ వయసు గల ఆటగాడిగా గతంలో ఎవరి రికార్డు ఉండేది?

గతంలో 1983 వరల్డ్ కప్ ఛాంపియన్ క్రికెటర్ మోహిందర్ అమర్‌నాథ్ పేరిట ఈ రికార్డు ఉండేది. ఆయన తన చివరి వన్డే మ్యాచ్ ఆడినప్పుడు 39 ఏళ్ల 36 రోజులు.

భారత్-ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా అందుబాటులో ఉన్నారా?

లేదు, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు. వారు ఇంగ్లాండ్ పర్యటన నాటికి తిరిగి వస్తారని భావిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!
Shubman Gill Ignores Kuldeep Yadav: కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 
Umpires Warning to Steve Smith : ప్రత్యర్థిని రెచ్చగొట్టిన స్టీవ్ స్మిత్... రంగంలోకి దిగి బుద్ధి చెప్పిన అంపైర్లు!
ప్రత్యర్థిని రెచ్చగొట్టిన స్టీవ్ స్మిత్... రంగంలోకి దిగి బుద్ధి చెప్పిన అంపైర్లు!
India vs Sri Lanka Colombo Test Updates: కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
కుల్దీప్ కు ఉద్వాసన తప్పదా...! బౌలింగ్ కూర్పుపై టీమ్ మేనేజ్మెంట్ కసరత్తు
Advertisement

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్
AP Job Calendar: 10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
10,060 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏపీ జాబ్‌ క్యాలెండర్‌ వచ్చేసింది
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Cab Drivers Strike: తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్‌ వ్యాన్‌లు బంద్‌.. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Gachibowli Building Collapse: అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
అలాంటి బిల్డింగ్స్ అన్నీ కూల్చివేస్తాం.. గచ్చిబౌలి ఘటనా స్థలాన్ని పరిశీలించిన రంగనాథ్
Konda Surekha Letter To TPCC: నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
నన్ను, నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నారు, చర్యలు తీసుకోండి: టీపీసీసీకి కొండా సురేఖ లేఖ
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Viral Video: న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
న్యూసెన్స్ చేసిన బెటాలియన్ కానిస్టేబుల్‌ను లాఠీతో చితకబాదిన బీట్ కానిస్టేబుల్
Embed widget