అన్వేషించండి

Shubman Gill Ignores Kuldeep Yadav: కుల్దీప్ పై నమ్మకం లేని గిల్..!! అతనో అద్భుతమైన ఆటగాడు, కివీస్ టూర్ లో చాలా యూజ్ అవుతాడని మాజీ క్రికెటర్ వ్యాఖ్య 

India Vs Sri Lanka: గాలే టెస్టులో కుల్దీప్ యాదవ్‌కు సరైన స్పెల్స్ ఇవ్వకుండా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అతడిపై నమ్మకం కోల్పోయాడని మహమ్మద్ కైఫ్ విమ‌ర్శించాడు

IND VS SL, MD Kaif Slams Gill Over Kuldeep Spell: శ్రీలంకతో గాలేలో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను ఉపయోగించిన తీరుపై టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడు. స్పిన్‌కు అనుకూలించిన పిచ్‌పై యువ బౌలర్ మానవ్ సుతార్ 10 వికెట్లతో చెలరేగగా, రవీంద్ర జడేజా కీలక వికెట్లు ప‌డగొట్టాడు. కానీ కుల్దీప్ మాత్రం కేవలం ఒకే ఒక్క వికెట్ తీసి చాలా తక్కువ ఓవర్లు వేసిన సంగతి తెలిసిందే. సుతార్, జడేజా చెరో 44 ఓవర్లకు పైగా బౌలింగ్ చేస్తే, కుల్దీప్‌కు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 25 ఓవర్లు మాత్రమే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఎక్కువ ఓవ‌ర్లు ఇవ్వాలి..
తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడిన కైఫ్, గిల్ కెప్టెన్సీపై ఆరోప‌ణ‌లు చేశాడు. "కుల్దీప్‌ను వాడిన విధానం చూస్తే అతడిపై శుభ్‌మన్ గిల్‌కు తగినంత నమ్మకం లేదని తెలుస్తోంది. నా దృష్టిలో కుల్దీప్ లాంటి విలక్షణమైన బౌలర్ తరచుగా ల‌భించ‌డు. అలాంటి ఆటగాళ్లు చరిత్రలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే దొర‌కుతారు. భవిష్యత్తులో జడేజా స్థానంలో సుతార్ రావచ్చు, అశ్విన్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చాడు, కానీ కుల్దీప్ ఒక అరుదైన వరంలాంటి వాడు. రిస్ట్ స్పిన్నర్లకు సుదీర్ఘ స్పెల్స్ ఇవ్వాల్సిన అవ‌స‌రం ఉంది. చిన్న చిన్న స్పెల్స్ ఇవ్వడం వల్ల కుల్దీప్ రిథమ్ అందుకోలేకపోయాడని తెలుస్తోంది. తప్పులు సరిదిద్దుకునే ఛాన్స్ అతడికి దక్కలేదు" అని కైఫ్ విమ‌ర్శించాడు.

కివీస్ టూర్ కు కీలకం..
గతంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లే విదేశీ పరిస్థితుల్లో కుల్దీప్ యాదవ్ ఇండియా నంబర్ 1 స్పిన్నర్ అని కైఫ్ పేర్కొన్నాడు. "టర్నింగ్ ట్రాక్స్‌పై కేవలం కచ్చితత్వంతో ఒకే చోట బౌలింగ్ చేస్తే వికెట్లు ల‌భిస్తాయి. కానీ నవంబర్ లో ప్రారంభమయ్యే న్యూజిలాండ్ పర్యటనలో ఇలాంటి పిచ్‌లు ల‌భించ‌వు. ఫ్లాట్ వికెట్లు లేదా పెద్దగా టర్న్ లేని పిచ్‌లపై కుల్దీప్ అత్యంత కీలకంగా మారతాడన‌డంలో సందేహం లేదు. కెప్టెన్, టీమ్ మేనేజ్‌మెంట్ అతడి ఆత్మవిశ్వాసాన్ని కాపాడాల్సి ఉంది" అని వ్యాఖ్యానించాడు.

రెండో టెస్టులో టీమిండియాలో మార్పు..
కొలంబోలో జరిగే రెండో టెస్టులో మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్‌కు అరంగేట్రం చేసే అవకాశం ఉందని కైఫ్ వ్యాఖ్యానించాడు. శ్రీలంక బ్యాటర్లు నిరోషన్ డిక్వెల్లా, సొనాల్ దినుష ఇద్దరూ లెఫ్ట్ హ్యాండర్లు కావడంతో ఆఫ్ స్పిన్నర్ అవసరం ఏర్పడిందని పేర్కొన్నాడు. లంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు కుల్దీప్ స్థానంలో సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆదివారం నుంచి కొలంబోలో రెండో టెస్టు ప్రారంభ‌మ‌వుతుండ‌గా, తొలి టెస్టును నెగ్గిన టీమిండియా, 1-0తో ఆధిక్యంలో ఉంది. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
Rohit Sharma Record: అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
అఫ్రిది రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ .. కివీస్ పై సిక్సర్ల సునామీతో సరికొత్త చరిత్ర, గేల్ అగ్రపీఠంపై గురి
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget