అన్వేషించండి

IND VS SL 2nd Test Predicted XI: రేపటి నుంచి లంకతో రెండో టెస్ట్! సిరీస్ పై కన్నేసిన టీమిండియా.. తుదిజట్టులో మార్పు..!!

శ్రీలంక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్‌ను తీసుకోవడం సమంజసమేనని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. రెండో టెస్టు గెలిస్తే సిరీస్ ఇండియా సొంతమ‌వుతుంది.

IND VS SL 2nd Test Latest Updates: శ్రీలంకతో ఆదివారం నుంచి కొలంబోలోని ఎస్ఎస్ సీ మైదానంలో ప్రారంభం కానున్న రెండో టెస్ట్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా తుది జట్టు ఎంపికపై తీవ్ర క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. గాలే టెస్టులో విజయం సాధించిన జట్టులో మార్పులు ఉంటాయా లేదా అనే ప్రశ్నలు అభిమానుల మ‌దిని తొలుస్తున్నాయి. ముఖ్యంగా తొలి టెస్టులో కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి పెద్దగా ప్రభావం చూపలేకపోయిన చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తప్పించి ఆఫ్ స్పిన్నర్ సారాంశ్ జైన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం సరైన నిర్ణయమేనని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ లాంటి అనుభ‌వ‌జ్ఞులు వ్యాఖ్యానిస్తున్నారు.

Read Also: Umpires Warning to Steve Smith : ప్రత్యర్థిని రెచ్చగొట్టిన స్టీవ్ స్మిత్... రంగంలోకి దిగి బుద్ధి చెప్పిన అంపైర్లు!

ఆఫ్ స్పిన్నర్ కీలకం..
గాలే టెస్ట్ గణాంకాలను పరిశీలిస్తే శ్రీలంక జట్టు సాధించిన మొత్తం 465 పరుగుల్లో నలుగురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లే ఏకంగా 300 పరుగులు చేయ‌డం విశేషం. ఇది ఆ జట్టు మొత్తం స్కోరులో దాదాపు 64.5 శాతానికి సమానంగా ఉంది. దీనికి విరుద్ధంగా ఇండియా ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లను ఆడించింది. ఇందులో కుల్దీప్ 25 ఓవర్లలో 103 పరుగులు ఇచ్చి కేవలం ఒకే వికెట్ మాత్ర‌మే ప‌డ‌గొట్టాడు. "గత మ్యాచ్‌లో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉండటం వల్ల ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లు క్రీజులో ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా అనిపించింది. కుల్దీప్ స్థానంలో ఆఫ్ స్పిన్నర్ వస్తే భారత స్పిన్ అటాక్‌లో వైవిధ్యం న‌మోద‌వుతుంది. డీఆర్ఎస్ నిబంధనల దృష్ట్యా టెస్ట్ క్రికెట్‌లో ఆఫ్ స్పిన్నర్ ఎంతో కీలకం అని చెప్ప‌క త‌ప్ప‌దు" అని మంజ్రేకర్ తన తాజా వీడియోలో వ్యాఖ్యానించాడు.

Read Also: Gayatri Bronze Win: బ్రాంజ్ తో మెరిసిన తెలుగు తేజం.. విమెన్స్ డబుల్స్ లో పోరాడి ఓడిన గాయ‌త్రీ.. వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్

ప‌డిలేచిన కెర‌టం కుల్దీప్..
కుల్దీప్‌ను తప్పించాల్సి రావడం బాధాకరమైన విషయమే అయినా అతడు తన బౌలింగ్ లోపాలను సరిదిద్దుకోవాలని మంజ్రేకర్ పేర్కొన్నాడు. "కుల్దీప్ యాదవ్ జట్టు నుంచి డ్రాప్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది, అతడి కెరీర్‌లో ఇది తరచుగా ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌. అయితే గత మ్యాచ్‌లో తను బౌలింగ్ చేసిన విధానాన్ని కుల్దీప్ సమీక్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. గాల్లో బంతి వేగం, ఫ్లైట్ పై వచ్చిన విమర్శల వల్ల అతడు ఫ్లాట్‌గా, వేగంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నించాడని తెలుస్తోంది. కానీ పిచ్ నుంచి బంతి అనుకున్నంత వేగంగా బ్యాటర్ మీదికి రాక‌పోవ‌డం మైన‌స్ గా మారింది. దీని నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాల్సిన అవ‌స‌ర‌ముంది" అని వ్యాఖ్యానించాడు.

రెండో టెస్టుకు భార‌త తుదిజ‌ట్టు (అంచనా):
కొలంబో పిచ్ పొడిగా ఉండే అవకాశాలు ఉండటంతో ఆఫ్ స్పిన్నింగ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్సెస్ క‌నిపిస్తున్నాయి. భారత ప్రెడిక్టెడ్ లెవ‌న్ లో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, సారాంశ్ జైన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఉండే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. దీంతో కుల్దీప్ బెంచ్ కే ప‌రిమిత‌మ‌వ్వ‌క త‌ప్ప‌దు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS WI Series Alive Drama: విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
విండీస్ విశ్వరూపం.. పోరాడి ఓడిన భారత్, ఆక‌ట్టుకున్న సంజూ, తిల‌క్, నితీశ్, హోప్ మెరుపు శతకం, పాల్ పాంచ్ ప‌టాకా,  సిరీస్ సమం
Natarajan Homecoming Trade: సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
సగం ధరకే సొంత గూటికి యార్కర్ల వీరుడు.. సన్‌రైజర్స్ ,ఢిల్లీ మధ్య  ప్లేయర్ స్వాప్, నటరాజన్ కోసం అన్సారీని వదులుకున్న ఆరెంజ్ ఆర్మీ
Tilak Runout Explanation: బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
బౌండరీ అనుకుని నడుచుకుంటూ వెళ్లా.. ఇండోర్ రనౌట్‌పై ఎట్టకేలకు నోరు విప్పిన తిలక్
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Advertisement

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
Chandrababu Vijay River Interlinking: చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
చంద్రబాబు - విజయ్ భేటీలో అసలు మ్యాటర్ - గోదావరి-కావేరి అనుసంధానం సాధ్యమేనా?
Embed widget