Annamalai on Jadeja: సీఎస్కే విజయం వెనుక బీజేపీ హస్తం - తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
IPL 2023: రెండ్రోజుల క్రితం అత్యంత ఉత్కంఠ మధ్య ముగిసిన ఐపీఎల్ - 16 ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయం వెనుక బీజేపీ పాత్ర ఉందంటున్నారు ఆ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు కె. అన్నామలై..!
Annamalai on Jadeja: నాలుగు గంటల్లో ముగియాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా మూడు రోజుల్లో ముగిసినా ఎక్కడ ఇసుమంతైనా ఉత్కంఠ, క్రేజ్ తగ్గకుండా రెండ్రోజుల క్రితం అహ్మదాబాద్ వేదికగా జరిగిన చెన్నై సూపర్ కింగ్స్ - గుజరాత్ టైటాన్స్ ఫైనల్‌ను ధోనిసేన గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆఖరి రెండు బంతుల్లో పది పరుగులు అవసరం ఉండగా సీఎస్కే వెటరన్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 6,4 కొట్టి చెన్నైకి ఐదో ఐపీఎల్ టైటిల్ అందించాడు. అయితే చెన్నై విజయంలో బీజేపీ పాత్ర ఉందంటున్నారు ఆ పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షడు కె.అన్నామలై. ఓ టీవీ చర్చా కార్యక్రమంలో అన్నామలై ఈ వ్యాఖ్యలు చేశారు.
చెన్నై ఐపీఎల్-16 ఫైనల్ గెలిచిన తర్వాత ఓ టీవీ ఛానెల్‌లో జరిగిన చర్చా కార్యక్రమంలో అన్నామలై పాల్గొన్నారు. గుజరాత్‌పై చెన్నై గెలవడాన్ని తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా.. ‘ఇది గుజరాత్ మోడల్‌పై ద్రవిడియన్ మోడల్ సాధించిన విజయం’ అని చెప్పడాని అన్నామలై తప్పుబట్టారు.
రాజా వ్యాఖ్యలపై అన్నామలై స్పందిస్తూ...‘ఇది రాజా మూర్ఖత్వాన్ని తెలియజేస్తోంది. ఎందుకంటే సీఎస్కే టీమ్‌లో ఒక్క తమిళ ఆటగాడు లేడు. కానీ గుజరాత్ టీమ్‌లో ముగ్గురు తమిళ క్రికెటర్లు ఉన్నారు. ఇక ఫైనల్ మ్యాచ్‌లో లాస్ట్ బాల్‌కు ఫోర్ కొట్టి చెన్నైని గెలిపించిన రవీంద్ర జడేజా బీజేపీ కార్యకర్త. ఆయన భార్య (రివాబా జడేజా) బీజేపీ ఎమ్మెల్యే. గుజరాత్‌లో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జడేజా.. ఆయన భార్య విజయం (జామ్‌నగర్ నియోజకవర్గంలో) కోసం పాటుపడ్డాడు. గుజరాత్‌లో మాదిరిగానే తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది..’అని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
View this post on Instagram
రెజ్లర్ల నిరసనపై..
దేశ రాజధానిలో గడిచిన నెలన్నరగా కొనసాగుతున్న రెజ్లర్ల పోరాటంపై కూడా అన్నామలై స్పందించారు. ఈ కేసులో ప్రస్తుతం విచారణ సాగుతున్నదని.. దీనిపై రెజ్లర్లు డెడ్ లైన్ విధించి ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తిని అరెస్టు చేయాలనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ఇందుకు ఆయన తమిళనాట లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ గేయ రచయిత వైరముత్తు కేసును ఉదహరించాడు. ‘వైరముత్తుపై 19 లైంగిక వేధింపుల కేసులున్నాయి. అయినా ఆయన ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌తో సన్నిహితంగానే ఉంటున్నారు. వైరముత్తు మీద చేసిన ఆరోపణలేవీ ఇంకా రుజువు కాలేదు కాబట్టే ఆయనను ఇంకా అరెస్టు చేయలేదు..’ అని అన్నారు. రెజ్లర్ల పోరాటం నానాటికీ ఉధృతమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలో విచారణను వేగవంతం చేసిన విషయం విదితమే.
Reeling it in Super style 😍🫶#CHAMPION5 #WhistlePodu #Yellove 🦁 💛 pic.twitter.com/CMos0tBgUN
— Chennai Super Kings (@ChennaiIPL) May 31, 2023