Virat Kohli Retirement: టెస్టులకు బ్రాండ్ అంబాసిడర్ కోహ్లీ.. అతని రిటైర్మెంట్ పై బీసీసీఐ మరింత మెరుగ్గా వ్యవహరించాల్సింది.. మాజీ కోచ్ వ్యాఖ్య
గతేడాది టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఈ ఏడాది టెస్టులకు బై బై చెప్పాడు.ప్రస్తుతం కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఆగస్టులో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో కోహ్లీని తిరిగి ఆడతాడు.

Ravi Shastri Comments: భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి తాజాగా స్పందించాడు. టెస్టులకు విరాట్ వీడ్కోలు పలికిన తీరు బాధకరమని పేర్కొన్నాడు. బీసీసీఐ మరింత బాగా ఈ విషయాన్ని హేండిల్ చేసి ఉంటే బాగుండేదని, బీసీసీఐ ఈ విషయంలో మరింత మెరుగైన కమ్యూనికేషన్ తో పని చేస్తే బాగుండేదని వ్యాఖ్యానించాడు. అతను అంత సడెన్ గా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించలేదని తెలిపాడు. తనలో ఇంకా ఆట చాలా మిగిలి ఉందని పేర్కొన్నాడు. టెస్టులకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి ఆటగాడని, ఇలా సడెన్ గా ఈ ఫార్మాట్ కు వీడ్కోలు పలకడం తాను నమ్మలేకపోయానని తెలిపాడు. ఈ జనవరిలో ముగిసిన బోర్డర్-గావాస్కర్ ట్రోఫీ అనంతరం విరాట్ కోహ్లీ ను కెప్టెన్ చేస్తే బాగుండేదని, తాను ఒక వేళ డెసిషన్ తీసుకునే పొజిషన్ లో ఉంటే ఇలాగే చేసేవాడనిని రవి శాస్త్రి పేర్కొన్నాడు.
RAVI SHASTRI ON VIRAT KOHLI'S RETIREMENT:
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 11, 2025
"If I had anything to do with it, I would've made Virat captain straightaway after BGT". pic.twitter.com/J4vG2i8HV6
అతనో గొప్ప ప్లేయర్..
విరాట్ చాలా గొప్ప ప్లేయరని, ఇప్పుడు అతని విలువ అంతా తెలుసుకుంటారని శాస్త్రి వ్యాఖ్యానించాడు. అలాగే మైదానంలో తాను ఎంత గొప్పగానో ఆడేవాడని, స్టాట్స్ అతని నిజమైన ప్రతిభకు తార్కాణం కావని తెలిపాడు. తన హయాంలోనే లార్గ్స్ లో ఇంగ్లాండ్ పై టీమిండియా అద్భుత విజయం సాధించిందని, ఆ సమయంలో జట్టు కోచ్ గా ఉండటం తను అదృష్టమని వ్యాఖ్యానించాడు. ముఖ్యంగా విదేశాల్లో జట్టును అద్భుతంగా నడిపించడంతోపాటు తను కూడా బాగా ఆడాడని కితాబిచ్చాడు. ఇక గతేడాది టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లీ.. ఈ ఏడాది టెస్టులకు బై బై చెప్పాడు. ప్రస్తుతం తాను కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. ఈ ఆగస్టులో బంగ్లాదేశ్ తో వన్డే సిరీస్ లో కోహ్లీని తిరిగి మైదానంలో చూడవచ్చు.
2011లో అరంగేట్రం..
టెస్టు ఫార్మాట్ ను అమితంగా ఇష్టపడే కోహ్లీ.. ఈ ఫార్మాట్ లో పది వేల పరుగులు చేయడం తన కలని ఎన్నోసార్లు చెప్పాడు. అయితే ఈ మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో కోహ్లీ నిలిచిపోయాడు. ఓవరాల్ గా 2011లో వెస్టిండీస్ పై అరంగేట్రం చేసిన కోహ్లీ.. 201 ఇన్నింగ్స్ లో 9,230 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 254 నాటౌట్ కావడం విశేషం. ఈ ఫార్మాట్లో 30 సెంచరీలు, 31 ఫిప్టీలు బాదాడు. ఓవరాల్ గా 123 టెస్టుల్లో టీమిండియాకు తను ప్రాతినిథ్యం వహించాడు. అలాగే ఈ ఫార్మాట్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా నిలిచాడు. అన్నిజట్ల కంటే కూడా ఆస్ట్రేలియాపై అత్యధికంగా 2,232 పరుగులు చేశాడు. 2018లో అత్యద్భుతంగా ఆడిన కోహ్లీ ఏకంగా 1,322 పరుగులను సాధించాడు.




















