అన్వేషించండి
Advertisement
Achraf Hakimi: కోట్ల ఆస్తుల్లో సగం కావాలన్న భార్య , షాక్ ఇచ్చిన ఫుట్‌బాల్ స్టార్
PSG Star Achraf Hakimis: భరణం అడిగిన మొరాకో స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ అచ్రాఫ్ హకీమీ మాజీ భార్యకు కోర్ట్ షాక్ ఇచ్చింది. దిగ్గజ ఆటగాళ్లలో ఒకడైన అచ్రాఫ్ హకీమీ పేరున ఒక్క ఆస్తి కూడా లేదని తేలింది.
Achraf Hakimis Divorce Case : మొరాకో స్టార్ ఫుట్‌బాల్ ఆటగాడు అచ్రాఫ్ హకీమీ(Achraf Hakimis)... విడాకుల కేసులో ఆసక్తికర ఘటన జరిగింది. మొరాకో జాతీయ ఆటగాడిగా...పారిస్ సెయింట్-జెర్మైన్ క్లబ్, రియల్ మాడ్రిడ్ జట్టులో స్టార్ ఆటగాడిగా అచ్రాఫ్ హకీమీ కోట్లకు పగలెత్తాడు. అసాధారణ ఆటతీరుతో దిగ్గజ ఆటగాళ్లలో ఒకడిగా పేరుగాంచాడు. అయితే అచ్రాఫ్ హకీమీకి 19 ఏళ్ల వయస్సున్నప్పుడు 31 ఏళ్ల హిబా అబోక్‌తో డేటింగ్ చేసి వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ మూడేళ్ల వివాహ బంధం తర్వాత విడిపోయారు. ప్రస్తుతం హకీమీ వయసు 24 ఏళ్లు కాగా... హిబా అబోక్(Hiba Abouk) వయసు 36 ఏళ్లు. విడిపోయే నాటికి వీరిద్దరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తే ఉన్నారు. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. హకీమీ నుంచి తనకు విడాకులు ఇప్పించాలని... అతని కోట్ల సంపదలో సగం ఆస్తిని తనకు భరణంగా ఇవ్వాలని అబోక్ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు.
ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్
తనకు భరణంగా భర్త అచ్రాఫ్ హకీమీ కోట్ల విలువైన ఆస్తిలో సగ భాగం కావాలని అబోక్ డిమాండ్ చేయడంతో కోర్టు విచారణ ఆరంభించింది. అచ్రాఫ్ హకీమీ కూడా భార్య అడిగిన భరణం ఇచ్చేందుకు సమ్మతం తెలిపాడు. తన ఆస్తిని ఇచ్చేందుకు అంగీకారం తెలిపాడు. ఇక్కడే అచ్రాఫ్ హకీమీ ఆస్తుల విలువ తెలిసి కోర్టుతోపాటు మాజీ భార్య అబోక్‌కు కూడా దిమ్మతిరిగే షాక్ తగిలింది. తాను సంపాదించిన డబ్బును మొత్తం హాకీమీ తన తల్లి పేరున రాసేశాడు. బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రైజ్ మనీ ద్వారా వచ్చిన మొత్తం ఆస్తిని పూర్తిగా తన తల్లికే రాసి ఇచ్చేశాడు హకీమీ. దీంతో హకీమీ పేరు మీద అసలు ఆస్తే లేదని కోర్టు తేల్చింది. భవనాలు, ఇళ్లు, స్థలాలు అన్నీ తన తల్లి పేరిటే ఈ ఫుట్‌బాల్ స్టార్ రిజిస్టర్ చేశాడు. వీటితో పాటు మ్యాచ్ ఫీజు, కాంట్రాక్ట్‌ల ద్వారా వచ్చే ఆదాయంలో 80 శాతం కూడా తన తల్లి ఫాతిమా అకౌంట్‌లోనే డిపాజిట్ చేసేశాడు హకీమీ. దీంతో హకీమీ పేరు మీద ఎలాంటి ఆస్తులు లేవని.. ఆఖరికి సొంత బట్టలు కూడా లేవని కోర్టు విచారణలో తేలింది.
అసలు ఏమైందంటే
గతంలో అచ్రాఫ్ హకీమీపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. అప్పుడే హకీమీ-అబోక్ విడిపోతారని ప్రచారం జరిగింది. ఆ అత్యాచార కేసు నడుస్తుండగానే అబోక్ విడాకుల కోసం అప్పీలు చేసింది. తన ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేసింది. అయితే అచ్రాఫ్ హకీమీ ఆస్తంతా తల్లి పేరిటే ఉండండతో ఇప్పుడు అబోక్‌కు ఒక్క డాలర్ కూడా దక్కే అవకాశం లేకుండా పోయింది. హకీమీ తన తల్లి పేరిట కొనుగోలు చేసిన ఆస్తుల విలువ దాదాపు 200 కోట్లకుపైనే ఉంటుందని తెలుస్తోంది. హకీమీ సగటు వార్షిక వేతనం 14.5 మిలియన్ యూరోలు కాగా... గతేడాది హకీమీ 53.9 మిలియన్ యూరోలు సంపాదించినట్లు తెలుస్తోంది. మొరాకో ఫుట్‌బాలర్ ఆఫ్ ది ఇయర్, రియల్ మాడ్రిడ్ తరపున ఛాంపియన్స్ లీగ్ విజేత సహా హకీమీ ఎన్నో ఘనతలు సాధించాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఐపీఎల్
ఓటీటీ-వెబ్‌సిరీస్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement