T20 World Cup 2024 : ఎట్టకేలకు టీ 20 వరల్డ్‌కప్ జట్టు ప్రకటించిన పాకిస్థాన్- రిటైర్మెంట్ ప్రకటించిన వాళ్లకు ఛాన్స్
T20 World Cup 2024: T20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు బాబర్ ఆజం కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.రిటైర్ అయిన వాళ్లను కూడా జట్టులోకి తీసుకుంది.
Pakistan Squad For T20 World Cup 2024 Announced: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును శుక్రవారం (మే 24) ప్రకటించింది. బాబర్ ఆజాం(Babar Azam) నాయకత్వంలో 15 మందితో కూడిన స్క్వాడ్‌ను అధికారికంగా వెల్లడించింది.
మెగా టోర్నీలో పాల్గొనే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ ఇచ్చిన డెడ్ లైన్ మే1న ముగిసింది. గడువు లోగా ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, ఆఫ్గనిస్తాన్, ఒమన్, నేపాల్, లాంటి దేశాలు తమ ప్రపంచకప్ టీంలను వెల్లడించాయి. అయితే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మాత్రం తమ జట్టును నిర్ణీత సమయంలోగా ప్రకటించలేదు. ఆటగాళ్ళ ఫిట్నెస్ సమస్య వల్ల ఆలస్యం జరిగింది అని సమాచారం ఉన్నప్పటికీ తాజాగా ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ల్లో ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రదర్శన ఆధారంగా పాకిస్తాన్ టీంను ఎంపిక చేయాలని పీసీబీ సెలెక్టర్లు భావించినట్టు సమాచారం. అనుకున్నట్టుగానే సీనియర్ల ప్లేయర్లు ఇమద్ వసీం, మహ్మద్ అమిర్‌కు తుది బృందంలో చోటుదక్కింది.
రిటైర్మెంట్ ప్రకటించి తరువాత వెనక్కి తీసుకున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మహ్మద్ అమీర్, ఆల్-రౌండర్ ఇమాద్ వాసిమ్ ఈ జట్టులో ఉన్నారు. భుజ గాయంతో సుదీర్ఘ కాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ హ్యారీస్ రౌఫ్ టీ20 ప్రపంచకప్‌తో మైదానంలోకి మరోసారి అడుగుపెట్టనున్నాడు. మహ్మద్ అమీర్ 2016 తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ ప్రపంచకప్ జట్టులో భాగమయ్యాడు. 15 మంది ఆటగాళ్లలో, అబ్రార్ అహ్మద్, ఆజం ఖాన్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, సైమ్ అయూబ్, ఉస్మాన్ ఖాన్ తమ తొలి T20 ప్రపంచ కప్‌కు ఎంపికయ్యారు.
Our fans unveil Pakistan's squad for the ICC Men's #T20WorldCup 2024 in the West Indies & USA 🇵🇰🤩
— Pakistan Cricket (@TheRealPCB) May 24, 2024
Let's go, team! 🙌#WeHaveWeWill | #BackTheBoysInGreen pic.twitter.com/7nsJwPtyn0
టీ20 ప్రపంచకప్ కోసం పాక్ జట్టు: బాబర్ ఆజం (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, అజంఖాన్, ఫఖర్ జమాన్, హారిస్ రవూఫ్, ఇఫ్తీకర్ అహ్మద్, ఇమాద్ వాసిమ్, మహ్మద్ అబ్బాస్ అఫ్రిది, మహ్మద్ అమీర్, మహ్మద్ రిజ్వాన్, నసీమ్ షా, సామ్ అయూబ్, షాదాబ్ ఖాన్. , షాహీన్ షా అఫ్రిది, ఉస్మాన్ ఖాన్.
పొట్టి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో ఆతిథ్య అమెరికా(USA)తో కెనడా తలపనుంది. జూన్ 1న ప్రారంభంమయ్యే టీ 20 ప్రపంచకప్ జూన్ 29న ముగుస్తుంది. ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు 4 గ్రూపుల్లో పోటీ పడతాయి. మొదటి, రెండో స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరుకుంటాయి. ఈ టోర్నీలో టీమిండియా (Team India), పాకిస్థాన్(Pakistan) జట్లు గ్రూప్ ఏలో ఉన్నాయి. భారీ అంచనాలమధ్య జరగనున్న ఈ మ్యాచ్ టికెట్లకు బీభత్సమైన డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ విషయానికి వస్తే మెగా టోర్నీలో పాకిస్థాన్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 6న డల్లాస్ వేదికగా అమెరికాతో ఆడనుంది. న్యూయార్క్ వేదికగా జూన్ 9న జరిగే హైఓల్టేజ్ మ్యాచ్‌లో భారత్‌తో పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనుంది. జూన్ 11న కెనడాతో న్యూయార్క్ లోనూ, జూన్ 16న ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్‌తో పాకిస్థాన్ తమ లీగ్ మ్యాచ్‌లు ఆడనుంది.