అన్వేషించండి
Advertisement
World Cup News : బెన్ స్టోక్స్ అరుదైన రికార్డు , తొలి ఇంగ్లండ్ బ్యాటర్‌గా ఖ్యాతి
ODI World Cup News: ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్, బెన్ స్టోక్స్ అరుదైన ఘనతను సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు చేసి వంద వికెట్లు తీసిన తొలి బ్రిటీష్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.
England All Rounder Ben Stokes News: ఇంగ్లండ్(England) స్టార్ ఆల్‌రౌండర్, బ్రిటీష్ జట్టుకు గత ప్రపంచకప్‌ను అందించిన బెన్ స్టోక్స్(Ben Stokes) అరుదైన ఘనతను సాధించాడు. భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్(Nedarland)తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయాన్ని అందించిన స్టోక్స్... అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగులు చేసి వంద వికెట్లు తీసిన తొలి బ్రిటీష్ బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. బెన్ స్టోక్స్.. ఇప్పటివరకూ 112 వన్డేలలో 3,379 పరుగులు చేసి 74 వికెట్లు తీశాడు. ఆలాగే 97 టెస్టులు ఆడిన ఈ స్టార్ ఆల్‌రౌండర్ 6,117 రన్స్ చేసి 197 వికెట్లు సాధించాడు. 43 టీ20లలో 585 పరుగులు చేసి 26 వికెట్లు తీశాడు. 2011 నుంచి ఇంగ్లండ్‌కు ఆడుతున్న స్టోక్స్.. గతేడాది వన్డేలకు గుడ్ బై చెప్పినా వన్డే వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని ఆడుతున్నాడు. అయినా ఇంగ్లండ్ దశ మారలేదు. సెమీస్ కూడా చేరకుండానే బ్రిటీష్ జట్టు వెనుదిరిగింది. ఛాంపియన్స్ ట్రోఫీ ఆశలు మాత్రమే ఇప్పుడు ఇంగ్లండ్‌కు ఉన్నాయి.
అన్ని ఫార్మట్లలో 10,000 పరుగులు, 100వికెట్లు తీసిన క్రికెటర్లు
సచిన్ టెండూల్కర్, భారత్ (18,426 రన్స్, 154 వికెట్లు)
సౌరవ్ గంగూలీ, భారత్ (11, 363 పరుగులు, 100 వికెట్లు)
సనత్ జయసూర్య, శ్రీలంక (13, 430 రన్స్, 323 వికెట్లు)
జాక్వస్ కలిస్, దక్షిణాఫ్రికా (11, 579 పరుగులు, 273 వికెట్లు)
తిలకరత్నె దిల్షాన్, శ్రీలంక (10,290 పరుగులు, 106 వికెట్లు)
క్రిస్ గేల్, వెస్టిండీస్ (10, 480 రన్స్, 167 వికెట్లు)
బెన్ స్టోక్స్, ఇంగ్లండ్(10,081, 297 వికెట్లు)
టెస్టుల్లో మాత్రం జాక్వస్ కలిస్ ఒక్కడే 13,289 రన్స్ చేసి 292 వికెట్లు సాధించాడు. మరే క్రికెటర్‌కు ఇది సాధ్యం కాలేదు.
ఇక భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు ఓదార్పు విజయం దక్కింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న బ్రిటీష్ జట్టు.. పసికూన నెదర్లాండ్స్‌పై ఘన విజయం సాధించి పరువు దక్కించుకుంది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్యాటింగ్‌కు ఇంగ్లండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 339 పరుగులు చేసింది. అనంతరం బ్రిటీష్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ 37.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ 160 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 74 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సులతో 87 పరుగులు చేసి శతకం దిశగా సాగుతున్న మలన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. అనంతరం మళ్లీ ఇంగ్లండ్ వికెట్ల పతనం ప్రారంభమైంది. బ్రిటీష్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి 178 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మొయిన్ అలీ కూడా 15 బంతుల్లో నాలుగు పరుగులు చేసి వెనుదిరగడంతో 192 పరుగుల వద్ద ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోయింది.
ఇక ఇంగ్లండ్ పతనం వేగంగా ముగుస్తుందనుకున్న తరుణంలో గత ప్రపంచకప్ హీరో, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ రాణించాడు. బెన్ స్టోక్స్ 84 బంతుల్లో 6 ఫోర్ లు, 6 భారీ సిక్సర్ లతో 108 పరుగులు చేసాడు. స్టోక్స్ చివర్లో విధ్వంసం సరుసటయించడంతో ఇంగ్లాండ్ స్కోర్ 300 పరుగులు దాటింది. వీరిద్దరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ 179 పరుగులకే ఆలౌట్ అయింది.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
ఆంధ్రప్రదేశ్
మొబైల్స్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement