అన్వేషించండి

David Warner ODI Record: సచిన్‌ రికార్డు బద్దలు , ప్రపంచకప్‌లో వేగంగా 1000 పరుగులు చేసిన వార్నర్‌

David Warner ODI Record: వన్డే ప్రపంచకప్‌లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు.

ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ అరుదైన రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌లో వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. వార్నర్ 19 ఇన్నింగ్స్‌ల్లో  వెయ్యి పరుగులు పూర్తి చేసుకుని అతి తక్కువ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. సచిన్ టెండూల్కర్, ఏబీ డివిలియర్స్  20 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేయగా వార్నర్‌ కేవలం 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించి వారి పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. ఇండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్‌లో స్ట్రెయిట్ డ్రైవ్‌తో బౌండరీతో వార్నర్‌ ఈ ఫీట్‌ సాధించాడు. ప్రపంచకప్‌లో వెయ్యికిపైగా పరుగులు చేసిన నాల్గవ ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 

వార్నర్ ప్రపంచకప్‌లలో ఇప్పటివరకూ మూడు అర్ధసెంచరీలు, నాలుగు సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ జాబితాలో అగ్రస్థానానికి చేరుకునే పోటీలో ఉన్నాడు. రోహిత్ 17 ఇన్నింగ్స్‌లలో 978 పరుగులు చేశాడు. వార్నర్‌ రికార్డు బద్దలు కొట్టేందుకు రోహిత్‌ కేవలం 22 పరుగుల దూరంలో ఉన్నాడు. 21 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగులను దాటిన వివ్‌ రిచర్డ్స్‌, సౌరవ్‌ గంగూలీ, 22 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మార్క్‌ దాటి మార్క్‌ వా, హర్షలే గిబ్స్‌ వారి తర్వాత స్థానాల్లో ఉన్నారు. 

 ఇటీవలే టెస్టులపై డేవిడ్ వార్నర్ కీలక ప్రకనట చేశాడు. 2024లో జనవరిలో పాకిస్థాన్‌తో జరగనున్న టెస్టు సిరీస్ చివరిదని వెల్లడించాడు. తన సొంత మైదానమైన సిడ్నీలో చివరి మ్యాచ్ ఆడనున్నట్లు ప్రకటించాడు.  2024 జనవరిలో ఆసీస్ జట్టు, పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్ ముగిశాక వెస్టిండీస్‌తో తలపడనుంది. ఆ మ్యాచులో తాను ఆడబోనని ఈ లెఫ్ట్ హ్యాండర్ స్పష్టం చేశాడు. 

 వార్నర్ 2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 103 టెస్టు మ్యాచులాడి.. 8,158 పరుగులు చేశాడు. అందులో 25 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 150 వన్డేల్లో ఆసీస్‌ తరఫున బరిలోకి దిగిన వార్నర్.. 20  సెంచరీలు, 31 అర్ధ సెంచరీలో 6397 పరుగులు చేశాడు. 99 టీ-20 మ్యాచుల్లో ఒక సెంచరీ 24 హాఫ్ సెంచరీలతో 2894 రన్స్ స్కోరు చేశాడు. 


వ‌న్డే ప్రపంచ‌క‌ప్ చ‌రిత్రలో అత్యంత వేగంగా 1000 ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) -19 ఇన్నింగ్స్‌ల్లో
స‌చిన్ టెండూల్కర్ (భార‌త్‌) – 20 ఇన్నింగ్స్‌ల్లో
ఏబి డివిలియ‌ర్స్ (ద‌క్షిణాఫ్రికా) – 20 ఇన్నింగ్స్‌ల్లో
వివ్ రిచ‌ర్డ్స్ (వెస్టిండీస్) – 21 ఇన్నింగ్స్‌ల్లో
సౌర‌వ్ గంగూలీ (భార‌త్‌) – 21 ఇన్నింగ్స్‌ల్లో
మార్క్ వా (ఆస్ట్రేలియా)- 22 ఇన్నింగ్స్‌ల్లో
హెర్షెల్ గిబ్స్ (ద‌క్షిణాఫ్రికా) – 22 ఇన్నింగ్స్‌ల్లో

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget