అన్వేషించండి

T20 world cup: టీ 20 ప్రపంచకప్‌ వేళ, టీమిండియాకు కొత్త సమస్యలు

Team India: టీ 20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ ఐపీఎల్‌లో కొందరి ఆటగాళ్ల ప్రదర్శన టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ఐపీఎల్‌ 2024 సీజన్‌లో కొందరు భారత క్రికెటర్లు విఫలమవుతుండడం షాక్‌కు గురి చేస్తోంది.

New problems to team India ahead of T20 world cup: టీ 20 ప్రపంచకప్‌ సమీపిస్తున్న వేళ ఐపీఎల్‌లో కొందరి ఆటగాళ్ల ప్రదర్శన టీమిండియాను ఆందోళన పరుస్తోంది. ఐపీఎల్‌ 2024(IPL 2024) సీజన్‌లో కొందరు భారత క్రికెటర్లు విఫలమవుతుండడం అభిమానులను కూడా షాక్‌కు గురి చేస్తోంది. ఐపీఎల్‌లో ఆటగాళ్ల ఆటతీరును సెలక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల చివరన పొట్టి  ప్రపంచకప్‌నకు జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ప్రకటించనుంది. సెలక్షన్స్‌కు సమయం సమీపిస్తున్న కొద్దీ భారత ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగిపోతోంది. అనుభవజ్ఞులైన ఆటగాళ్లు కూడా ఒత్తిడి కారణంగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. ఐపీఎల్‌ 2024లో బ్యాటింగ్, బౌలింగ్ చేయగల ఆల్ రౌండర్లు ఇంతవరకూ అంచనాలను అందుకోలేకపోయారు. ఈ పరిణామాలు బీసీసీఐకు తలనొప్పుులు తెస్తున్నాయి. ఐపీఎల్‌ అంచనాలు అందుకోలేక పోయిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.
 
రాహుల్‌ ఆ మెరుపులేవీ..?
గాయం నుంచి కోలుకున్న KL రాహుల్(KL RAhul).,.. ఐపీఎల్‌లో బరిలోకి దిగాడు. కానీ ఇప్పటి వరకూ ఒక్క భారీ ఇన్నింగ్స్‌ కూడా ఆడలేకపోయాడు. IPL 2024లో మొదటి మ్యాచ్‌లో 58 పరుగుల ఇన్నింగ్స్‌తో రాహుల్‌ టచ్‌లోకి వచ్చాడని అందరూ భావించారు. కానీ ఆ మ్యాచ్‌లో రాహుల్‌ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చెలరేగాయి. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్‌, బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ల్లో రాహుల్‌ మంచి ఆరంభాన్ని అందుకున్నా.. భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. రాహుల్ పంజాబ్‌పై 15 పరుగులు, బెంగళూరుపై 20 పరుగులు చేశాడు. రాహుల్ చాలా వేగంగా ఆడగలడు. అవలోకగా సిక్సులు కొట్టగలడు. కానీ ఈ సీజన్‌లో రాహుల్‌ 3 మ్యాచ్‌ల్లో 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ప్రపంచ కప్‌నకు ముందు రాహుల్‌ వరుసగా విఫలమవుతండడం... టీమిండియాను ఆందోళన పరుస్తోంది. 
 
పనిచేయని జడేజా స్పిన్‌ మంత్రం 
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా(Ravindra Jadeja)  ఒకడు. ఐపీఎల్ కెరీర్‌లో 2,776 పరుగులు చేయడంతో పాటు 153 వికెట్లు కూడా పడగొట్టాడు. అయితే ప్రస్తుత సీజన్‌లో జడ్డూ తన స్పిన్‌ మాయను.. బ్యాట్‌తో విధ్వంసాలను చూపలేకపోతున్నాడు. గత 2 మ్యాచుల్లో చెన్నైకి లోయర్ ఆర్డర్‌లో భారీ స్కోర్లు చేసే బ్యాటర్‌ అవసరమయ్యాడు. ఆ అవకాశాన్ని జడేజా వృథా చేశాడు. ప్రస్తుత సీజన్‌లో జడేజా ఇప్పటి వరకు 84 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు.  బౌలింగ్‌లో జడేజా సమస్యలు సెలెక్టర్ల ఇబ్బందులను మరింత పెంచుతోంది.
 
ఆశలు ఆవిరి చేస్తోన్న అర్ష్‌దీప్
అర్ష్‌దీప్ సింగ్ చాలా కాలంగా టీ20లో భారత జట్టులో కీలక బౌలర్‌గా ఉన్నాడు. కానీ IPL 2024లో అతను 9 కంటే ఎక్కువ ఎకానమీ రేటుతో పరుగులు ఇస్తున్నాడు. ఇది కాకుండా గత నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీశాడు. ఇలాగే బౌలింగ్‌ చేస్తే టీ20 ప్రపంచకప్ జట్టులో అర్ష్‌దీప్‌కు చోటు దక్కకపోవచ్చు.

టాప్ హెడ్ లైన్స్

Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
MI Trade Rumours: హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
హార్దిక్ ,CSK డీల్ ప్రచారం నిజమేనా.. MI అఫీషియల్స్ షాకింగ్ క్లారిటీ, ట్రేడింగ్ డ్రామాలో ఊరించే ట్విస్ట్!
IND vs SL Test Series Updates: శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!
శ్రీలంక టూర్ లో టీమ్ ఇండియా వార్మప్ మ్యాచ్ షెడ్యూల్ మార్పు.. 4 రోజుల మ్యాచ్ 3 రోజులకు కుదింపు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget