మాస్ రూల్స్‌తో SA20- ఇవి గాని రెగ్యులర్ టీ 20ల్లోకి వస్తే వేరే లెవలే!
ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్‌లో మనం చూశాం కొన్ని వెరైటీ రూల్స్. పవర్ సర్జ్ అని, బూస్ట్ పాయింట్ అని, ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాడు అని... ఇలా. క్రికెట్‌కు ఓ సరికొత్త కోణాన్ని ఇచ్చిన రూల్స్ ఇవి.
ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న టీ20 లీగ్స్ పుణ్యమా అంటూ వందల ఏళ్ల చరిత్ర ఉన్న క్రికెట్‌లో ఎవరికి నచ్చిన రూల్స్ వాళ్లు పెట్టుకుంటున్నారు. ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బ్యాష్ లీగ్‌లో మనం చూశాం కొన్ని వెరైటీ రూల్స్. పవర్ సర్జ్ అని, బూస్ట్ పాయింట్ అని, ఎక్స్-ఫ్యాక్టర్ ఆటగాడు అని... ఇలా. క్రికెట్‌కు ఓ సరికొత్త కోణాన్ని ఇచ్చిన రూల్స్ ఇవి. అవి ఎంతమేర సక్సెస్ అయ్యాయనేది పక్కన పెడితే కచ్చితంగా ఓ మంచి అటెంప్ట్. ఫ్యాన్స్‌కు కూడా సరికొత్త అనుభూతిని పంచింది.
ఇప్పుడు అలానే మరో టీ20 లీగ్ వచ్చేసింది తనదైన రూల్స్‌తో. అదే SA20 లీగ్. ఇవాళ్టి(మంగళవారం) నుంచి ఈ లీగ్ స్టార్ట్ అవబోతోంది. మొత్తం ఆరు జట్లు ఉంటాయి. 33 లీగ్ మ్యాచెస్. అందులో ఉన్న ఆరు జట్ల యజమానులూ... ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఉన్నవారే. సో ఆ రకంగా చూసుకుంటే ఈ లీగ్ అప్డేట్స్ మన ఇండియన్ ఫ్యాన్స్ కు కూడా పుష్కలంగా దక్కుతాయి.
సరే మ్యాటర్‌కు వద్దాం. ముందు చెప్పుకున్నాం కదా. కొన్ని ఇంట్రెస్టింగ్ రూల్స్ అని. తమ లీగ్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా కొన్ని రూల్స్ అనౌన్స్ చేసింది. అవేంటో చెప్పుకుందాం.
1. మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేట్ నమోదైతే ఈ లీగ్‌లో కెప్టెన్లకు సస్పెన్షన్ ఉండదు. కేవలం ఫీల్డింగ్ నిబంధనల ద్వారా ఫీల్డింగ్ జట్టును పీనలైజ్ చేస్తారు. అంటే ఓ అదనపు ఫీల్డర్‌ను 30 గజాల రింగ్ లోకి తీసుకురావడం ద్వారా.
A team of 13 is picked and the final XI is based on the toss outcome. It takes something away, (winning with the resources you have is one of the most challenging things). I'd love to see what it adds because, in its favour, the best teams for the conditions will play each other
— Harsha Bhogle (@bhogleharsha) January 9, 2023
2. ఈ లీగ్ లో విన్నింగ్ జట్టుకు బోనస్ పాయింట్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే దానికి ఓ కొలమానం కూడా అనౌన్స్ చేశారు. గెలిచిన జట్టు రన్ రేట్.... ఓడిన జట్టు కన్నా 1.25 రెట్లు ఎక్కువ ఉంటే బోనస్ పాయింట్ కూడా దక్కించుకుంటారు.
అయితే ఇప్పుడు తర్వాత చెప్పుకోబోయే తర్వాతి 3 రూల్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి.
3. ఇప్పుడు టాస్ టైంకే కెప్టెన్లు ఇద్దరూ టీమ్ షీట్స్ మార్చుకుంటారు కదా. అందులో 11 ప్లేయర్స్ ఎవరో ముందే చెప్పేయాలి. కానీ ఈ లీగ్ లో ఈ రూల్ ను కాస్త మార్చారు. 13 ఆటగాళ్లతో ఉన్న జాబితాలను మార్చుకోవాలి అన్నమాట. టాస్ ఫలితం ఆధారంగా ఆ 13 మంది ఆటగాళ్లలో నుంచి తుదిజట్టును ఎంచుకోవచ్చు అన్నమాట. అంటే మొదట బ్యాటింగ్ చేస్తున్నారా లేదా బౌలింగా అన్న విషయం ఆధారంగా ఆఖరి నిమిషంలో టీమ్స్ తమ స్ట్రాటజీ మార్చుకుని ఆటగాళ్లను ఎన్నుకోవచ్చు అన్నమాట.
ఈ రూల్ చాలా మంచిదే అని చెప్పుకోవచ్చు. బహుశా మరికొన్నాళ్లల్లో మిగతా టీ20 లీగ్స్ లో, క్రమంగా అంతర్జాతీయ మ్యాచెస్ లోనూ ఈ రూల్ ను తీసుకొచ్చే అవకాశాలు లేకపోలేదు
4. ఇంకో రూల్ ఏంటంటే... ఫ్రీ హిట్ బాల్ కు సంబంధించినది. నో బాల్ వేస్తే ఫ్రీ హిట్ ఇస్తారు తెలుసుగా. ఫ్రీ హిట్ లో ఓ బ్యాటర్ కేవలం నాలుగు పద్ధతుల్లోనే ఔట్ అవగలడు. రనౌట్, ఫీల్డ్ ను అడ్డుకున్నప్పుడు, బంతిని హ్యాండిల్ చేసినప్పుడు, బంతిని రెండుసార్లు కొట్టినప్పుడు మాత్రమే... ఫ్రీ హిట్ లో బ్యాటర్ ఔట్ అవగలడు. సో ఇప్పుడు వీళ్లు పెట్టిన రూల్ ఏంటంటే... ఒకవేళ ఫ్రీ హిట్ లో బ్యాటర్ బౌల్డ్ అయితే ఔట్ ఇవ్వరు. అది ఓకే. కానీ ఒకవేళ బాల్ స్టంప్స్ తాకిన తర్వాత ఎటైనా దూరంగా వెళ్తే... బ్యాటర్లు బైస్ తిరగడానికి వీల్లేదు. వాటికి రన్స్ ఇవ్వరు అన్నమాట.
Some very interesting rules at the #SAT20. No runs of a ricochet from the stumps if you hit them intentionally, none from a no-ball that hits the stumps......both are outcomes of incidents that changed the course of key World Cup matches.
— Harsha Bhogle (@bhogleharsha) January 9, 2023
ఈ రూల్ గురించి కాస్త చెప్పుకుందాం. ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఇండియా మ్యాచ్ ఆఖరి ఓవర్ గుర్తుందిగా. అందులో విరాట్ కోహ్లీ ఇలానే ఫ్రీ హిట్ బాల్ బౌల్డ్ అయ్యాడు. బాల్ దూరంగా వెళ్లటంతో మూడు బైస్ తిరిగేశాడు. అప్పుడు దీనిపై చాలా పెద్ద చర్చే జరిగింది. ఇప్పుడు క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన ఈ రూల్ మీద కూడా ఓ సానుకూల ధోరణిలో విస్తృత చర్చ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి.
5. ఇక ఆఖరి ఇంట్రెస్టింగ్ రూల్ చేంజ్ గురించి చెప్పుకుందాం. దీనికి ఇంకో వరల్డ్ కప్ మ్యాచ్ కు సంబంధం ఉంది. అది 2019 వరల్డ్ కప్ ఫైనల్. గుర్తుందిగా... రనౌట్ అటెంప్ట్ కోసం విసిరిన బాల్ బెన్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి బౌండరీకి వెళ్తే... దానికి 4 రన్స్ ఇచ్చేశారు. అప్పుడు క్రికెట్ ప్రపంచమంతా... దాదాపుగా ఇంగ్లండ్ కు వ్యతిరేకమైపోయింది. కివీస్ పట్ల సింపతీ పెరిగిపోయింది.
సాధారణంగా క్రికెట్ లో పాటించే పద్ధతి ఏంటంటే... రనౌట్ ప్రయత్నంలో బాల్ విసిరినప్పుడు బ్యాట్ కు కానీ బ్యాటర్ కు కానీ తగిలితే... బ్యాటర్లు ఆ రన్ తీయకుండా ఆగిపోతారు. కానీ ఒకవేళ బ్యాట్ కు తగిలి బౌండరీ దాకా బాల్ వెళ్లిపోతే రూల్స్ ప్రకారం బౌండరీ ఇచ్చి తీరాల్సిందే. కానీ ఇప్పుడు సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఏం చేశారంటే.... రనౌట్ ప్రయత్నం కోసం బాల్ విసిరితే బ్యాట్ కు తగిలాక అసలు ఎలాంటి రన్స్ ఇవ్వరు. బాల్ బౌండరీ దాకా వెళ్లిపోయినా సరే... ఒక్క పరుగూ ఇవ్వరు.
We have confirmed exciting additions to our playing format for the inaugural season starting TOMORROW. The additions have been included to improve the quality of the product while preserving the sanctity of the game. Get all the details here: https://t.co/IJ7Dzt9eU9 #Betway #SA20 pic.twitter.com/IXKaVwfRx2
— SA20_League (@SA20_League) January 9, 2023
సో ఇవీ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో తీసుకొచ్చిన రూల్స్. ముఖ్యంగా 3,4,5 రూల్స్ చాలా ముఖ్యమైనవి. ప్రపంచ క్రికెట్ దృక్పథాన్నే మార్చేసే సత్తా ఉన్న రూల్స్. వీటి గురించి ఆల్రెడీ క్రికెట్ ఫ్యాన్స్ కానీ, హర్షా భోగ్లే లాంటి విశ్లేషకులు కానీ సానుకూలంగా స్పందిస్తున్నారు. కనీసం 2-3 ఏళ్లకైనా ఈ రూల్స్ పై విస్తృతంగా అధ్యయనం చేసి ప్రపంచ క్రికెట్ లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వినిపిస్తున్నారు.