అన్వేషించండి
Advertisement
MS Dhoni : మిస్టర్ కూల్ ధోనీకి సెల్యూట్ - ఆ సమాధానానికే అభిమానులంతా ఫిదా
MS Dhoni : క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత ఆర్మీలోనే తాను ఎక్కువ సమయం గడుపుతానంటూ ధోనీ చెప్పిన ఒక మాటతో అభిమానులంతా తలైవాకు మరోసారి సెల్యూట్ చేస్తున్నారు.
Mahendra Singh Dhoni: మహేంద్రసింగ్ ధోనీ(Mahendra Singh Dhoni) కూల్ కెప్టెన్.. టీమిండియా(Team India)కు అత్యధిక ఐసీసీ ట్రోఫీ(ICC Trophies)లు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందాడు. అంతేనా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL )లో చెన్నైసూపర్ కింగ్స్‌కు 5 టైటిళ్లు అందించి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీతో మ్యాజిక్ చేసి గెలవదు అనుకున్న ఎన్నో మ్యాచ్‌లను మలుపు తిప్పి గెలిచేలా చేయడంలో ధోనీ ప్రావీణ్యం అందరికీ తెలిసిందే. 40 ఏళ్ల వయసులోనూ గతేడాది చెన్నై సూపర్‌కింగ్స్‌ను ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలబెట్టి తాను ఎందుకు అంత విజయవంతమైన కెప్టెన్‌నో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చాటి చెప్పాడు. అంతేనా ధోనీకి సైన్యమన్నా.. అందులో పని చేసి దేశానికి సేవ చేయడం అన్నా చాలా ఇష్టమని అందరికీ తెలిసిందే. తాజాగా ధోనీ చెప్పిన సమాధానం అతడిలో దేశభక్తిని చాటింది. మరోసారి అభిమానులంతా తలైవాకు సెల్యూట్ చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత మీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటి అని ఓ ప్రశ్న ధోనీకి ఎదురైంది. మాములుగా అయితే మాజీ క్రికెటర్లు వ్యాఖ్యాతలుగా మారుతాం క్రికెట్ అకాడమీలు పెడతామని చెప్తారు. కానీ అక్కడున్నది ధోనీ కదా అందుకే మరోలా స్పందించాడు. ఇప్పటివరకైతే తాను దాని గురించి ఆలోచించలేదని... కానీ క్రికెట్ నుంచి పూర్తిగా వైదొలిగిన తర్వాత ఆర్మీలో ఎక్కువ సమయం గడుపుతానంటూ ధోనీ జవాబు ఇచ్చాడు. కొన్నేళ్లుగా తాను భారత సైన్యంతో ఎక్కువ సమయం గడపలేదని.. దానిని పూర్తి చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ధోనీ అన్నాడు. ఎంఎస్ ధోనీ సమాధానం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఇంకా ధోనీ మాట్లాడుతూ తాను ఇప్పటికీ క్రికెట్ ఆడుతున్నాని.. క్రికెట్ తర్వాత ఏం చేస్తాననేది ఆలోచిస్తుంటే తనకు ఆసక్తికరంగానే ఉందన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు మూడేళ్ల కిందట ధోనీ వీడ్కోలు పలికాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం 42 ఏళ్ల వయసు కలిగిన ధోనీకి వచ్చే ఐపీఎల్ సీజనే చివరిదని అంతా భావిస్తున్నారు.
సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్
ఎంఎస్ ధోనీకి 2011లో భారత సైన్యంలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ ర్యాంక్‌ను అందించారు. 2015లో ట్రైనింగ్ క్యాంప్‌లోనూ పాల్గొన్నాడు. 2019లో జమ్మూ కశ్మీర్‌లో ధోనీ విధులు కూడా నిర్వర్తించాడు. చిన్నప్పటి నుంచి తనకు సైనికుడు కావాలని ఉండేదని పలు సందర్భాల్లో ధోనీ వెల్లడించాడు. ఇటీవలే భారత జట్టుకు అత్యధిక ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం కల్పించింది. ధోనీ జెర్సీ నంబర్ 7 రిటైర్ అవుతున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అంటే ఇక మీదట భారత క్రికెటర్ ఎవరూ ఏడో నెంబర్ జెర్సీతో బరిలోకి దిగడం కుదరదు. సచిన్ టెండుల్కర్ తర్వాత ఈ గౌరవం ధోనీకి మాత్రమే దక్కింది. సచిన్ రిటైర్మెంట్ తరువాత జెర్సీ నంబర్ 10 రిటైర్ అవుతున్నట్లు గతంలోనే బీసీసీఐ ప్రకటించింది. ఇక ఇప్పుడు ‘జెర్సీ 7’కు ఈ గౌరవం దక్కింది. భారత క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ధోనీకి ఈ అరుదైన గౌరవం ఇచ్చింది. అంటే ఇక పై భారత జట్టులోకి వచ్చే కొత్త కుర్రాళ్లెవరూ నంబర్ 7, నంబర్ 10 జెర్సీలను ఎంపిక చేసుకోలేరు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం
నిజామాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion