Jasprit Bumrah: టీ20 ప్రపంచకప్‌కు బుమ్రా స్థానంలో షమీ - ఆస్ట్రేలియా పంపించిన బీసీసీఐ!
టీ20 ప్రపంచకప్‌లో జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీ ఆడనున్నాడు.
ఆస్ట్రేలియాలో జరగనున్న 2022 టీ20 ప్రపంచ కప్‌కు జస్‌ప్రీత్ బుమ్రా స్థానంలో మహ్మద్ షమీని ఎంపిక చేసినట్లు బీసీసీఐ మీడియా ప్రకటన ద్వారా శుక్రవారం తెలిపింది. ఈ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో భారత్ వార్మప్ మ్యాచ్‌లకు ముందు జట్టులో చేరతాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లను బ్యాకప్‌లుగా సెలక్ట్ చేశారు. వీరు త్వరలో ఆస్ట్రేలియాకు వెళ్లనున్నారు.
2014 మార్చిలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో తన అంతర్జాతీయ టీ20 అరంగేట్రం చేసిన షమీ, 17 మ్యాచ్‌లలో 31కి పైగా సగటుతో 18 వికెట్లు తీశాడు. 2021లో స్కాట్లాండ్‌పై 15 పరుగులకు 3 వికెట్లు తీసి తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. అలాగే ఐపీఎల్ 29కి పైగా యావరేజ్‌తో అతను 99 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2015లో ఆస్ట్రేలియాలో ఆడిన 50 ఓవర్ల ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో భారతీయ బౌలర్ (17.29 సగటుతో 17 వికెట్లు).
షమీ చివరిసారిగా గత ఏడాది టీ20 వరల్డ్‌కప్‌లో నమీబియాతో పొట్టి ఫార్మాట్‌లో భారత్‌కు ఆడాడు. అతను ఇటీవల కోవిడ్ -19 నుండి కోలుకున్నాడు, దీంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో స్వదేశీ సిరీస్‌లను మిస్సయ్యాడు. వెన్ను గాయంతో ఆస్ట్రేలియాలో జరిగిన T20 WC నుండి బుమ్రా తొలగించబడ్డాడు. జూలైలో ఇంగ్లండ్ టూర్ ముగిసే సమయానికి వెన్నునొప్పితో బాధపడుతూ రెండు నెలల పాటు దూరమైన తర్వాత ఈ ఫాస్ట్ బౌలర్ ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌కు ముందు తిరిగి వచ్చాడు.
అయితే ఆస్ట్రేలియాతో జరిగిన రెండు T20Iలు ఆడిన తర్వాత నిరంతర వెన్ను సమస్యల కారణంగా బుమ్రా చివరి T20I, దక్షిణాఫ్రికాతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో పాల్గొనలేకపోయాడు. అక్టోబర్ 22న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత్ 2022 ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్-కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్. అశ్విన్, యుజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ.
View this post on Instagram