అన్వేషించండి

Manoj Tiwary: ధోని వల్లే నా కెరీర్‌ నాశనం. మనోజ్‌ తివారీ సంచలన వ్యాఖ్యలు

Manoj Tiwari : రిటైర్‌మెంట్‌ తర్వాత మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు.

Manoj Tiwary Comments On MS Dhoni: ప‌శ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మ‌నోజ్ తివారీ(Manoj Tiwary ) ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రక‌టించాడు. కోల్‌క‌తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బిహార్‌తో జరిగిన మ్యాచ్‌లో తన ఆఖరి మ్యాచ్‌ ఆడేశాడు. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో భాగంగా బిహార్‌తో మ్యాచ్‌ అనంతరం తన 19 ఏళ్ల కెరీర్‌కు తివారీ ముగింపు పలికాడు. ఈ క్రమంలో తన కెరీర్‌లో ఆఖరి మ్యాచ్‌ ఆడిన తివారీ బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌  ఘనంగా సన్మినించింది. అతడిని గోల్డెన్‌ బ్యాట్‌తో బెంగాల్‌ క్రికెట్‌ ఆసోషియేషన్‌ చైర్మెన్‌ స్నేహసిస్ గంగూలీ సత్కారించారు. ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన ఈడెన్‌ గార్డెన్స్‌ల రిటైర్మెంట్‌ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. కానీ నా కెరీర్‌లో బెంగాల్‌కు రంజీ ట్రోఫీని అందించికపోవడం లోటుగా మిగిలిపోయిందని చెప్పుకొచ్చాడు. రిటైర్‌మెంట్‌ తర్వాత మనోజ్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వల్లనే తన కెరీర్ నాశనమైందన్నాడు. 2011లో భారత్ తరఫున సెంచరీ చేసిన తర్వాత కూడా తనను తుది జట్టు నుంచి తప్పించారని గుర్తు చేసుకున్నాడు. 

అతడి వల్లే నా కెరీర్‌ నాశనం
తనకు వరుసగా అవకాశాలు ఇచ్చి ఉంటే కోహ్లీ, రోహిత్‌లా స్టార్ ప్లేయర్ అయ్యేవాడినని అభిప్రాయపడ్డాడు. సెంచరీ తర్వాత తనను తుది జట్టు నుంచి ఎందుకు తప్పించారనే విషయంపై ధోనీని నిలదీయాలనుకుంటున్నానని తెలిపాడు. కోహ్లి, రోహిత్‌శర్మ పరుగులు చేయకపోయినా జట్టుకు ఎంపిక చేసి.. తనను ఎందుకు తప్పించారని ధోనీని అడుగుతానని మనోజ్‌ తివారి అన్నాడు. ధోనీని ఎప్పుడు కలిసినా.. వరుసగా 14 మ్యాచ్‌లు తనను ఎందుకు దూరంగా ఉంచారని అడుగుతానని తివారి తెలిపాడు. కోహ్లి, రోహిత్‌, సురేశ్‌ రైనా పరుగులు చేయకపోయినా 2012 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేసి.. తనను పక్కనబెట్టడాన్ని ప్రశ్నిస్తానని తెలిపాడు. 2008లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన తివారి.. ఏడేళ్లలో 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. 2011 డిసెంబరులో చెన్నైలో వెస్టిండీస్‌పై అజేయ సెంచరీతో కెరీర్‌లో తొలి శతకం సాధించాడు. అయితే తర్వాతి అవకాశం కోసం తివారి ఏడు నెలలు ఎదురు చూడాల్సొచ్చింది.  టెస్టు జట్టులో చోటుకు చాలా దగ్గరగా వచ్చానని. కానీ ఆ సమయంలో తన బదులు యువరాజ్‌ సింగ్‌ను ఆ సమయంలో తీసుకున్నారని గుర్తు చేసుకున్నాడు. పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసాన్ని నాశనం చేస్తే అది ఆటగాడిని చంపేస్తుందని తివారి ఆవేదన వ్యక్తం చేశాడు. 

కెరీర్‌ ఇలా....
2006లో రంజీల్లో అరంగేట్రం చేసిన తివారీ 2008లో టీమిండియాలో అరంగేట్రం చేశాడు. అయితే.. అత‌డికి కేవ‌లం 12 వ‌న్డేలు, 3 టీ20లు ఆడే అవ‌కాశం వ‌చ్చింది. భార‌త జ‌ట్టు త‌ర‌ఫున 2015లో జింబాబ్వేపై చివ‌రి మ్యాచ్ ఆడేసిన తివారీ రంజీల‌పై దృష్టి పెట్టాడు. 141 ఫ‌స్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన మనోజ్‌ తివారీ... 30 సెంచ‌రీలు, 45 హాఫ్ సెంచ‌రీలు బాదాడు. టీమిండియాలో చోటు కోల్పోయిన తివారీ ఐపీఎల్‌లో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్, రైసింగ్ పూణే సూప‌ర్ జెయింట్స్‌ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వ‌హించాడు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Mahakumbha Mela 2025 : మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
మహా కుంభమేళాకు ఉగ్రవాద ముప్పు..! ఆస్పత్రుల్లో స్పెషల్ వార్డులు.. ఎన్ఐఏ అలెర్ట్
Embed widget