Jasprit Bumrah & Rishabh Pant: ఇంగ్లాండ్ సిరీస్ పై బుమ్రా, పంత్ ఎమోషనల్ పోస్ట్.. నెక్స్ట్ ఏంటి?
అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ అంచనాలకు మించి సూపర్ హిట్ అయ్యింది.కళ తప్పిన టెస్ట్ క్రికెట్ కు మళ్లీ ప్రాణం పోసింది. జట్ల పోరాటపటిమ,గాయపడినా బరిలోకి దిగిన ఆటగాళ్ల స్ఫూర్తి మైమరింపించింది.

Jasprit Bumrah Vs Rishabh Pant News: అంతగా అనుభవం లేని యువ జట్టుతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమిండియా అద్భుతమైన ఫలితాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఐదు టెస్టుల సిరీస్ ను 2-2తో సమం చేసింది. తాజాగా ఈ విజయంపై భారత స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఆనందం వ్యక్తం చేశాడు. సుదీర్ఘమైన ఈ టెస్టు సిరీస్ ఎన్నో మధురానుభుతులను నింపిందని పేర్కొన్నాడు. చాలా కఠినమైన, పోటీతత్వంతో కూడిన ఈ సిరీస్ ద్వారా ఎంతో నేర్చుకున్నమాని సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశాడు. అనంతరం నెక్ట్స్ ఏంటి..? అని సరదాగా అభిమానులను ప్రశ్నించాడు. చాలా మంది యువకులతో కూడిన టీమిండియాలో బుమ్రాతోపాటు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాకు మాత్రమే అంతర్జాతీయ టెస్టుల్లో సుదీర్ఘ అనుభవం ఉండగా, మహ్మద్ సిరాజ్ కు కాస్త ఎక్స్ పిరీయిన్స్ ఉంది. అయినప్పటికీ, కఠినమైన ఇంగ్లాండ్ గడ్డపై ఆ జట్టును సవాలు చేసి, దాదాపు ప్రతి టెస్టులో ఇండియానే డామినేట్ చేసింది. ఆఖరుకు సిరీస్ ను కూడా ఎవరూ ఊహించని విధంగా 2-2తో సమం చేసింది.
Instagram post of Jasprit Bumrah after The Test series 🔥 pic.twitter.com/zgr46HBCzt
— Honest Cricket Fan's (@maddiess18) August 5, 2025
వర్క్ లోడ్ మేనేజ్మెంట్ తో..
ఈ సిరీస్ లో ముందే చెప్పినట్లుగా బుమ్రా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. అయినప్పటికీ నాలుగో లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు. ఓవరాల్ గా 14 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అందులో రెండు ఫైఫర్ లు ఉండటం విశేషం. తను ఆడని రెండు టెస్టుల్లోనే టీమిండియా గెలుపొందడం విశేషం. మరోవైపు ఈ టూర్ గురించి భారత స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ కూడా ఎమోషనల్ గా పోస్టు పెట్టాడు. ఈ టూర్ లో తాను చాలా పోందానని, మరిచి పోలేదని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కఠినమైన పరిస్థితులకు నిలబడి, జట్టు ప్రదర్శించిన పోరాట పటిమను చూసి తను గర్వ పడుతున్నానని పేర్కొన్నాడు.
A tour that asked a lot and gave even more in return. Proud of how this team stood up, adapted and kept fighting. Representing the country means everything to us, it takes everything out of you but we take pride in that. Big thanks to our incredible support staff and the fans who… pic.twitter.com/dcLIrRzTXu
— Rishabh Pant (@RishabhPant17) August 4, 2025
దేశానికి ఆడటం..
దేశానికి ప్రాతినిథ్యం వహించడం ఎంతో గర్వపడే విషయమని పంత్ చెప్పుకొచ్చాడు. జట్టు కోసం ఆటగాళ్లంతా ప్రాణం పెట్టి ఆడుతారని గుర్తు చేశాడు. ఈ టూర్ లో తమకు అండగా నిలిచిన సపోర్టు స్టాఫ్ కు , అభిమానులకు థాంక్స్ చెప్పాడు. తమ జట్టు చాలా ఆకలితో ఉందని, ఐకమత్యంతో మరింత క్రికెట్ ను ముందుకు తీసుకుపోవడానికి సిద్దంగా ఉన్నామని పేర్కొంటూ, సిరీస్ కు సంబంధించి కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఇక నాలుగో టెస్టు వరకు ఆడిన పంత్.. ఆ టెస్టులో పాదం గాయంతో దూరమయ్యాడు. అయినప్పటికీ ఆ టెస్టులో కీలక దశలో బ్యాటింగ్ చేసి, స్ఫూర్తి నింపాడు.




















