Shubman Gill as Test Captain | కెప్టెన్ గా మైలురాయిని సాధించిన శుభ్మన్ గిల్
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ... ఆ ప్లేస్ ను భర్తీ చేయడానికి ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ జట్టులో ఉన్న సీనియర్స్ ను కూడా పక్కన పెట్టి చిన్న వాడైనా శుబ్మన్ గిల్ ను కెప్టెన్ చేసారు. అసలు గిల్ టీం ను లీడ్ చేయగలుగుతాడా... లేదా అన్న డౌట్ అందరికి ఉంది. అందులో ఇండియా ఆడే నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్ తో ఉంది. సీనియర్స్ లేకుండా యంగ్ టీం తో మ్యాచ్ అనగానే ఫ్యాన్స్ కు డౌట్స్ ఇంకా ఎక్కువ అయిపోయ్యాయి.
అందరు అనుకున్నట్టుగానే ఇండియా ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఒక కెప్టెన్ గా ఆ మ్యాచ్ లో జరిగిన తప్పులని తెలుసుకున్న గిల్.. ఏ మాత్రం బెదరకుండా సెకండ్ టెస్ట్ మ్యాచ్ లో రికార్డుల మోత మోగిస్తూ మ్యాచ్ ను గెలిపించాడు. ఈ సిరీస్ లో 2 మ్యాచులు ఓడిపోయి ... ఒక మ్యాచ్ ని డ్రా గా ముగించి... మరో 2 మ్యాచులు గెలిచారు. ఎన్నో వ్యూహాలు వేస్తూ టీం లో మార్పులు చేస్తూ... ఈ టెస్ట్ సిరీస్ ను సమం చేయడంలో గిల్ కీలక పాత్ర పోషించాడు.
అయితే హెడ్ కోచ్ గా గంభీర్ భాద్యతలు తీసుకున్న తర్వాత గంభీర్-గిల్ జోడీపై కూడా ఎన్నో ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. వీరి వల్ల కాదు అని కూడా అందరు భావించారు. కానీ కరెక్ట్ టైం లో కోచ్ - కెప్టెన్ కలిసి తీసుకున్న నిర్ణయాలు ఈ టెస్ట్ సిరీస్ లో చాలా ఉపయోగపడ్డాయి. వరుసగా ప్లేయర్స్ ఇంజ్యూరితో టీంను వీడిన కూడా ఉన్న కొంతమంది ప్లేయర్స్ తోనే మంచి విజయాలను అందుకున్నారు. శుభ్‌మన్ గిల్ తన తొలి కెప్టెన్సీలో ఈ మైలురాయిని సాధించాడు. ఈ టెస్ట్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇండియా క్రికెట్ భవిష్యత్తుకు ఇక ఎలాంటి ఇబ్బంది లేదంటూ ఈ టెస్ట్ సిరీస్ తో క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపొయ్యారు. అలాగే శుబ్మన్ గిల్ తాను ఒక గొప్ప బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.. మంచి కెప్టెన్ ని అని కూడా నిరూపించుకున్నాడు.





















