IRE Vs IND: మొదట తడబడి - ఆపై నిలబడి - భారత్ ముందు యావరేజ్ టార్గెట్ ఉంచిన ఐర్లాండ్!
భారత్‌తో జరుగుతున్న మొదటి టీ20లో ఐర్లాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది.
![IRE Vs IND: మొదట తడబడి - ఆపై నిలబడి - భారత్ ముందు యావరేజ్ టార్గెట్ ఉంచిన ఐర్లాండ్! IRE Vs IND 1st T20I: Ireland Scored 139 Runs For 7 Wickets Against India in First T20 IRE Vs IND: మొదట తడబడి - ఆపై నిలబడి - భారత్ ముందు యావరేజ్ టార్గెట్ ఉంచిన ఐర్లాండ్!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/18/aaea9b5fac0a25b30d2fb8692eca787d1692374474909252_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
భారత్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ మంచి పోరాట పటిమ కనిపించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 139 పరుగులు సాధించింది. ఐర్లాండ్ తరఫున బ్యారీ మెకార్తీ (51 నాటౌట్: 33 బంతుల్లో, నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసీద్ కృష్ణ, రవి బిష్ణోయ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి భారత్‌కు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. ఓపెనర్్ ఆండ్రూ బాల్‌బిర్నీ, లొరాన్ టక్కర్‌లు మొదటి ఓవర్లోనే పెవిలియన్ బాట పట్టారు. దీంతో ఐర్లాండ్ నాలుగు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.
కెప్టెన్ పాల్ స్టిర్లింగ్, హ్యారీ టెక్టర్, డాక్రెల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. వీరు కూడా అవుట్ కావడంతో ఐర్లాండ్ 31 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. కనీసం 70 పరుగులైనా చేస్తుందా అన్న తరుణంలో కర్టిస్ కాంఫర్, మార్క్ అడెయిర్ వెస్టిండీస్‌ను ఆదుకున్నారు. వీరు ఆరో వికెట్‌కు 28 పరుగులు జోడించి వికెట్ల పతనాన్ని ఆపారు. వీరు క్రీజులో కుదురుకుంటున్న దశలో అడెయిర్‌ను బిష్ణోయ్ పెవిలియన్ బాట పట్టించాడు.
ఆ తర్వాత కర్టిస్ కాంఫర్‌కు బ్యారీ మెకార్తీ జత కలిశాడు. ఐర్లాండ్ ఈ మాత్రం స్కోరు అయినా సాధించిందంటే అది వీరిద్దరి చలవే. వీరు ఏడో వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించారు. ఇన్నింగ్స్ 18వ ఓవర్లో కాంఫర్ అవుటయినా బ్యారీ మాత్రం చివరి వరకు క్రీజులో ఉండి జట్టుకు ఓ మోస్తరు స్కోరు అందించాడు.
Innings Break!
— BCCI (@BCCI) August 18, 2023
Two wickets apiece for @Jaspritbumrah93, @prasidh43 and Ravi Bishnoi and one wicket for Arshdeep Singh as Ireland post a total of 139/7 on the board.
Scorecard - https://t.co/cv6nsnJqdO… #IREvIND pic.twitter.com/Wk9n8nkeq8
ఐర్లాండ్ తుది జట్టు
పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్ (వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, క్రెయిగ్ యంగ్, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్
భారత్ తుది జట్టు
రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (వికెట్ కీపర్), రవి బిష్ణోయ్
Double-success in the very first over!
— BCCI (@BCCI) August 18, 2023
And it's the #TeamIndia Captain @Jaspritbumrah93 who strikes twice with the new ball ⚡️⚡️
Ireland 13/2 after 3 overs.
Follow the match ▶️ https://t.co/cv6nsnJY3m… #IREvIND pic.twitter.com/afkP2NcnI5
Also Read: విరాట్ కోహ్లీ @ 15 ఏళ్లు! వికెట్ల మధ్యే 510 కి.మీ పరుగెత్తిన ఏకైక వీరుడు!
Also Read: నేను రిలాక్స్‌డ్‌గా ఉన్నా! ఎంజాయ్ చేసేందుకే వస్తున్నా - బుమ్రా!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)