News
News
వీడియోలు ఆటలు
X

IPL: ఐపీఎల్‌లో కొత్త రూల్స్- ఈ సీజన్ నుంచే అమలు- అవేంటంటే..!

IPL 2023 New Rules: ఈనెల 31 నుంచి మొదలుకాబోయే ఐపీఎల్ -16 సీజన్ లో కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి.

FOLLOW US: 
Share:

IPL 2023 New Rules: మూడు వారాలుగా క్రికెట్ ప్రేమికులకు అలరిస్తున్న  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తుది అంకానికి చేరింది. ఈ లీగ్ లో ఇక మిగిలింది  రెండు మ్యాచ్ లు మాత్రమే. డబ్ల్యూపీఎల్ ముగిసిన వెంటనే   భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను  సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) - 16 వ సీజన్ మొదలుకాబోతుంది.  మార్చి 31 నుంచి ఈ లీగ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో   వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో పలు కీలక నిబంధనలను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తీసుకురాబోతుంది. 

నిబంధనలివే.. 

బ్యాటర్లకు అనుకూలించే ఫీల్డింగ్ మార్పులు, పవర్ ప్లే, రెండు డీఆర్ఎస్ లు.. ఇలా  ప్రతీ సీజన్ ఏదో కొత్త నిబంధనతో వస్తూ క్రికెట్ ను మరింత వినోదభరితమైన ఆటగా మారుస్తున్న  బీసీసీఐ.. ఈ సీజన్ లో కూడా అటువంటి నిబంధనలను మరికొన్నింటినీ తీసుకొచ్చింది. 

టాస్ వేశాక జట్లను ప్రకటించవచ్చు :  దీని ప్రకారం..  ఇప్పటివరకు  టాస్ వేయడానికంటే ముందే రెండు జట్లూ ఆ మ్యాచ్ లో ఆడబోయే తుద జట్ల వివరాలను  ప్రత్యర్థి సారథులకు, రిఫరీకి అందజేయాలి.  ఒక్కసారి ప్రత్యర్థి సారథికి  షీట్ అందజేశాక మళ్లీ దానిలో మార్పులు చేయడానికి ఉండదు. కానీ కొత్త నిబంధన ప్రకారం టాస్ వేశాక కూడా తుది జట్లను మార్చుకోవచ్చు.  టాస్  గెలుపోటములను నిర్ణయించడంలో కీలకభూమిక పోషిస్తున్న నేపథ్యంలో తమ అత్యుత్తమ జట్టును ఎంచుకునేందుకు అవకాశముంటుంది. టాస్ వేశాక 15 మందితో కూడిన  టీమ్ షీట్ ను అందించాలి. ఇందులో తుది జట్టులో ఆడే 11 మందితో పాటు  నలుగురు సబ్‌స్టిట్యూట్ (ఇంపాక్ల్ ప్లేయర్ తో కలుపుకుని) లు ఉంటారు. 

ఈ నిబంధన  ముఖ్యంగా  ఈ సీజన్ నుంచి కొత్తగా అమల్లోకి రాబోతున్న ‘ఇంపాక్ట్ ప్లేయర్’ విషయంలో సాయపడుతుంది.  ఉదాహరణకు  గుజరాత్  టైటాన్స్ జట్టు టాస్ గెలిచినా, ఓడినా.. తమ టీమ్ వివరాలను  వెల్లడించిన తర్వాత  కూడా  మ్యాచ్ ప్రారంభానికి ముందు తుది జట్టులో మార్పులు చేసుకోవచ్చు.  సాయి సుదర్శన్ స్థానంలో  రాహుల్ తెవాటియాను  తీసుకోవచ్చు. ఈ మార్పు చేశామని ప్రత్యర్థి టీమ్ సారథికి చెప్పల్సిన అవసరం లేదు.   ఈ  నిబంధనను  ఈ ఏడాది సౌతాఫ్రికా వేదికగా జరిగిన ఎస్ఎ 20 లీగ్ లో అమలుచేశారు.  

- ఓవర్ రేట్ పెనాల్టీ పడితే 30 యార్డ్స్  సర్కిల్ లో   నలుగురు ఫీల్డర్లే ఉంటారు.  అంటే ఒక బౌలర్ కు కేటాయించిన నిర్దిష్ట  సమయంలో అతడు ఓవర్ ను పూర్తి చేయాలి. లేకుంటే పెనాల్టీ పడుతుంది. 

- ఫీల్డర్  లేదా వికెట్ కీపర్ ఏదైనా తిక్క చేష్టలకు పాల్పడితే  బంతిని డెడ్ బాల్ గా ప్రకటించడంతో పాటు   అపోజిషన్ టీమ్ కు ఐదు పరుగులు కూడా లభిస్తాయి. 

కాగా  పై నిబంధనలలో  చాలా మట్టుకు  బ్యాటర్ ఫ్రెండ్లీ ఉన్నవే ఎక్కువ. గతేడాది  ఐపీఎల్ లో పది జట్లు ఆడినా అనుకున్న స్థాయిలో   విజయవంతం కాకపోవడంతో  బీసీసీఐ ఈ  లీగ్ కు  కొత్త హంగుల (నిబంధనలు)ను అద్ది  క్రేజ్  పెంచాలని యత్నిస్తున్నది. మరి ఇవి ఎంతమేరకు విజయం సాధిస్తాయన్నది త్వరలోనే తేలనుంది. 

Published at : 23 Mar 2023 09:19 AM (IST) Tags: BCCI Indian Premier League IPL IPL 2023 Schedule sa 20 IPL 2023 Updates IPL New Rules

సంబంధిత కథనాలు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Team India Tour Of West Indies: టీమిండియా విండీస్ టూర్‌కు షెడ్యూల్ ఖరారు! - అమెరికాలోనూ మ్యాచ్‌లు

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Ashes 2023: గాయంతో ఇంగ్లాండ్ స్టార్ స్పిన్నర్ ఔట్ - రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాడిని ఒప్పిస్తున్న హెడ్‌కోచ్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

Kohli Test Records: రికార్డుల వేటలో రన్ మిషీన్ - కోహ్లీని ఊరిస్తున్న మైల్ స్టోన్స్

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: ఓవల్ ఎవరికి అనుకూలం - భారత్, ఆసీస్‌ల రికార్డులు ఎలా ఉన్నాయి?

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

WTC Final 2023: మాకా.. నాకౌట్‌ ప్రెజరా! ఐసీసీ ట్రోఫీపై ద్రవిడ్‌ రెస్పాన్స్‌ ఇదీ!

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!