DC vs GT Live: సొంత గ్రౌండ్‌లో టాస్ ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ - వార్నర్ సేనదే బ్యాటింగ్
DC vs GT Live: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్‌లు ఢిల్లీ వేదికగా తలపడనున్నాయి. ఐపీఎల్‌లో ఇది ఏడో మ్యాచ్.
DC vs GT Live: డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి తొలి మ్యాచ్‌లోనే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఓటమి రుచి చూపించిన గుజరాత్ టైటాన్స్ నేడు (మంగళవారం) ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడుతున్నది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. డేవిడ్ వార్నర్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సొంత మైదానంలో చెలరేగాలని ఢిల్లీ భావిస్తున్నది.
Gujarat Titans have won the toss and elect to bowl first against @DelhiCapitals
— IndianPremierLeague (@IPL) April 4, 2023
Live - https://t.co/9Zy9HcuWS6 #TATAIPL #DCvGT #IPL2023 pic.twitter.com/q43LKdiAHm
పుంజుకోవాలని ఢిల్లీ..
గత మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 50 పరుగుల తేడాతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్.. నేటి పోరులో మాత్రం కమ్‌బ్యాక్ ఇచ్చి సీజన్‌లో బోణీ కొట్టాలని చూస్తున్నది. నేటి మ్యాచ్‌లో ఢిల్లీకి కీలక పేసర్ అన్రిచ్ నోర్జే ఆడనున్నాడు. రొవ్మన్ పావెల్ స్థానంలో అన్రిచ్ వచ్చాడు. పంత్ స్థానాన్ని భర్తీ చేసిన అభిషేక్ పొరెల్ కూడా తుదిజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. నోర్జే కలుస్తుండటం ఢిల్లీ పేస్ దళాన్ని బలోపేతం చేసేదే. నోర్జేతో పాటు ఖలీల్, సకారియాలు గుజరాత్ బ్యాటింగ్ లైనప్ ను ఎలా కట్టడి చేస్తారో మరి..?
లక్నోతో పోరులో బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో ఢిల్లీ దారుణంగా విఫలమైంది. 194 పరుగుల లక్ష్య ఛేదనలో కీలక బ్యాటర్లు పృథ్వీ షా, మిచెల్ మార్ష్, సర్ఫరాజ్ ఖాన్, రిలీ రూసో, రొవ్మన్ పావెల్, అమన్ ఖాన్‌లు విఫలమయ్యారు. కెప్టెన్ డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో ఢిల్లీ కాస్త మెరుగైన స్కోరు చేసింది. నేటి మ్యాచ్‌లో మాత్రం ఈ బలహీనతను అధిగమించాలని ఢిల్లీ కోరుకుంటున్నది. ఆరంభంలో ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా రెచ్చిపోతే భారీ స్కోరు చేయడం పెద్ద విషయమేమీ కాదు. మార్ష్, రూసో విజృంభిస్తే..
గుజరాత్ బలంగా..
తొలి మ్యాచ్ లో బౌలింగ్ లో విఫలమైనా ఛేజింగ్ లో గుజరాత్ బ్యాటింగ్ దుమ్ము రేపింది. 179 పరుగుల లక్ష్య ఛేదనను మరో నాలుగు బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకుంది. చెన్నైతో మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహాలతో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ (కేన్ విలియమ్సన్ స్థానంలో) గా వచ్చిన సాయి సుదర్శన్ కూడా ఫర్వాలేదనిపించాడు. హార్ధిక్ విఫలమైనా నేటి మ్యాచ్ లో గుజరాత్ తో డేవిడ్ మిల్లర్ కూడా కలుస్తుండటం.. వీరికి తోడు విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా రాణిస్తే ఢిల్లీకి తిప్పలు తప్పవు. తొలి మ్యాచ్ లో గాయపడ్డ కేన్ విలియమ్సన్ స్థానంలో గుజరాత్.. మిల్లర్ ను బరిలోకి దించుతున్నది. విజయ్ శంకర్ స్థానంలో సాయి సుదర్శన్ వచ్చాడు.
బౌలింగ్ విషయానికొస్తే గుజరాత్‌కు టీమిండియా వెటరన్ మహ్మద్ షమీ కొండంత ఆస్తి. చెన్నైతో మ్యాచ్ లో జోషువా లిటిల్ కాస్త పరుగులిచ్చినా అతడు కూడా ప్రమాదకర బౌలరే. వీరికి తోడు అల్జారీ జోసెఫ్ చెలిరేగితే ఢిల్లీ బ్యాటింగ్ లైనప్‌కు చుక్కలే. స్పిన్నర్ రషీద్ ఖాన్ మాయకు వార్నర్ సేన ఎలా తట్టుకుంటుందనేది ఆసక్తికరం.
పిచ్ రిపోర్టు : ఢిల్లీలోని అరుణ్ జైట్లీ (ఫిరోజ్ షా కోట్ల) స్టేడియం మందకొడిగా ఉంటుంది. ఇన్నింగ్స్ మొదట్లో కాస్త బ్యాటింగ్ కు అనుకూలించినా రానురాను వికెట్ నెమ్మదిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. స్లో వేరియేషన్స్ ఉన్న పేసర్ల తో పాటు కుల్‌దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రషీద్ ఖాన్, సాయి కిషోర్ లకు అనుకూలంగా ఉంటుంది.
తుది జట్లు :
ఢిల్లీ క్యాపిటల్స్ : పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రూసో, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, అభిషేక్ పొరెల్, కుల్‌దీప్ యాదవ్, చేతన్ సకారియా, ఖలీల్ అహ్మద్, అన్రిచ్ నోర్జే
గుజరాత్ టైటాన్స్ : వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మహ్మద్ షమీ, జోషువా లిటిల్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్