IPL 2022: ఐపీఎల్ అయిపోయింది, ఇక ఝార్ఖండ్ ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీబిజీ - అసలేం జరిగిందంటే !
MS Dhoni is doing duty in elections: ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి.
డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ IPL 2022లో లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ సీజన్‌లో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో సీఎస్కే నిలిచింది. ఐపీఎల్ ముగియగానే సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ తన సొంత రాష్ట్రం ఝార్ఖండ్‌కు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల విధులలో భారత మాజీ కెప్టెన్ ధోని నిమగ్నమై ఉన్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐపీఎల్ ముగిసింది, ఎలక్షన్ డ్యూటీలో ధోనీ భాయ్ బిజీ బిజీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయం ఏంటో ఇక్కడ తెలుసుకోండి.
వైరల్ అయిన ఫొటో.. వాస్తవం ఇదే
ఝార్ఖండ్‌లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా, ఐపీఎల్ లో సీఎస్కే ఇంటిదారి పట్టడంతో ధోనీ రాంచీకి వెళ్లిపోయాడు. ఎన్నికల డ్యూటీలో పాల్గొన్నాడని ప్రచారం జరిగింది. కానీ వైరల్ ఫొటోలో ఉన్నది ధోనీ కాదు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ పేరు వివేక్ కుమార్, ఆయన సీసీఎల్ విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా కౌంటింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వివేక్ కుమార్ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. ఎన్నికలు జరుగుతున్నది కూడా ఝార్ఖండ్ అవడంతో వివేక్ కుమార్‌ను ధోనీగా భావించి నెటిజన్లు స్పందించారు. ఐపీఎల్ అయిపోయింది, ఇక ఎలక్షన్ డ్యూటీలో ధోనీ బిజీ అని కామెంట్లు చేశారు. కానీ ఆ ఫొటోలో కనిపిస్తున్న వ్యక్తి వివేక్ కుమార్ అని తెలిసింది.
ఐపీఎల్ 2022లో ధోనీ స్కోర్..
ఎంఎస్ ధోనీ సీజన్ మధ్యలో సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు మరోసారి అందుకున్నాడు. ఐపీఎల్ 2022లో ఎంఎస్ ధోని 14 మ్యాచ్‌ల్లో 33.14 సగటుతో 232 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో 1 హాఫ్ సెంచరీ కూడా చేశాడు. దాంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రతి సీజన్‌లోనూ కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డ్ ధోనీ సొంతమైంది.
ఐపీఎల్ 2023లో ఆడనున్న ధోనీ
ఐపీఎల్ 2022లో లీగ్ చివరి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) రాజస్థాన్‌తో ఆడింది. ఆ మ్యాచ్‌లో సీఎస్కే ఓడి, ఓటమితో సీజన్ ముగించింది. అయితే ఇది తన చివరి ఐపీఎల్ మ్యాచ్ కాదని ధోనీ స్పష్టం చేశాడు. ఐపీఎల్ సీజన్ 16లోనూ తనను చూడవచ్చునని, మరింత స్ట్రాంగ్‌గా సీఎస్కే తిరిగి వస్తుందని ధోనీ పేర్కొన్నాడు. చెన్నైలో మ్యాచ్‌లు ఆడకపోవడం తనకు నచ్చలేదన్నాడు. వచ్చే ఏడాది చెన్నై వేదికగా ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడతామని ఆకాంక్షించాడు.
Also Read: RR Vs RCB Highlights: బెంగళూరును బాదేసిన బట్లర్ - రెండోసారి ఫైనల్‌కు రాజస్తాన్!