T20Is:ఒక్క పరుగూ ఇవ్వకుండా ఏడు వికెట్లు, టీ20 క్రికెట్ లో సంచలనం
Rohmalia: ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండోనేసియా బౌలర్ రోహ్మాలియా.. 3.2 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క రన్ కూడా ఇవ్వకుండా ఏకంగా 7 వికెట్లు తీసింది.
క్రికెట్ చరిత్రలో టీ20 ఫార్మట్ కు ఉన్న ఆదరణ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పొట్టి ఫార్మేట్ లో ప్లేయర్లు మెరుపు ఇన్నింగ్స్ ఆడుతుంటారు. పురుష జట్లు, మహళా జట్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు తమదైన శైలిలో రెచ్చిపోయి ఆడుతుంటారు. ఇప్పుడు తాజాగా
ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఒక సంచలన రికార్డు నమోదైంది. ఇండోనేషియా, మంగోలియా మహిళల జట్ల మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో ఇండోనేషియా ప్లేయర్ రోహ్మాలియా చరిత్ర సృష్టించింది. 3.2 ఓవర్లు బౌలింగ్ వేసిన 17 ఏళ్ల యువ ప్లేయర్ ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏడు వికెట్లు పడగొట్టింది. అవి ఆమె బౌలింగ్ కోటాలో మూడు మెయిడిన్ ఓవర్లు. మంగోలియాతో బాలిలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఐదో టీ20 మ్యాచ్‌లో ఈ టీనేజ్ ఆఫ్ స్పిన్నర్ 20 బంతులు వేసి, ఏడుగురు బ్యాటర్లను డకౌట్‌గా పెవిలియన్‌కు పంపించి రికార్డు స్థాయి బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది. దీంతో మంగోలియా జట్టు 24 పరుగులకే ఆలౌట్ కాగా.. ఈ మ్యాచ్ లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇంతకీ రోహ్మాలియాకు ఇదే అరంగేట్ర మ్యాచ్ . ఇలా తన అరంగేట్రంలో ఆమె ఏడు వికెట్లు తీసి అన్ని (పురుషులు మరియు మహిళలు) టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసింది. అంతే కాదు మహిళల టీ20లో ఏడు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా రోహ్మాలియా నిలిచారు. ఆమె కంటే ముందు ఈ ఫీట్‌ను అర్జెంటీనాకు చెందిన అలిసన్ స్టాక్స్ 7 వికెట్లకు 3 పరుగులతోనూ , నెదర్లాండ్స్‌కు చెందిన ఫ్రెడెరిక్ ఓవర్‌డిజ్క్ 7 వికెట్లకు 3 పరుగులుతోనూ ముందు ఉన్నారు.
రోహ్మాలియా దెబ్బకి ఈ మ్యాచ్‌లో ఇండోనేషియా 127 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బుధవారం జరిగిన ఈ ఐదో టీ20లో ఇండోనేషియా విమెన్స్ టీమ్ మొదట 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. నందా సకారిని 44 బంతుల్లో 61 పరుగులతో అలరించింది. ఆమెతో పాటు హిల్వా నూర్ కూడా రాణించింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన మంగోలియా జట్టును రోహ్మాలియా సరిగ్గా 3 ఓవర్ లలో కట్టిపడేసింది. ఆమె దెబ్బకు అపోజిషన్ టీమ్‌లో ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరు చేయలేదు. సెండ్యూరెన్ చేసిన 7 పరుగులే ఆ టీం హైస్కోరర్. నిప్పులు చెరిగే బంతులతో మంగోలియాను కూల్చిన రోహ్మాలియా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు ఎంపికైంది.