అన్వేషించండి

Kohli Shocking Desicion: విదేశాల్లో స్థిర పడనున్న కోహ్లీ - ఇప్పటికే రంగం సిద్ధం, ధ్రువీకరించిన కోహ్లీ చిన్ననాటి కోచ్ 

Kohli News: టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన విదేశాల్లో స్థిరపడాలని నిర్ణయించినట్లు సమాచారం.

Ind Vs Aus Test Series: భారత స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ విదేశాల్లో స్థిరపడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతని కుటుంబం లండన్‌లో ఎక్కువగా నివసిస్తుండగా, త్వరలోనే పూర్తిగా తన మకాం అక్కడికే మార్చాలని కోహ్లీ భావిస్తున్నట్లు సమచారం. కోహ్లీ విదేశాలకు షిప్టయ్యే విషయంపై అతని చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే కోహ్లీ లండన్‌లో స్థిర పడుతారని పేర్కొన్నాడు. కోహ్లీ భార్య ప్రముఖ సినీ నటి అనుష్క శర్మ, పిల్లలు వామిక, ఆకాయ్‌లతో ప్రస్తుతం లండన్‌లోనే అనుష్క నివసిస్తోంది. నిజానికి ఆకాయ్ కడుపులో ఉన్నప్పటి నుంచే తను లండన్‌లో నివసిస్తోంది.

లండన్‌లో మకాం..
కోహ్లీ దంపతులకు లండన్‌లో భారీ భవంతి ఉన్నట్లు తెలుస్తోంది. క్రికెట్ నుంచి విరామం దొరికినప్పుడల్లా అతను లండన్ చెక్కేసి, తన కుటుంబంతో గడపటానికి కోహ్లీ ఇష్టపడుతుంటాడు. ఇదే నేపథ్యంలో శాశ్వతంగా లండన్‌లోనే స్థిరపడాలని కోహ్లీ నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, కోహ్లీ కోచ్ శర్మ చేసిన వ్యాఖ్యలు మాత్రం దీనికి బలం చేకూరుస్తున్నాయి. మరోవైపు ఎక్కువగా లండన్‌లోనే గడపడంపై భారత అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే పలుసార్లు అసంతృప్తి వెళ్లగక్కిన సంగతి తెలిసిందే. కేవలం మ్యాచ్‌లు ఉన్నప్పుడు మాత్రమే ఇండియాకు రావడం లేదా జట్టుతో కలవడం ఆ తర్వాత లండన్‌కి వెళ్లడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో లండన్‌లోనే కోహ్లీ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోనున్నాడనే విషయం ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. 

Also Read: Smriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదుSmriti Mandhana 2 World Records: రికార్డుల రాణి స్మృతి మంధాన .. ఒకేరోజు రెండు ప్రపంచ రికార్డులు బద్దలు.. గతవారం కూడా ఒక వరల్డ్ రికార్డు నమోదు

రిటైర్మెంట్ యోచన..!!
నిజానికి 36వ పడిలో ఉన్న కోహ్లీ.. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు అడపదడపా జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువగా టెస్టులకు మాత్రమే అందుబాటులో ఉంటున్నాడు. అలాగే ఐపీఎల్ టోర్నీ జరుగుతున్నప్పుడు ఇండియాలో ఎక్కువగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో అతను పూర్తిగా ఆటకు వీడ్కోలు పలికే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే టెస్టుల్లో అంతంతమాత్రంగా రాణిస్తున్న కోహ్లీ.. ఆస్ట్రేలియాతో రాబోయే రెండు టెస్టుల్లో రాణించాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఈ రెండు టెస్టుల్లో ఒకవేళ విఫలమైతే తన నుంచి రిటైర్మెంట్ లాంటిది ఏదైనా వచ్చే అవకాశముందని పలువురు భావిస్తున్నారు. మరోవైపు గతంలో రిటైర్మెంట్ గురించి కోహ్లీ స్పందించాడు. క్రికెట్లో తాను అనుకున్నవి అన్ని సాధించాను అనుకున్న రోజున అకస్మాత్తుగా రిటైర్మైంట్ ప్రకటిస్తానని తెలిపాడు. అది ఎప్పుడు అన్నది తాను చెప్పలేనని పేర్కొన్నాడు. ఏదేమైనా కోహ్లీ విదేశాల్లో స్థిర పడుతాడుతాడని అతని కోచ్ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. 

Also Read: Look Back 2024 In Sports: తగ్గేదే లే.. 2024లో అదరగొట్టిన టీమిండియా.. అటు ర్యాంకుల్లోనూ, ఇటు రికార్డుల్లోనూ జోరు.. అభిమానులకు గుర్తుండి పోయేలా ఆటతీరు

టాప్ హెడ్ లైన్స్

Harbhajan - Sreesanth Drama: శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
శ్రీశాంత్‌ను రూమ్‌మేట్‌గా కోరిన హర్భజన్ .. కానీ శ్రీశాంత్ మాత్రం, బాక్సింగ్ రింగ్‌లోకి రమ్మని ఛాలెంజ్, స్లాప్‌గేట్ వివాదంలో ట్విస్ట్!
Gambhir Coach Tenure: గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
గంభీర్ హెడ్ కోచ్ పదవికి బిగ్ ప్రొటెక్షన్.. సాకింగ్ రూమర్స్ పై బిసిసిఐ క్లారిటీ!
Rohit Sharma's Future Twist: రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
రోహిత్ , 2027 వరల్డ్ కప్ ఫ్యూచర్ పై మాజీ క్రికెట‌ర్ మైండ్ బ్లాకింగ్ అనాల‌సిస్.. హిట్‌మ్యాన్ ఏజ్, ఎనర్జీపై వ్యాఖ్య‌లు!
Sarfaraz Vs Jurel IND vs SL: సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!
సర్ఫరాజ్ ఖాన్ రీ-ఎంట్రీతో ప్లేయింగ్ ఎలెవన్ లో బిగ్ డిబేట్..జురెల్, స‌ర్ఫ‌రాజ్ మ‌ధ్య‌లో పోటీ.. 15 నుంచి తొలి టెస్టు!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget