అన్వేషించండి

India vs Pakistan: వచ్చే ఏడాది మార్చి 1న లాహోర్‌లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్!

INDIA VS PAKISTHAN వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా, పాకిస్థాన్ జట్లు మార్చి 1న లాహోర్ లో తలపడనున్నాయట. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్  షెడ్యూలును ఐసీసీకి పీసీబీ ఈరోజే సమర్పించిందట.

ICC Champions Trophy | ఈసారి జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరగబోయేది ఎక్కడో తెలుసా? లాహోర్ లో. అవునండీ వచ్చే ఏడాది జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన డ్రాఫ్ట్  షెడ్యూలును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి సమర్పించింది. ఈ షెడ్యూల్ ను ఈ ట్రోఫీలో ఆడనున్న అన్ని దేశాలూ సమ్మతించాయి. తమ సపోర్టు ఉంటాయని చెప్పాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. 

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఆసక్తి లేని క్రికెట్ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు. దాయాది దేశాల పోరుకు విపరీతమైన వ్యూవర్ షిప్ ఉంటుంది.  ప్రపంచకప్ ను టైటిల్ విజేతగా ముగించిన టీమ్ ఇండియా.. ఆ మెగా టోర్నీలో పాక్ తో ఆడిన మ్యాచ్ లోనూ విజయం సాధించింది. లో స్కోరింగ్ మ్యాచ్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. యూఎస్ లో జరిగిన ఈ మ్యాచ్ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. కోట్ల మంది అభిమానులు టీవీలను అతుక్కుపెట్టుకుని మరీ ఆ మ్యాచ్ చూశారు. అయితే  పాక్ సూపర్ 8 దాకా కూడా రాలేకపోెవడంతో ఈ రెండు జట్లూ తిరిగి తలపడే అవకాశం రాలేదు. ఇక మళ్లీ ఈ జట్లు ఎప్పుడు తలపడతాయా అని ఎదురు చూస్తోన్న క్రికెట్ అభిమానులకైతే ఇది నిజంగా గుడ్ న్యూసే.

ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ వచ్చే ఏడాది మార్చి ఒకటిన లాహోర్ వేదికగా జరగనుంది. దీనికి సంబంధించి షెడ్యూలుని పీసీబీ ఇప్పటికే ఐసీసీకి సబ్మిట్ చేసిందట. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి సంబంధించి డ్రాఫ్ట్ షెడ్యూల్‌ను  ఐసీసీకి పీసీబీ జూలై 3న  సమర్పించినట్లు పీటీఐ ఓ నివేదకలో తెలిపింది.  

పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ

ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్ లోని లాహోర్, కరాచీ, రావల్పిండి లు  వేదికలవ్వనున్నాయి.  లాహోర్‌లో ఏడు మ్యాచులు,  కరాచీలో మూడు, రావల్పిండిలో ఐదు మ్యాచ్‌లు ఇలా మొత్తం 15 మ్యాచులు జరగనున్నాయి. ప్రారంభ మ్యాచ్ తో కలిపి రెండు సెమీఫైనల్స్‌ కరాచీలో జరగనుండగా,  ఫైనల్ మ్యాచ్‌కు రావల్పిండి ఆతిథ్యమివ్వనుంది.

ఐసీసీకి పీసీబీ సమర్పించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1న లాహోర్‌ వేదికగా భారత్ - పాక్ తలపడనున్నట్లు తెలుస్తోంది. భద్రతాపరమైన కారణాల వల్ల టీమిండియా ఆడబోయే గ్రూపు స్టేజీ మ్యాచ్‌లన్నింటినీ  లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలోనే ఆడేట్లు షెడ్యూల్ చేశారు. ఈ షెడ్యూల్ ను ఈ ట్రోఫీలో ఆడనున్న అన్ని దేశాల క్రికెట్ బోర్డులూ  సమ్మతించాయి. తమ సపోర్టు ఉంటాయని కూడా చెప్పాయి. కానీ బీసీసీఐ మాత్రం ఇంకా దీనిపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. ఈ టోర్నీకి భారత జట్టును పంపే విషయంలోనూ ఇంకా ఏమీ నిర్ణయించలేదు.

దాయాది దేశాల మధ్య చాలా ఏళ్లుగా సరిహద్దు వివాదాలు రగులుతున్నాయి. అలాగే దాడులు ప్రతిదాడులతో ఇండో పాక్ సరిహద్దు రావణ కాష్టంలా ఏళ్లుగా రగులుతూనే ఉంది. పాక్ ఉగ్రవాద కార్యకలాపాలు సరిహద్దుకే పరిమితం కాకుండా దేశం నలుమూలలా అడపా దడపా వినిపిస్తూనే ఉన్నాయి.  ఇలాంటి పరిస్థితుల్లో భారత్, పాక్ జట్లు కేవలం ఐసీసీ టోర్నీలు,  ఆసియా కప్ వంటి టోర్నీల్లో మాత్రమే తలపడుతున్నాయి.

పాక్ జట్టు భారత్ లో అప్పుడప్పుడూ పర్యటిస్తున్నప్పటికీ.. భారత జట్టు దాయాది దేశానికి దాదాపు వెళ్లట్లేదు.  ఇలాంటి పరిస్థితుల్లో పాక్ పెట్టిన డ్రాప్ట్ షెడ్యూల్ కు బీసీసీఐ సైతం అంగీకారం తెలపాలంటే భారత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తరువాతే అది సాధ్యమని తెలుస్తోంది.  క్వాలిఫై అయితే భారత్ అడే సెమీ ఫైనల్ సహా అన్ని మ్యాచులూ లాహోర్ లోనే జరిగేట్లు పాక్ క్రికెట్ బోర్డు ఈ మ్యాచ్ షెడ్యూలును రూపొందించింది. అయితే దీనికి సంబంధించిన టెంటెటివ్ షెడ్యూల్ ని ఐసీసీకి  పీసీబీ ఛైర్మన్ మోసిన్ నక్వీ ప్రపంచకప్ ఫైనల్ రోజే సబ్మిట్ చేశారట. ఐసీసీ ఆహ్వానంపై బార్బడోస్ వెళ్లి ఫైనల్ చూసిన ఆయన అప్పుటే ఈ షెడ్యూల్ పై సమాచారం ఇచ్చారని సైతం తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
IND VS SL Galle Day 2 Updates: గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..
గాలే టెస్టులో భార‌త్ భారీ స్కోరు.. పడిక్కల్ 167 రన్స్ తో విశ్వరూపం.. స‌త్తా చాటిన రాహుల్, జురెల్..

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget