అన్వేషించండి

India vs England 5th Test: రోహిత్‌, గిల్‌ శతకాలు, భారీ స్కోరు దిశగా భారత్‌

Rohit Sharma and Shubman Gill: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న చివరి టెస్ట్‌ రెండో రోజు ఆటలో టీమిండియా సారధి రోహిత్‌ శర్మ, స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ శతకాలతో చెలరేగారు.

 Rohit Sharma and Shubman Gill  finished centuries :ఇంగ్లాండ్‌(England)తో జరుగుతున్న చివరి టెస్ట్‌ రెండో రోజు ఆటలో టీమిండియా(Team India) సారధి రోహిత్‌ శర్మ(Rohit sharma), స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌(Shubman Gill) శతకాలతో చెలరేగారు. రోహిత్‌ 140 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో శతకాన్ని అందుకోగా... దూకుడుగా ఆడిన గిల్‌ 10 ఫోర్లు, అయిదు సిక్సులతో వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవ‌ర్‌నైట్ స్కోర్ 135-1తో రెండో రోజు ఇన్నింగ్స్ ఆరంభించిన భార‌త్ భారీ స్కోర్ దిశ‌గా ప‌య‌నిస్తోంది. కుర్ర ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైస్వాల్(57) హాఫ్ సెంచ‌రీ బాదడంతో టీమిండియా ఇన్నింగ్స్ ప‌రుగులు పెట్టింది. అయితే.. ఫిఫ్టీ త‌ర్వాత బ‌షీర్ ఓవ‌ర్లో య‌శ‌స్వీ ఔటైనా.. రోహిత్, గిల్‌లు మ‌రో వికెట్ ప‌డ‌కుండా ఆడారు .


హిట్‌మ్యాన్‌ మరో సిక్సుల రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో సిక్సులు కొట్టడంతో తనను మించిన మొనగాడు మరొకరు లేరని టీమిండియా సారధి రోహిత్‌శర్మ మరోసారి నిరూపించాడు. ఇప్పటికే సిక్సర్ల కింగ్‌లా పేరు గడించిన హిట్‌మ్యాన్‌ మరో అరుదైన రికార్డున తన పేరిట లిఖించుకున్నాడు.  ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో ధ‌ర్మశాల వేదిక‌గా జ‌రుగుతున్న ఐదో టెస్టులో హిట్‌మ్యాన్‌ ఈ ఘనత సాధించాడు. మార్క్‌వుడ్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టడంతో డ‌బ్ల్యూటీసీలో 50 సిక్సర్ల మైలురాయిని రోహిత్‌ చేరుకున్నాడు. రోహిత్ త‌రువాతి స్థానంలో రిష‌బ్ పంత్ ఉన్నాడు. అత‌డు 38 సిక్సర్లు బాదాడు. ఓవ‌రాల్‌గా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డు ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ పేరిట ఉంది. ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు. బెన్ స్టోక్స్ 78 సిక్సర్లతో టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో అగ్రస్థానంలో ఉండగా... 50 సిక్సర్లతో రోహిత్‌ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 38 సిక్సర్లతో రిషబ్‌పంత్‌ తర్వాతి స్థానంలో.... 29 సిక్సర్లతో బెయిర్‌ స్టో నాలుగో స్థానంలో ఉన్నారు. 29 సిక్సర్లతో జైస్వాల్ అయిదు, 25 సిక్సర్లతో ట్రానిస్‌ హెడ్‌ ఆరో స్థానంలో ఉన్నారు. 


మరో రికార్డు ముంగిట
ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో మ‌రో మూడు సిక్సర్లు బాదితే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల‌లో క‌లిపి 600 సిక్సర్లు కొట్టిన మొద‌టి ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టిస్తాడు. మూడు ఫార్మాట్లలో 471 మ్యాచ్‌లు ఆడిన శ‌ర్మ 594 సిక్సర్లు కొట్టాడు. మరో ఆరు సిక్సర్లు కొడితే ఆరు వందల సిక్సర్లు కొట్టిన తొలి ఆటగాడిగా రోహిత్‌ నిలుస్తాడు. రోహిత్ శ‌ర్మను మ‌రో రికార్డు ఊరిస్తోంది. ధ‌ర్మశాల టెస్టులో హిట్‌మ్యాన్‌ క‌నీసం ఒక్క సిక్సర్ బాదినా అత‌డి ఖాతాలో మరో రికార్డు చేరుతుంది. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో 50 సిక్సర్లు కొట్టిన మొద‌టి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌ రికార్డుల‌కు ఎక్కనున్నాడు.


హెలికాఫ్టర్‌లో రోహిత్‌ గ్రాండ్‌ ఎంట్రీ
హిట్‌మ్యాన్‌ ప్రత్యేక ప్రైవేట్‌ హెలికాప్టర్‌లో ధర్మశాలలో అడుగుపెట్టాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతోంది. రోహిత్‌ హెలికాప్టర్‌లో ధర్మశాలకు వచ్చి జట్టుతో చేరాడు. గుజరాత్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధికా మర్చంట్‌ ప్రీ వెడ్డింగ్‌ వేడుకలకు హాజరైన రోహిత్‌ తర్వాత ప్రత్యేక ప్రైవేట్‌ హెలికాఫ్టర్‌లో ధర్మశాలకు చేరుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Rishabh Ancestral House: ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ
ఉత్తరాఖండ్ లో  పంత్ పాత ఇంటి రీకన్స్ట్రక్షన్.. 20 ఏళ్ల తర్వాత తల్లి ఎంట్రీతో విలేజర్స్ పండగ..
Laxman On Nitish: నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
నితీష్ రెడ్డి గాయాలపై వివిఎస్ లక్ష్మణ్ కామెంట్స్.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో సంచలన విషయాలు, బ్రోంకో టెస్ట్‌ వెనుక  ట్విస్ట్!
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Sarfaraz Khan Returns: టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!
టీమిండియాలోకి సర్ఫరాజ్ సర్ప్రైజ్ రీ-ఎంట్రీ.. సాయి సుదర్శన్ ప్లేస్ లో లక్కీ ఛాన్స్, ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు ద‌క్కుతుందా!

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Job Notifications Politics: ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
ఉద్యోగాలు భర్తీ చేస్తే విజేతలు తప్ప అందర్నీ రెచ్చగొట్టడమే - నిరుద్యోగులతో రాజకీయ పార్టీల కొత్త రాజకీయం - ప్రభుత్వాలు రిస్క్ తీసుకుంటాయా?
West Bengal Politics : బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
బెంగాల్‌లో తృణమూల్‌కు కరవైన రక్షణ - ఎక్కడికెళ్లినా దాడులు - బీజేపీ వచ్చినా పరిస్థితి మారలేదా?
Colombia Earthquake: కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
కొలంబియాలో 7.4 తీవ్రతతో భూకంపం! వేలల్లో ఇళ్లు ధ్వంసం, వంద మందికిపైగా మృతి! 
Priyanka Chopra: సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
సిద్ధి వినాయక టెంపుల్‌లో ప్రియాంక చోప్రా... Varanasi కోసం ఇండియా వచ్చి...
AP DSC Notification 2026: అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
అక్టోబర్‌లో వచ్చే డీఎస్సీ  సిలబస్ ఇదేనా? మార్పులు ఉంటాయా?
Fact Check: చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
చైనా సైన్యం అరుణాచల్ ప్రదేశ్‌లోకి ప్రవేశించిందా? వైరల్ వీడియోలో నిజమెంత? 
VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
ఆగష్టు 12వ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు! కానీ..ఈ 4 రాశులవారు జాగ్రత్తగా ఉండాలి?
Embed widget