అన్వేషించండి

India vs England 4th Test: 353 పరుగులకు ఇంగ్లాండ్‌ ఆలౌట్‌, అజేయంగా నిలిచిన రూట్‌

Ind vs Eng: రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. జో రూట్‌ 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ వైపు రూట్‌ అడ్డుగోడలా నిల్చినా... అవతలి వైపు వికెట్లన్నీ నేలకూలాయి.

Joe Root finishes unbeaten on 122: రాంచీ(Ranchi)లో జరుగుతున్న నాలుగో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌(England)లో ఇంగ్లాండ్‌ 353 పరుగులకు ఆలౌట్‌ అయింది. జో రూట్‌(Joe Root) 122 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఓ వైపు రూట్‌ అడ్డుగోడలా నిల్చినా... అవతలి వైపు వికెట్లన్నీ నేలకూలాయి. ఏడు వికెట్ల నష్టానికి 302 పరుగుల ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్‌... మరో 51 పరుగులు జోడించి ఆలౌట్‌ అయింది. ఓలీ రాబిన్సర్‌ అర్ధ శతకం సాధించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ రాబిన్సన్‌ టెస్టుల్లో తొలి అర్ధ శతకం సాధించాడు. మరోవైపు రూట్‌ బజ్‌బాల్‌ ఆటకు స్వస్తి పలికి ఆచితూచి బ్యాటింగ్‌ చేశాడు. రూట్‌-రాబిన్సన్‌ కలిసి ఎనిమిదో వికెట్‌కు 100 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ భాగస్వామ్యాన్ని జడేజా విడదీశాడు. జడేజా వేసిన బంతిని రివర్స్‌ స్వీప్‌ ఆడబోయిన రాబిన్సన్‌ వికెట్‌ కీపర్‌ చేతికి చిక్కాడు. ఇంగ్లాండ్‌ రివ్యూకి వెళ్లినా ఫలితం లభించలేదు. ఇదే ఓవర్‌లో జడేజా మరో వికెట్‌ తీశాడు. నాలుగో బంతికి బషీర్‌ను ఔట్‌ చేశాడు. దీంతో ఇంగ్లాండ్‌ 9వ వికెట్‌ కోల్పోయింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో రూట్‌ 122*, రాబిన్సన్‌ 58, బెన్‌ ఫోక్స్‌ 47, జాక్‌ క్రాలే 42, బెయిర్‌స్టో 38 పరుగులు చేశారు. భారత బౌలర్లలో జడేజా 4, ఆకాశ్‌ 3, సిరాజ్‌ 2 వికెట్లు తీయగా అశ్విన్‌కు ఒక వికెట్‌ దక్కింది.

ఆరంగేట్రంలోనే ఇరగదీసిన ఆకాశ్‌
రాంచీలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో అరంగేట్ర బౌలర్‌ ఆకాశ్‌దీప్‌(Akash Deep) తొలి రోజు మ్యాచ్‌లో అదరగొట్టాడు. అద్భుతమైన బంతులతో ఇంగ్లాండ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. మంచి లైన్‌ అండ్‌ లెంత్‌తో.. షార్ట్‌ పిచ్‌ బంతులతో... బ్రిటీష్‌ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. తొలుత క్రాలేను అద్భుతమైన బంతితో ఆకాశ్‌దీప్‌ బౌల్డ్‌ చేసినా అది నో బాల్‌ కావడంతో క్రాలే బతికిపోయాడు. ఆ బంతి నో బాల్‌ అయినా... మ్యాచ్‌కు హైలెట్‌గా నిలిచింది. అనంతరం కూడా మంచి టచ్‌లో కనిపించిన ఆకాశ్‌ పేస్‌తో ఇంగ్లాండ్‌ బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అనంతరం ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన ఆకాశ్‌ దీప్‌... ఆ తర్వాతి ఓవర్‌లోనే మరో వికెట్‌ తీసి బ్రిటీష్‌ జట్టను కోలుకోలేని దెబ్బ తీశాడు. పదో ఓవర్లో డకెట్‌ను అవుట్‌ చేసిన ఆకాశ్‌... ఒక బంతి విరామం తర్వాత ఒలిపోప్‌ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో బ్రిటీష్‌ జట్టు ఒకే ఓవర్లో రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాతి ఓవర్‌లోనే క్రాలేను బౌల్డ్‌ చేసిన ఆకాశ్‌ ఇంగ్లాండ్‌ జట్టును కోలుకోలేని దెబ్బ తీశాడు. 

అశ్విన్‌ అరుదైన రికార్డులు
రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా బౌలర్లు చెలరేగారు. తొలి సెషన్‌లోనే అయిదు వికెట్లు నేలకూల్చి ఇంగ్లాండ్‌ను కష్టాల్లోకి నెట్టారు. అరంగేట్ర పేస‌ర్ ఆకాశ్ దీప్ మూడు వికెట్లతో నిప్పులు చెరిగాడు. ఆ త‌ర్వాత అశ్విన్, జ‌డేజా చెరో వికెట్‌ తీయడంతో ఇంగ్లాండ్‌ జట్టు పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. లంచ్‌కు ముందు ఓవ‌ర్లో కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను జ‌డేజా ఎల్బీగా వెన‌క్కి పంపాడు. దాంతో 112 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లండ్ ఐదో వికెట్‌ ప‌డింది. మాజీ కెప్టెన్ జో రూట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ అశ్విన్‌.. అరుదైన రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో బెయిర్‌ స్టోను అవుట్‌ చేసి అశ్విన్‌ ఈ ఘనత సాధించాడు. 23 మ్యాచుల్లోనే ఈ స్టార్‌ స్పిన్నర్‌ వంద వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య టెస్టుల్లో 100 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా అశ్విన్‌ నిలిచాడు. అశ్విన్ కంటే ముందు జేమ్స్‌ అండర్సన్‌ భారత జట్టుపై 139 వికెట్లు తీసి టాప్‌లో ఉన్నాడు

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Gathbandhan: హిందూ వివాహ సంప్రదాయంలో 'గట్ బంధన్' ఎందుకు? ఈ ముడి ప్రాముఖ్యత తెలుసా?
హిందూ వివాహ సంప్రదాయంలో 'గట్ బంధన్' ఎందుకు? ఈ ముడి ప్రాముఖ్యత తెలుసా?
Andhra King Taluka Twitter Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
Advertisement

వీడియోలు

South Africa whitewashed India | రెండో టెస్ట్ ఓడిపోయిన టీమ్ ఇండియా
Iceland Cricket Tweet on Gautam Gambhir | గంభీర్‌ను ట్రోల్ చేసిన ఐస్‌లాండ్ క్రికెట్
Ashwin Tweet on Ind vs SA Test Match | వైరల్ అవుతున్న అశ్విన్ పోస్ట్
Rohit as ambassador of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్‌ 2026 అంబాసిడర్‌గా రోహిత్
India vs South Africa Test Highlights | విజ‌యం దిశ‌గా సౌతాఫ్రికా
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Shooting: వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
వైట్ హౌస్ దగ్గర ఆప్ఘన్‌ యువకుడి కాల్పులు! ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులకు గాయాలు!
India Wedding Season: 44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
44 రోజుల్లో 46 లక్షల వివాహాలు... ఎక్కువ పెళ్లిళ్లు ఏ రాష్ట్రంలో జరుగుతున్నాయో తెలుసా?
Gathbandhan: హిందూ వివాహ సంప్రదాయంలో 'గట్ బంధన్' ఎందుకు? ఈ ముడి ప్రాముఖ్యత తెలుసా?
హిందూ వివాహ సంప్రదాయంలో 'గట్ బంధన్' ఎందుకు? ఈ ముడి ప్రాముఖ్యత తెలుసా?
Andhra King Taluka Twitter Review - 'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
'ఆంధ్ర కింగ్ తాలూకా' ట్విట్టర్ రివ్యూ: నో మోర్ డౌట్... ఒక్కటే రిపోర్ట్... రామ్ సినిమా హిట్టా? ఫట్టా?
Relationship Numerology: ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు భర్త మనసు సులభంగా గెలుచుకుంటారు!  వైవాహిక జీవితంలో వీరిదే పై చేయి!
ఈ తేదీల్లో జన్మించిన అమ్మాయిలు భర్త మనసు సులభంగా గెలుచుకుంటారు! వైవాహిక జీవితంలో వీరిదే పై చేయి!
Fenugreek Water : ఉదయాన్నే మెంతి నీరు తాగితే ఏమవుతుంది? బరువు నుంచి చర్మం వరకు హెల్త్ బెనిఫిట్స్ ఇవే
ఉదయాన్నే మెంతి నీరు తాగితే ఏమవుతుంది? బరువు నుంచి చర్మం వరకు హెల్త్ బెనిఫిట్స్ ఇవే
Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 80 రివ్యూ... తనూజా, సుమన్ లకు బ్యాడ్ లక్... మానస్ ను ఓడించిన డెమోన్... భరణి వర్సెస్ దివ్య
బిగ్‌బాస్ డే 80 రివ్యూ... తనూజా, సుమన్ లకు బ్యాడ్ లక్... మానస్ ను ఓడించిన డెమోన్... భరణి వర్సెస్ దివ్య
Pawan warning to YSRCP: రాజోలు గడ్డపై నుంచి వైసీపీకి పవన్ సవాల్ - 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే..రాసుకోండి!
రాజోలు గడ్డపై నుంచి వైసీపీకి పవన్ సవాల్ - 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే..రాసుకోండి!
Embed widget