Rohit Sharma: శతకంతో మెరిసిన రోహిత్, విమర్శలకు హిట్ మాన్ చెక్
IND vs ENG 3rd Test: రాజకోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో హిట్ మాన్ సత్తా చాటాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఓపికగా బాటింగ్ చేసి అద్భుత శతకంతో టీమిండియాను పోటీలోకి తెచ్చాడు
IND vs ENG 3rd Test Team India Captain Rohit Sharma Century: రాజకోట్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో హిట్ మాన్ సత్తా చాటాడు. తన సహజ శైలికి విరుద్ధంగా ఓపికగా బాటింగ్ చేసిన రోహిత్(Rohit Sharma) అద్భుత శతకంతో టీమిండియాను పోటీలోకి తెచ్చాడు.. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ భారత్ను రోహిత్..జడేజా ఆదుకున్నారు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన స్థితిలో రోహిత్ శతకంతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు 11 ఫోర్లు, 2 సిక్సలతో సెంచరీ చేసి భారత్ జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. రవీంద్ర జడేజా కూడా అర్ధ శతకంతో రాణించాడు. మ్యాచ్ ప్రారంభమైన అరగంటలోనే 10 ఓవర్లు కూడా కాకముందే భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. యంగ్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, రజత్ పటిదార్, శుభ్ మన్ గిల్ త్వరగానే ఔట్ అయ్యారు. వరుస వికెట్లు పడుతున్న క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు.
గతంలో ఇంగ్లాండ్ పై డబుల్ సెంచరీతో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ ఈసారి 10 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శుభ్ మన్ గిల్ డకౌట్ గా పెవిలియన్ కు చేరాడు. రజత్ పటిదార్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. 5 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్ లో బెన్ డకెట్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్.