India vs England: ఇంగ్లాండ్ లక్ష్యం 399 - ఛేదన అంత తేలికేం కాదు
India vs England 2nd Test : వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 255 పరుగులకు ఆలౌటైంది.
![India vs England: ఇంగ్లాండ్ లక్ష్యం 399 - ఛేదన అంత తేలికేం కాదు India vs England 2nd Test Day 3 ENG need 398 to win in Visakhapatnam India vs England: ఇంగ్లాండ్ లక్ష్యం 399 - ఛేదన అంత తేలికేం కాదు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/04/567631bd8cd284b6a88545b618952c011707042179562872_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India vs England 2nd Test day 3: వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్‌కు భారత్ 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్ (104) సెంచరీతో సత్తా చాటాడు. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 253 పరుగులకు ఆలౌటైంది.
శుభ్‌మన్ శతక నినాదం:
విమర్శలను తిప్పికొడుతూ.. అనుమానాలను పటాపంచలు చేస్తూ టీమిండియా స్టార్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) శతక నినాదం చేశాడు. రెండో టెస్ట్‌లో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో గిల్ 132 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సులతో 100 పరుగులు చేసి సత్తా చాటాడు. వన్ డౌన్‌లో శుభ్‌మన్ గిల్‌కు ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో పెద్దగా రాణించని గిల్... రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లోనూ త్వరగానే అవుటై నిరాశను మిగిల్చాడు. గత ఐదు టెస్టుల్లో గిల్ అత్యధిక స్కోరు 36 పరుగులే. వైజాగ్ టెస్టులో 34 పరుగులు చేసి జోరు మీద కనిపించి హాఫ్ సెంచరీ అయినా చేస్తాడన్న అభిమానుల ఆశ నెరవేరలేదు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో మ్యాచ్‌ను పూర్తిగా భారత్ చేతుల్లోకి తెచ్చేశాడు గిల్.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)