IND Vs WI 2nd T20I: భారత్, వెస్టిండీస్ రెండో టీ20కి సర్వం సిద్ధం - లైవ్ ఎక్కడ చూడాలి?
భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది.
IND vs WI Playing XI: ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం భారత్, వెస్టిండీస్ మధ్య జరగనుంది. గయానాలో ఇరు జట్లు ముఖాముఖి తలపడనున్నాయి. తొలి టీ20లో భారత జట్టుపై వెస్టిండీస్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కమ్‌బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల తుది జట్లు ఎలా ఉంటాయి? అలాగే ఇండియా, వెస్టిండీస్ రెండో టీ20 మ్యాచ్‌ని లైవ్ ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అని తెలుసుకుందాం.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎలా చూడాలి?
గయానా వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. డీడీ స్పోర్ట్స్‌లో భారత్, వెస్టిండీస్ మ్యాచ్‌ను భారత అభిమానులు లైవ్ చూడవచ్చు. ఇది మాత్రమే కాకుండా జియో సినిమా, ఫ్యాన్‌కోడ్‌లో మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు. అభిమానులు ఫ్యాన్‌కోడ్‌లో మ్యాచ్‌ని చూడటానికి నగదు చెల్లించాల్సి ఉంటుంది. కానీ డీడీ స్పోర్ట్స్, జియో సినిమాల్లో ఉచితంగా చూడవచ్చు.
భారత తుది జట్టు (అంచనా)
శుభమాన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్
వెస్టిండీస్ తుది జట్టు (అంచనా)
కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మాన్ పావెల్ (కెప్టెన్), జాసన్ హోల్డర్, రొమారియో షెపర్డ్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్
భారత్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ నాలుగు పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం భారత్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితం అయి ఓటమి పాలైంది. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యం సాధించింది.
వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ రొవ్‌మన్ పావెల్ (48: 32 బంతుల్లో, మూడు ఫోర్లు, మూడు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనతో పటు వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ (41: 34 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) కూడా రాణించాడు. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (39: 22 బంతుల్లో, రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (21: 21 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) తప్ప మరి ఇంకెవరూ 20 పరుగుల మార్కు దాటలేకపోయారు.
A special cross-continental friendship! 🇮🇳 🇿🇦
— BCCI (@BCCI) August 3, 2023
Tilak Varma 🤝 Dewald Brevis #TeamIndia | #WIvIND | @TilakV9 | @BrevisDewald pic.twitter.com/SLomVNjpCi
West Indies win the first #WIvIND T20I.#TeamIndia will look to bounce back in the second T20I in Guyana. 👍 👍
— BCCI (@BCCI) August 3, 2023
Scorecard ▶️ https://t.co/AU7RtGPkYP pic.twitter.com/b36y5bevoO
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial