అన్వేషించండి

IND vs SL: వానొచ్చింది! 47 ఓవర్లకు భారత్‌ 197/9.. స్పిన్‌కు విలవిల్లాడిన రోహిత్‌ సేన

IND vs SL: ఆసియాకప్‌ 2023 సూపర్‌ -4 రెండో మ్యాచులో భారత్‌ తడబడింది! పాకిస్థాన్‌పై చెలరేగిన ఇదే జట్టు లంకేయుల బౌలింగ్‌లో విలవిల్లాడింది.

IND vs SL: 

ఆసియాకప్‌ 2023 సూపర్‌ -4 రెండో మ్యాచులో భారత్‌ తడబడింది! పాకిస్థాన్‌పై చెలరేగిన ఇదే జట్టు లంకేయుల బౌలింగ్‌లో విలవిల్లాడింది. ప్రత్యర్థి స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు వణికిపోయింది. కనీసం బంతుల్ని డిఫెండ్‌ చేసుకోలేక ఇబ్బంది పడింది. వర్షంతో మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి 47 ఓవర్లకు 197/9తో నిలిచింది. కుర్ర స్పిన్నర్‌ వెల్లెలగె (5-40) టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ పతనాన్ని శాసించాడు. అతడికి చరిత్‌ అసలంక (4-14) తోడయ్యాడు. రోహిత్‌ శర్మ (53; 48 బంతుల్లో 7x4, 2x6) హాఫ్‌ సెంచరీతో మెరవడం ఉపశమనం. కేఎల్‌ రాహుల్‌ (39; 44 బంతుల్లో 2x4, 0x6) మంచి ఇంటెంట్‌ చూపించాడు. ఇషాన్‌ కిషన్‌ (33; 61 బంతుల్లో 1x4, 1x6) పరిణతి ప్రదర్శించాడు. అక్షర్‌ పటేల్‌ (15), మహ్మద్‌ సిరాజ్‌ (2) క్రీజులో ఉన్నారు.

అహో.. రోహిట్‌!

మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తొలి ఓవర్‌ నుంచే విజృంభించాడు. చూడముచ్చటైన ఏరియల్‌ షాట్లతో ప్రత్యర్థి పేసర్లకు చుక్కలు చూపించాడు. అతడికి శుభ్‌మన్‌ గిల్‌ (19; 25 బంతుల్లో 2x4) అండగా నిలిచాడు. వీరిద్దరి ఆటతో భారత్‌ 10 ఓవర్లకే 65 స్కోర్‌ చేసింది. ఇదే క్రమంలో 44 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేసిన రోహిత్‌ వన్డేల్లో 10000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. అయితే వెల్లెలగె వేసిన 11.1వ బంతికి గిల్‌ బౌల్డ్‌ అవ్వడంతో 80 పరుగుల తొలి భాగస్వామ్యానికి తెరపడింది. మరో 10 పరుగులకే కింగ్‌ విరాట్‌ కోహ్లీ (3), 15.1వ బంతికి రోహిత్‌.. వెల్లెలెగె బౌలింగ్‌లోనూ ఔటవ్వడంతో టాప్‌ ఆర్డర్‌ పని ముగిసింది.

ఆదుకున్న రాహుల్‌, కిషన్‌

కఠినమైన పిచ్‌.. లంక స్పిన్నర్లను ఆడలేని పరిస్థితుల్లో కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌ అదరగొట్టారు! మొదట వికెట్‌ పడకుండా అడ్డుకున్నారు. కిషన్‌ ఎక్కువగా డిఫెండ్‌ చేస్తున్నప్పటికీ కేఎల్‌ మాత్రం తన క్లాస్‌ కొనసాగించాడు. తనదైన టెక్నిక్‌ను చూపించాడు. మిగతావాళ్లతో పోలిస్తే వేగంగా పరుగులు సాధించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 89 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అర్ధవతకం వైపు సాగుతున్న కేఎల్‌ను జట్టు స్కోరు 154 వద్ద వెల్లెలెగేనే పెవిలియన్‌ పంపించాడు. ఆ తర్వాత చరిత్‌ అసలంక బౌలింగ్‌ అటాక్‌ను నడిపించాడు. 170 వద్ద కిషన్‌ను ఔట్‌ చేశాడు. రవీంద్ర జడేజా (4), బుమ్రా (5), కుల్‌దీప్‌ యాదవ్‌ (0) స్వల్ప స్కోర్లకే ఔట్‌ చేశాడు. అంతకు ముందే పాండ్య (5)ను వెల్లెలగె పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖర్లో అక్షర్‌ పటేల్‌ (15; 29 బంతుల్లో) పోరాడటంతో టీమ్‌ఇండియా స్కోరు 197కు చేరింది.

భారత జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్

శ్రీలంక జట్టు: పాథుమ్ నిసాంక, దిముతు కరుణరత్నె, కుశాల్‌ మెండిస్‌, సదీర సమరవిక్రమ, చరిత్‌ అసలంక, ధనంజయ డిసిల్వా, దసున్ శనక, దునిత్‌ వెల్లలగె, మహీశ థీక్షణ, కసున్‌ రజిత, మతీశ పతిరణ

పిచ్‌ రిపోర్ట్‌: పాక్‌ మ్యాచ్‌తో పోలిస్తే పిచ్‌ భిన్నంగా ఉంది. వికెట్‌పై అస్సలు పచ్చిక లేదు. ఇది పాత ప్రేమదాస స్టేడియాన్ని గుర్తుకు తెస్తోందని సంజయ్‌ మంజ్రేకర్‌ అన్నాడు. స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు. ఆకాశం నిర్మలంగా ఉంది. కారు మబ్బులేమీ లేవు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget