అన్వేషించండి

IND VS SA Highlights: సిరీస్ సమం చేసిన టీమిండియా - సౌతాఫ్రికాపై భారీ విక్టరీ!

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 82 పరుగులతో విజయం సాధించింది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో టీమిండియాకు వరుసగా రెండో విజయం లభించింది. నాలుగో టీ20లో టీమిండియా 82 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-2తో సమం చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 ఆలౌట్ అయింది.

డీకే షో...
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5: 7 బంతుల్లో, ఒక ఫోర్), వన్‌డౌన్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) విఫలం అయ్యారు. దీంతో 24 పరుగులకే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ (27: 26 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్) కూడా అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 40 పరుగులు మాత్రమే.

ఈ దశలో కెప్టెన్ రిషబ్ పంత్‌కు (17: 23 బంతుల్లో, రెండు ఫోర్లు) హార్దిక్ పాండ్యా జతకలిశాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. తన సహజశైలికి భిన్నంగా నిదానంగా ఆడిన పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేదు. ఈ దశలో హార్దిక్‌కు దినేష్ కార్తీక్ జతకలిశాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 65 పరుగులు జోడించారు. వీరు వేగంగా ఆడటంతో టీమిండియా చివరి ఐదు ఓవర్లలో 73 పరుగులు చేసింది. దీంతో 20 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి 169 పరుగులు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు తీయగా... మార్కో జాన్సెన్, డ్వేన్ ప్రిటోరియస్, నోర్జే, కేశవ్ మహరాజ్‌లకు తలో వికెట్ దక్కింది.

అదరగొట్టిన అవేష్
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేదు. కెప్టెన్, ఓపెనర్ తెంబా బవుమా రన్ తీసే సమయంలో గాయపడి రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉన్నారు.

రాసీ వాన్ డర్ డుసెన్ (20: 20 బంతుల్లో, రెండు ఫోర్లు), క్వింటన్ డికాక్ (14: 13 బంతుల్లో, రెండు ఫోర్లు), మార్కో జాన్సెన్ (12: 17 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. వరుస విరామాల్లో వికెట్లు పడటంతో దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో 87 పరుగులకే ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు, యుజ్వేంద్ర చాహల్ రెండు వికెట్లు తీసుకున్నారు. హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌లకు చెరో వికెట్ దక్కింది.

టాప్ హెడ్ లైన్స్

India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget