అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

IND Vs PAK: భారత్‌పై పాక్ పేసర్ల పంజా - ఆదుకున్న హార్దిక్, ఇషాన్ - దాయాదికి లక్ష్యం ఎంతంటే?

ఆసియాకప్ 2023 టోర్నమెంట్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 266 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆసియా కప్‌లో పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా యావరేజ్ స్కోరు సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 48.5 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్), ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీలతో రాణించారు. పాకిస్తాన్ బౌలర్లలో షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. పాకిస్తాన్ విజయానికి 300 బంతుల్లో 266 పరుగులు కావాలి.

ఆరంభంలో వరుస వికెట్లు
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ భారత్‌కు ప్రారంభంలోనే భారీ షాక్ తగిలింది. టీమిండియా బ్యాటింగ్ మూల స్తంభాలు రోహిత్ శర్మ (11: 22 బంతుల్లో, రెండు ఫోర్లు), విరాట్ కోహ్లీ (4: 7 బంతుల్లో, ఒక ఫోర్) ఇద్దరూ విఫలం అయ్యారు. వీరిద్దరినీ షహీన్ అఫ్రిది బౌల్డ్ చేసి భారత్‌ను చావు దెబ్బ కొట్టాడు. దీంతో 27 పరుగులకే భారత్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత టీమిండియా వైఫల్యాల పరంపర ఆగలేదు. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (10: 32 బంతుల్లో, ఒక ఫోర్) కూడా విఫలం అయ్యాడు. వేగంగా ఆడే ప్రయత్నంలో శ్రేయస్ అయ్యర్ (14: 9 బంతుల్లో, రెండు ఫోర్లు) కూడా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో భారత్ 66 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.

అదరగొట్టిన ఇషాన్, హార్దిక్
ఇక 150 పరుగులు చేయడం కూడా కష్టమే అనుకున్న దశలో ఇషాన్ కిషన్ (82: 81 బంతుల్లో, తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (87: 90 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) భారత్‌ను ఆదుకున్నారు. ప్రారంభంలో అనవసరపు భారీ షాట్లకు పోకుండా క్రీజులో కుదురుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఒక్కసారి టచ్‌లోకి వచ్చాక ఇషాన్ కిషన్ బౌండరీలతో చెలరేగాడు. హార్దిక్ మరో ఎండ్‌లో అతనికి చక్కటి సహకారం అందించాడు. ఈ క్రమంలోనే మొదట ఇషాన్ కిషన్, తర్వాత హార్దిక్ పాండ్యా అర్థ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.

వీరిద్దరూ ఐదో వికెట్‌కు 141 బంతుల్లోనే 138 పరుగులు జోడించారు. సెంచరీ దిశగా సాగుతున్న సమయంలో హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా గేర్ మార్చాడు. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు. అయితే షహీన్ అఫ్రిది బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి అఘా సల్మాన్ చేతికి చిక్కాడు. అయితే చివర్లో జస్‌ప్రీత్ బుమ్రా (16: 14 బంతుల్లో, మూడు ఫోర్లు) తన శక్తి మేరకు పోరాడాడు. కానీ ఆఖర్లో టీమిండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో 48.5 ఓవర్లలో 266 పరుగులకే ఆలౌట్ అయింది. షహీన్ షా అఫ్రిది నాలుగు వికెట్లు పడగొట్టాడు. నసీం షా, హరీస్ రౌఫ్ మూడేసి వికెట్లు దక్కించుకున్నారు.

భారత్ తుదిజట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

పాకిస్థాన్ తుదిజట్టు
ఫఖర్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజం (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఈ రిజల్ట్‌తో ఫ్యూచర్ క్లియర్..  కాంగ్రెస్‌, BJPకి ఆ శక్తి లేదుఫ్లైట్ లేట్ అయితే ఎయిర్ లైన్ సంస్థ ఇవి ఇవ్వాల్సిందేపెర్త్ టెస్ట్‌లో రెండో రోజు దుమ్ము లేపిన టీమిండియావయనాడ్‌లో భారీ మెజార్టీతో గెలిచిన ప్రియాంక గాంధీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vasamsetti Subhash: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌-  బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌
Comedian Ali: టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
టాలీవుడ్ నటుడు అలీకి నోటీసులు, అసలేం జరిగింది?
Game Changer: 'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
'గేమ్ చేంజర్'లో మూడో పాట  వచ్చేది ఆ రోజే... గెట్ రెడీ గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్!
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Pushpa 2: పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
పుష్పరాజ్ అడ్డాగా మారబోతున్న తెలంగాణ... ఆర్ఆర్ఆర్, కల్కి రికార్డ్స్ బద్దలయ్యేలా నైజాంలో భారీ రిలీజ్!?
Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే
Yashasvi Jaiswal Century: సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
సిక్సర్‌తో సెంచరీ సాధించిన భారత ఓపెనర్ యశస్వీ జైస్వాల్
NDA Telugu Star Campaigners : బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పవన్, చంద్రబాబు ఖాయం - ఢిల్లీ ఎన్నికల్లోనూ తురుపుముక్కలే !
Embed widget