అన్వేషించండి

IND vs PAK Asia Cup 2022 LIVE: లెక్క సరిచేసిన పాకిస్తాన్ - పోరాడి ఓడిన టీమిండియా!

IND vs PAK Asia Cup 2022 LIVE Score: దుబాయ్‌లో జరుగుతున్న ఆసియాకప్‌ సూపర్-4లో ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

LIVE

Key Events
IND vs PAK Asia Cup 2022 LIVE: లెక్క సరిచేసిన పాకిస్తాన్ - పోరాడి ఓడిన టీమిండియా!

Background

మళ్లీ దాయాదుల పోరుకు సమయం వచ్చేసింది. ఆసియా కప్ లో రెండోసారి తలపడేందుకు చిరకాల ప్రత్యర్థులు సిద్ధమయ్యారు. నేడు సూపర్- 4 లో భాగంగా జరిగే మ్యాచ్ లో భారత్- పాకిస్థాన్ ఢీకొనబోతున్నాయి. క్రికెట్ ప్రేమికులను అలరించడానికి, భావోద్వేగాల స్థాయిని పెంచడానికి, ఉత్కంఠ రేపే క్షణాలను పంచడానికి భారత్- పాక్ ఆటగాళ్లు సన్నద్ధమయ్యారు. ఆసియా కప్ లో సూపర్ - 4కు అర్హత సాధించిన దాయాది జట్లు మరో సమరానికి సై అంటున్నాయి. 

గెలిచినా అసంతృప్తే
లీగు మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయం సాధించింది. అయితే సంపూర్ణ ఆధిపత్యంతో ఆ గెలుపు అందలేదు. చివరి ఓవర్లో గెలిచిన ఆ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా తప్ప ఎవరూ స్థాయికి తగ్గట్టు బ్యాటింగ్ చేయలేదు. బౌలర్లు బాగానే ఆడినా.. బ్యాట్స్ మెన్ మాత్రం అనుకున్నంతగా రాణించలేదు. అయితే హాంకాంగ్ తో మ్యాచ్ లో రోహిత్, కోహ్లీ, సూర్యకుమార్ బ్యాట్లు ఝుళిపించారు. అయితే ఇక్కడ బౌలర్లు విఫలమయ్యారు. పసికూన హాంకాంగ్ 152 పరుగులు చేసిందంటే మన బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

తడబడుతున్న బ్యాటింగ్
ఆసియా కప్ లో భారత్ బ్యాటింగ్ విభాగం అనుకున్నంతగా రాణించట్లేదు. గాయం నుంచి కోలుకుని తిరిగివచ్చిన రాహుల్ ఇంకా ఫాంలోకి రాలేదు. పాక్ పై డకౌట్ అయిన అతను.. హాంకాంగ్ తో మ్యాచ్లో 36 పరుగులు చేయడానికి 39 బంతులు తీసుకున్నాడు. కెప్టెన్ రోహిత్ తన స్టైల్ బ్యాటింగ్ తో ఆకట్టుకోవడంలేదు. పాక్ పై ఎక్కువ బంతులు ఆడకుండానే పెవిలియన్ చేరిన రోహిత్.. పసికూనతో మ్యాచ్ లో 21 పరుగులు చేసినప్పటికీ అది తన స్థాయికి తగిన ప్రదర్శన కాదు. ఇక కోహ్లీ రెండు మ్యాచుల్లోనూ రాణించినప్పటికీ.. మునుపటిలా ఆడట్లేదన్నది అంగీకరించవలసిన విషయం. ఇక సూర్యకుమార్, పాండ్య సూపర్ ఫాంలో ఉన్నారు. అయితే ఆల్ రౌండర్ జడేజా గాయంతో ఈ టోర్నీ మొత్తానికి దూరం కావడం భారత్ కు పెద్ద దెబ్బే. దినేశ్ కార్తీక్, పంత్ కు పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. వారు ఎలా ఆడతారో చూడాల్సి ఉంది. 

బౌలింగ్ లో ఒక్కడే
భారత బౌలింగ్ విషయానికొస్తే పేసర్లలో సీనియర్ భువనేశ్వర్ ఒక్కడే రాణిస్తున్నాడు. పరుగులు నియంత్రించడంతోపాటు వికెట్లు తీస్తున్నాడు. కొత్త కుర్రాళ్లు అర్హదీప్, అవేష్ ఖాన్ అంచనాలకు తగ్గట్లు బౌలింగ్ చేయడంలేదు. ముఖ్యంగా అవేష్ ఖాన్ ధారాళంగా పరుగులు ఇస్తున్నాడు. స్పిన్ విభాగంలో చహాల్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ.. వికెట్లు తీయట్లేదు. జడేజా స్థానంలో జట్టు యాజమాన్యం అక్షర్ పటేల్ ను ఎంపిక చేసింది. అతను స్పిన్ ఆల్ రౌండరే. 

భయంకరంగా పాక్
మరోవైపు ప్రత్యర్థి పాకిస్థాన్ బ్యాటింగ్, బౌలింగ్ లలో భీకరంగా కనిపిస్తోంది. భారత్ తో మ్యాచ్ లో గెలుపు అంచుల వరకు వెళ్లిన దాయాది.. పసికూన హాంకాంగ్ ను చిత్తుచేసింది. బ్యాటింగ్ లో మెరుపులతో 193 పరుగులు చేసింది. బౌలింగ్ తో హాంకాంగ్ ను 38 పరుగులకే పడగొట్టి.. 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇది కచ్చితంగా వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసేదే. బ్యాటింగ్ లో కెప్టెన్ బాబర్ విఫలమవుతున్నప్పటికీ.. మహ్మద్ రిజ్వాన్, ఫకార్ జమాన్ షాదాబ్ ఖాన్, ఖుష్ దిల్ షా వంటివారు రాణిస్తున్నారు. బౌలింగ్ లో మొదటి నుంచి పాక్ దుర్భేద్యమే. నసీం షా, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, దహానీ వంటి వారితో పటిష్ఠంగా ఉంది. 

భారత్‌కు వార్నింగ్ బెల్
హాంకాంగ్ పై 155 పరుగుల భారీ తేడాతో గెలిచిన పాక్ భారత్ కు వార్నింగ్ బెల్ పంపింది. తమను తక్కువ అంచనా వేయొద్దని గట్టిగా చెప్పినట్లయింది. 

మరి బ్యాటింగ్, బౌలింగ్ లో సమస్యలు ఎదుర్కొంటున్న టీమిండియా.. పటిష్టంగా కనిపిస్తున్న పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఆందోళన చెందాల్సిన విషయమేమీ లేదు. ఎందుకంటే సూపర్- 4లో ఒక్కో జట్టు 3 మ్యాచులు ఆడుతుంది. కాబట్టి ఒకటి ఓడినా మిగిలిన మ్యాచుల్లో గెలిస్తే ఫైనల్ కు క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ దాయాదుల సమరంలో టీమిండియానే గెలవాలని ప్రతి ఒక్క భారతీయుడు కోరుకుంటారు.

23:27 PM (IST)  •  04 Sep 2022

19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన పాకిస్తాన్

అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. థ్రిల్లింగ్‌గా సాగిన ఈ మ్యాచ్‌లో పాక్ ఐదో బంతికి విజయం సాధించింది.

ఖుష్‌దిల్ షా 14(11)
ఇఫ్తికార్ అహ్మద్ 2(1)
అర్ష్‌దీప్ సింగ్ 3.5-0-27-1

23:15 PM (IST)  •  04 Sep 2022

19 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 175-4

భువనేశ్వర్ కుమార్ వేసిన ఈ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. 19వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 175-4గా ఉంది.

ఖుష్‌దిల్ షా 13(10)
ఆసిఫ్ అలీ 12(5)
భువనేశ్వర్ కుమార్ 4-0-40-1

23:12 PM (IST)  •  04 Sep 2022

18 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 156-4

రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో ఎనిమిది పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 156-4గా ఉంది.

ఖుష్‌దిల్ షా 7(7)
ఆసిఫ్ అలీ 1(2)
రవి బిష్ణోయ్ 4-0-26-1

23:05 PM (IST)  •  04 Sep 2022

రోహిత్‌కు అంపైర్ల హెచ్చరిక!

పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నాలుగు నిమిషాలు ఆలస్యం చేసినట్లు అంపైర్లు రోహిత్‌కు తెలిపారు.

22:58 PM (IST)  •  04 Sep 2022

17 ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 148-4

హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. మహ్మద్ రిజ్వాన్ అవుటయ్యాడు. 17వ ఓవర్ ముగిసేసరికి పాకిస్తాన్ స్కోరు 148-4గా ఉంది.

ఖుల్‌దిల్ షా 3(3)
ఆసిఫ్ అలీ 0(0)
హార్దిక్ పాండ్యా 4-0-44-1
మహ్మద్ రిజ్వాన్ (సి) సూర్యకుమార్ యాదవ్ (బి) హార్దిక్ పాండ్యా (71: 51 బంతుల్లో, ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లు)

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Maharashtra News: మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
మహారాష్ట్ర సీఎం పదవిపై తేలని పంచాయితీ! ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా ! 
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
ఆదిలాబాద్ జిల్లాలో కొత్త తరహా మోసం- తాపీ మేస్త్రీలే టార్గెట్‌గా పన్నాగం
Srikakulam Latest News: తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
తమ్మినేనిని పక్కన పెట్టిన వైఎస్‌ జగన్- ఆమదాలవలస వైసీపీలో ముసలం
Embed widget